E-Paper
Advertisement

రవితేజ ‘ఇరుముడి’పై సంగీత దర్శకుడి మాటలు వింటే.. థియేటర్స్‌లో పడిపూజే!

రవితేజ ‘ఇరుముడి’పై సంగీత దర్శకుడి మాటలు వింటే.. థియేటర్స్‌లో పడిపూజే!
Advertisement

Irumudi: మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) కు అర్జెంట్‌గా హిట్ కావాలి. సంవత్సరం మొత్తం గ్యాప్ లేకుండా ఆయన సినిమాలు చేస్తుంటారు. కానీ, సరైన హిట్ మాత్రం కొట్టలేకపోతున్నారు. ఈ మధ్యకాలంలో ఆయన నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయి. మళ్లీ ఒక్క సినిమా హిట్ పడితే.. ఇంకో 10 సినిమాల వరకు ఆయనకు తిరుగుండదు. అలాగే సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ పని చేస్తూ, కార్మికులందరికీ పనితో బిజీగా ఉండేలా చేయడంలో రవితేజ పాత్ర ఎంతో ఉంటుంది. ఆయన చేసే సినిమాలలో ఎఫెర్ట్ పరంగా కూడా రవితేజ ఎక్కడా తగ్గరు. మొదటి నుంచి ఆయన సినిమాకు 100 శాతం ఎఫర్ట్ పెడుతూనే ఉన్నారు. కానీ, కంటెంట్ విషయంలోనే ఆయన జడ్జిమెంట్ దారి తప్పుతుంది. ఈ క్రమంలో ఇప్పుడు రాబోయే సినిమాతో కచ్చితంగా హిట్ కొడతారని అంతా అనుకుంటున్నారు. ఇదే విషయం సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) కూడా చెబుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

Also Read- ఎగురుతున్న ఫ్లైట్ లో ఎన్టీఆర్ యాక్షన్ సీక్వెన్స్… తేడా కొట్టదు కదా?

హ్యాపీగా నిద్రపోవచ్చు

Advertisement

రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న చిత్రం ‘ఇరుముడి’ (Irumudi). ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అయ్యప్ప స్వామి, అయ్యప్ప మాల నేపథ్యంలో సాగే ఓ అందమైన కుటుంబం, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో స్టోరీ ఉండబోతుందని తెలుస్తోంది. అదే విషయాన్ని ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్ కూడా తెలియజేస్తోంది. తాజాగా ఈ సినిమాపై సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ చేసిన కామెంట్స్ వింటే.. రవితేజ అభిమానులు హ్యాపీగా నిద్రపోవచ్చు. ఎందుకంటే, వారికి కొన్నాళ్లుగా నిద్రలేని రాత్రులే మిగిలాయి. కానీ, ఈసారి వచ్చే సినిమా మాత్రం వారికి చక్కని విందుని ఇస్తుందని, అంత అద్భతమైన స్టోరీ ఈ సినిమాకు కుదిరిందని, స్టోరీ విని షాకయ్యానని జీవీ ప్రకాష్ అన్నారు.

Also Read- Carmeni Selvam: నా పేరు కాదు.. నా సంగీతం గురించి అంతా మాట్లాడుకోవాలి- మ్యూజిక్ డైరెక్టర్

యాక్షన్ జోనర్‌లో కొత్త ఫార్ములా

Advertisement

‘‘నిజంగా అది చాలా అద్భుతమైన స్క్రిప్ట్. ఇటీవల నేను ఆ కథ విన్నాను.. చాలా టెర్రిఫిక్‌గా ఉంది. యాక్షన్ జోనర్‌లో ఇదొక కొత్త ఫార్ములా. మంచి కమర్షియల్ సినిమా అవుతుంది. ఖచ్చితంగా ఈ సినిమా చాలా అడ్డంకులను దాటుకుని, రికార్డులను తిరగరాస్తుంది. చాలా మందికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. కథ విని నేను అంతగా ఎగ్జయిట్ అవడం చాలా అరుదుగా ఉంటుంది. కానీ, ‘ఇరుముడి’ కథ నన్ను ఎంతగానో ఎగ్జయిట్ చేసింది. సంగీతం కూడా ఆ సినిమాకు అద్భుతంగా ఉంటుంది’’ అని జీవీ ప్రకాష్ కుమార్ తన తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. అంతే, రవితేజ అభిమానులు ఆయన మాటలకు ఫుల్ ఖుషి అవుతున్నారు. అన్నకి ఈసారి హిట్ వస్తుందని అప్పుడే ఫిక్స్ అవుతున్నారు. సాయి కుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక, మీసాల లక్ష్మణ్, రాజ్ కుమార్ కసిరెడ్డి, రమణ భార్గవ్, కిషోర్ కంచెరపాలెం, కార్తీక్ అడుసుమల్లి, మహేష్ తదితరులు ఈ చిత్రంలో ఇతర పాత్రలలో కనిపించనున్నారు.

Also Read- సితార బ్యానర్ లో నితిన్ కొత్త సినిమా.. డైరెక్టర్ ఎవరంటే? ఈసారైనా హిట్ కొట్టేనా?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×