E-Paper
Advertisement

ఘట్టమనేని వారసుడు జయకృష్ణ ఎంట్రీ‌పై మహేష్ బాబు ఎమోషనల్!

ఘట్టమనేని వారసుడు జయకృష్ణ ఎంట్రీ‌పై మహేష్ బాబు ఎమోషనల్!
Advertisement

Jayakrishna Debut: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఘట్టమనేని కుటుంబానికి ఒక ప్రత్యేకమైన స్థానం, అశేషమైన అభిమాన గణం ఉన్నారు. సూపర్ స్టార్ కృష్ణ గారు నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తెలుగు సినిమా స్థాయిని పెంచితే, ఆయన వారసత్వాన్ని అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు గ్లోబల్ స్టార్‌గా దూసుకుపోతున్నారు. ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మక కుటుంబం నుండి మరో మూడో తరం వారసుడు వెండితెరకు పరిచయం కాబోతున్నాడు. కృష్ణ గారి పెద్ద కుమారుడు రమేష్ బాబు కుమారుడైన ఘట్టమనేని జయకృష్ణ హీరోగా సినీ రంగ ప్రవేశం చేయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తూ ఒక ఎమోషనల్ పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ ప్రకటన టాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Read also-స్విమ్మింగ్‌లో అదరగొట్టే సౌత్ ఇండియన్ స్టార్లు వీరే.. ఓ లుక్కేయండి..

Advertisement

మే 31.. ఒక సెంటిమెంట్

ఘట్టమనేని కుటుంబానికి, వారి అభిమానులకు మే 31వ తేదీ అనేది కేవలం ఒక రోజు కాదు, అదొక పెద్ద పండుగ. సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు కావడంతో ప్రతి ఏటా ఈ రోజున ఘట్టమనేని హీరోల సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్, టైటిల్స్, టీజర్లు విడుదల కావడం ఒక ఆనవాయితీగా వస్తోంది. ఈ సెంటిమెంట్‌ను గుర్తుచేస్తూ మహేష్ బాబు తన నోట్‌లో ఇలా పేర్కొన్నారు: “మే 31st నాకు చాలా Special Day. నా చాలా సినిమాల Title, Teaser ఇదే రోజు Release చేసేవాళ్ళం. ఈ సంవత్సరం నాన్న గారి పుట్టిన రోజున మా ఘట్టమనేని జయకృష్ణ ని తెలుగు ప్రేక్షకులకి, నాన్న గారి అభిమానులకి పరిచయం చేస్తున్నాను.” తండ్రి జయంతి రోజున తన అన్న కొడుకును హీరోగా పరిచయం చేయడం అభిమానులకు అంతకంటే పెద్ద గిఫ్ట్ మరొకటి ఉండదని చెప్పవచ్చు. అంటూ రాసుకొచ్చారు.

Advertisement

Read also-‘ధురంధర్’లో చూపించిందంతా అక్షరాలా నిజం!.. పాకిస్తానీ జర్నలిస్ట్ సంచలన వ్యాఖ్యలు

దిగ్గజ నిర్మాతల కలయికలో

జయకృష్ణ హీరోగా పరిచయం కాబోతున్న ఈ చిత్రానికి “శ్రీనివాసమంగాపురం” అనే వైవిధ్యమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ అగ్ర నిర్మాతలు సంయుక్తంగా నిర్మిస్తుండటం విశేషం. మహేష్ బాబును ‘రాజకుమారుడు’ సినిమాతో హీరోగా పరిచయం చేసిన వైజయంతీ మూవీస్ అధినేత అశ్వినీదత్, కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు, ప్రముఖ నిర్మాత పి. కిరణ్ కలిసి ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తనను ఇండస్ట్రీకి పరిచయం చేసిన నిర్మాతలే, ఇప్పుడు తన అన్న కొడుకును కూడా పరిచయం చేస్తుండటం పట్ల మహేష్ బాబు సంతోషం వ్యక్తం చేశారు.

జులై 9న గ్రాండ్ రిలీజ్

ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా ముగించుకుని విడుదలకు సిద్ధమవుతోంది. వచ్చే జులై 9న “శ్రీనివాసమంగాపురం” సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. పోస్టర్‌లో మహేష్ బాబు పక్కన జయకృష్ణ చాలా కాన్ఫిడెంట్‌గా, చక్కటి పర్సనాలిటీతో కనిపిస్తుండటంతో ఘట్టమనేని అభిమానుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. తన తండ్రి కృష్ణ పోలికలతో జయకృష్ణ లుక్ ఆకట్టుకుంటోంది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×