E-Paper
Advertisement

Virosh wedding: విరోష్ వెడ్డింగ్ ..అలిగిన గబ్బర్ సింగ్ టీమ్.. మేమేం పాపం చేసినాం అన్నా అంటూ!

Virosh wedding: విరోష్ వెడ్డింగ్ ..అలిగిన గబ్బర్ సింగ్ టీమ్.. మేమేం పాపం చేసినాం అన్నా అంటూ!
Advertisement

Virosh wedding: టాలీవుడ్ క్రేజీ కపుల్ రష్మిక మందన్న విజయ్ దేవరకొండకు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు వీరిద్దరూ ఇన్ని రోజులు పాటు రిలేషన్ లో ఉంటూ ఎట్టకేలకు తమ బంధాన్ని అధికారికంగా ప్రకటిస్తూ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇలా వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఫిబ్రవరి 26వ తేదీ వీధి వివాహం ఉదయ్ పూర్ లో ఎంతో ఘనంగా జరిగింది. ఈ వివాహపు వేడుకల అనంతరం ఈ జంట యధావిధిగా తిరిగి తమ సినిమాల పనులలో బిజీ అవుతున్నారు.

రాయల్ వెడ్డింగ్ జరుపుకున్న విరోష్..

ఇకపోతే విజయ్ దేవరకొండ రష్మిక వివాహపు వేడుకలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలకు కారణమయ్యాయి. వీరిద్దరూ రాయల్ వెడ్డింగ్ జరుపుకోవడంతో వీరి పెళ్లి ఫోటోలు కూడా సంచలనంగా మారాయి. వీరి పెళ్లి ఫోటోలకు మిలియన్స్ లైక్స్ రావడంతో ఈ జంట కూడా అభిమానుల పట్ల అంతే కృతజ్ఞత చూపిస్తూ అభిమానులకు పెద్ద ఎత్తున భోజనాలను ఏర్పాట్లు చేయడం ఆలయాలలో అన్నదానం చేయించడం వంటివి చేశారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది అభిమానులు మేం కూడా మీకు అభిమానులమే మమ్మల్ని కూడా పెళ్లికి పిలవచ్చు కదా అంటూ వీడియోలు చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి.

మమ్మల్ని పెళ్లికి పిలవచ్చు కదా

Advertisement

ఇలా మొదట ఒక వీడియో చేసిన చిన్నారిని స్వయంగా విజయ్ దేవరకొండ తన ఇంటికి ఆహ్వానించి ఆ చిన్నారికి లడ్డూలు పులిహోర పెట్టి ఎంతో ప్రేమగా పలకరించారు. అయితే తాజాగా గబ్బర్ సింగ్ సినిమా కమెడియన్స్ సైతం విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి గురించి ఒక వీడియో చేశారు. విజయ్ దేవరకొండ అన్న రష్మిక వదిన హ్యాపీ మ్యారేజ్ లైఫ్. మీకు పెళ్లయింది అన్న అందర్నీ పిలిచిండ్రు.. మమ్మల్ని పిలవచ్చు కదా అన్న.. మేము కూడా మీకు ఫ్యాన్సు.. మేము కూడా ఆర్టిస్టులమే మమ్మల్ని పిలవచ్చు కదా అన్నా. అందర్నీ పెళ్లికి పిలిచిండ్రు లడ్డూలు పెట్టారు, పులిహోర పెట్టారు మేమేం పాపం చేసినామన్నా మమ్మల్ని కూడా పెళ్లికి పిలవచ్చు కదా అంటూ గబ్బర్ సింగ్ కమెడియన్స్ సరదాగా చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

ప్రస్తుతం విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లికి సంబంధించిన ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే ప్రతి ఒక్కరు కూడా మేము కూడా మీకు అభిమానులమే కదా అంటూ వీడియోలు చేస్తున్న నేపథ్యంలో గబ్బర్ సింగ్ టీం కూడా ఈ వీడియో చేశారని తెలుస్తోంది. మరి ఈ వీడియో పై విజయ్ రష్మిక స్పందిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక పెళ్లి కోసం సినిమా షూటింగ్లకు కొంత గ్యాప్ తీసుకున్న విజయ్ రష్మిక తిరిగి తమ సినిమాల షూటింగ్ పనులలో బిజీ అయ్యారు. రష్మిక విజయ్ దేవరకొండ జంటగా రణబాలి అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read: Ranveer Singh Deepika: రణవీర్ సింగ్ దీపిక మధ్య విభేదాలు.. ఒక్క ఫోటోతో క్లారిటీ ఇచ్చిన జంట!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×