E-Paper
Advertisement

అంతర్జాతీయ క్లయింట్లు.. కళ్లు చెదిరే ఆస్తులు

అంతర్జాతీయ క్లయింట్లు.. కళ్లు చెదిరే ఆస్తులు
Advertisement

Celebrity Lifestyle: సోషల్ మీడియా ఓపెన్ చేశామంటే చాలు..ఒకప్పుడు తమ అందం, అభినయంతో సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేసిన మాజీ హీరోయిన్లు ఫోటోషూట్లతో రెచ్చిపోవడం మనం చూస్తునే ఉంటాం. ఇక ఏజ్ బార్ అవుతున్నా తెల్ల జుట్టు రాకుండా తరగని అందంతో ఉన్న ఫోటోలని చూపిస్తూ ఫిదా చేస్తుంటారు. .అయితే, పదేళ్లుగా సినిమాల్లో కనిపించని ఈ భామలు ఇంతలా ఎందుకు ఎక్స్‌పోజింగ్ చేస్తున్నారు? కేవలం అవకాశాల కోసమే ఈ పాకులాటా? అంటే.. ఫిలిమ్ సర్కిల్స్ నుండి వినిపిస్తున్న సమాధానం వింటే మీరు ముక్కున వేలేసుకోవాల్సిందే!

సినిమాలు వద్దు.. ఆ కష్టాలు అస్సలు వద్దు

Advertisement

సాధారణంగా ఫేడవుట్ అయిన హీరోయిన్లు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ కోసం ప్రయత్నిస్తుంటారు. కానీ ఈ ‘సీనియర్’ భామల రూటే వేరు. వీరికి వెండితెరపై నటించాలనే ఆసక్తి ఏ కోశానా లేదు. ఒక సినిమాలో నటించాలంటే నెలల తరబడి కాల్షీట్లు ఇవ్వాలి, మేకప్ వేసుకుని ఎండలో కష్టపడాలి. అన్నింటికీ మించి స్థానిక దర్శకుల నుండి వచ్చే ‘కమిట్‌మెంట్‌’ ఒత్తిళ్లు, ఇండస్ట్రీ పాలిటిక్స్ భరించడం కంటే.. ఈ ‘గ్లోబల్ లైఫ్’ ఎంతో మేలని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు.

హై-ప్రొఫైల్ ఎంగేజ్‌మెంట్స్.. కోట్లలో ఆదాయం

Advertisement

సినిమా రెమ్యూనరేషన్ కంటే కొన్ని వందల రెట్లు ఎక్కువ సంపాదన కేవలం కొన్ని గంటల ‘ప్రైవేట్ అసోసియేషన్’ ద్వారా వీరికి అందుతోంది.కేవలం లోకల్ బిజినెస్‌మెన్లే కాదు, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న అత్యంత సంపన్న వ్యాపారవేత్తలతో వీళ్ళకు సంబంధాలు ఉంటున్నాయ్, ఒక సినిమాలో నటించి వచ్చే పారితోషికం కంటే, దుబాయ్, సింగపూర్ వంటి నగరాల్లో జరిగే హై-ప్రొఫైల్ ప్రైవేట్ ఈవెంట్స్ ద్వారా కోట్లాది రూపాయలు గడిస్తున్నారు.”లోకల్ ప్రెజర్ కంటే గ్లోబల్ క్లయింట్స్ గౌరవప్రదంగా ఉంటారు. పైగా అక్కడ దొరికే ఆదాయం ఇండస్ట్రీ ఊహకు కూడా అందదు” అనేది టాలివుడ్ ఇన్ సైడ్ టాక్ .

7 ఏళ్ల విరామం.. 10 విల్లాలు

సినిమాలు లేక వీరు ఖాళీగా ఉన్నారని జాలిపడే వారంతా ఇప్పుడు వారి లైఫ్ స్టైల్ చూసి నోరెళ్లబెడుతున్నారు. గత 7 నుండి 12 ఏళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న కొందరు భామలు, ఇప్పుడు దేశంలోని ప్రధాన మెట్రో నగరాలైన ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌లలో అత్యంత ఖరీదైన విల్లాలు కొనుగోలు చేశారు. ఒక్కో విల్లా విలువ 20 నుండి 50 కోట్ల రూపాయల పైమాటే.అంతేకాదండోయ్ ..విదేశాల్లో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్లు, లగ్జరీ కార్ల కలెక్షన్ చూస్తుంటే.. వీరు హీరోయిన్లుగా ఉన్నప్పటికంటే ఇప్పుడే ‘బిలియనీర్’ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారని స్పష్టమవుతోంది

అందుకే ఈ ఫోటోషూట్ల అరాచకం

మరి సినిమాల్లో నటించనప్పుడు ఈ గ్లామర్ ఫోటోలు ఎందుకు? అనే సందేహం రావచ్చు. దీని వెనుక పెద్ద ‘మార్కెటింగ్’ స్ట్రాటజీ ఉంది. తాము ఇంకా ఫామ్‌లోనే ఉన్నామని, తమ గ్లామర్ ఏమాత్రం తగ్గలేదని అంతర్జాతీయ క్లయింట్లకు తెలియజేయడమే ఈ ఫోటోషూట్ల అసలు ఉద్దేశం. సోషల్ మీడియాలో వచ్చే లైకులు, కామెంట్లు వారి ‘బ్రాండ్ వాల్యూ’ని పెంచుతాయి, తద్వారా వారి ప్రైవేట్ ఎంగేజ్‌మెంట్స్ రేట్లు కూడా ఆకాశాన్ని తాకుతాయి. మొత్తానికి, వెండితెర వెలుగుల కంటే ‘ప్రైవేట్ ప్రపంచం’ ఇచ్చే ఆదాయమే ముఖ్యం అనుకుంటున్న ఈ భామల అసలు కథ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×