E-Paper
Advertisement

MSGV Movie : ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో ఆ పాట పాడింది మేనకోడలేనా..?

MSGV Movie : ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో ఆ పాట పాడింది మేనకోడలేనా..?
Advertisement

MSGV Movie : టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి పండక్కి ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎక్కువగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.. జనవరి 12 నుంచి ఇప్పటివరకు పాజిటివ్ టాక్ తో పాటుగా కోట్లు కొల్లగొట్టేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా 300 కోట్ల గ్రాస్ వసూలు చేసి దూసుకుపోతుంది.. ఈ మూవీ భారీ సక్సెస్ ను సొంతం చేసుకోవడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో చిరంజీవి తన పిల్లలతో స్కూల్ లో ఉండే కొన్ని సన్నివేశాల్లో ఒక పాప్ సాంగ్ వస్తుంది.. ఆ సాంగ్ పాడిన సింగర్ గురించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..

ఫ్లై హై సాంగ్ పాడిన సింగర్ ఎవరంటే..? 

మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు మూవీ రోజు రోజులు కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. రీజినల్ సినిమా కేటగిరీలో అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీగా మెగాస్టార్ సినిమా రికార్డు సొంతం చేసుకుంది.. ఈ వీకెండ్ ఇదే జోరు నా కలెక్షన్లు వసూలు చేస్తే మాత్రం 500 కోట్లు పక్కాగా రాబడుతుందని మెగా ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.. ఇదిలా ఉంటే ఈ సినిమాలోని పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి.. ముఖ్యంగా మీసాల పిల్ల పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. ఇక ఈ మూవీలో చిన్న పిల్లలతో వచ్చిన మరో పాట ‘ఫ్లై.. హై’.. అయితే ఈ సాంగ్ గురించి ఓ న్యూస్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ పాట పాడింది స్వయానా మెగాస్టార్ మేనకోడలేనట. చిరంజీవి సోదరి మాధవి కుమార్తె నైరా నే ఈ పాట పాడినట్లు డైరెక్టర్ అనిల్ రావిపూడి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు. ఇది కేవలం నైరాకు ప్రారంభం మాత్రమేనని.. తనకు సుదీర్ఘమైన కెరీర్‌ ఉందని అనిల్ రావిపూడి ఆకాంక్షించారు.. ఈ సాంగ్ ను ఇవాళ రిలీజ్ చేశారు. ఈ వార్త విన్న మెగా అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. మెగాస్టార్ బ్లడ్ అక్కడ అంటూ కామెంట్లతో ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

Also Read : పవన్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..?

నైరా గురించి ఆసక్తికర విషయాలు..

మెగాస్టార్ చిరంజీవికి ఇద్దరు చెల్లెల్లు అన్న విషయం తెలిసిందే.. దుర్గ, మాధవి రావు. విజయ్ దుర్గ కొడుకులు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ తేజ్ హీరోలు అని అందరికి తెలిసిందే. ఇక మాధవి రావు ఒక డాక్టర్. ఈమె చిరంజీవి స్థాపించిన బ్లడ్ బ్యాంక్ అలాగే ఐ బ్యాంకులను చూసుకుంటుంది. ఈమె గురించి ఎక్కువగా ఎవరికీ తెలీదు. అప్పుడప్పుడు ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కనిపిస్తుంది. ఈమె కూతురే నైరా.. ప్రస్తుతం ఈ అమ్మాయి మ్యూజిక్ ని నేర్చుకుంటుంది. త్వరలోనే సింగర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టబోతుందని టాక్. మొత్తానికి మెగా కాంపౌండ్ నుంచి మరొకరు సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు.

Advertisement

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×