E-Paper
Advertisement

Balakrishna: బాలయ్య ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన టికెట్ ధరలు..?

Balakrishna: బాలయ్య ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన టికెట్ ధరలు..?
Advertisement

Balakrishna: గాడ్ ఆఫ్ మాసేస్, నటసింహ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఇటీవల నటించి విడుదల చేసిన చిత్రం అఖండ 2. గతంలో వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న అఖండ సినిమాకు సీక్వెల్ ఇది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందన అందుకుంది. సంయుక్త మీనన్ (Samyukta Menon) హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన ఒక తాజా అప్డేట్ అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోందని చెప్పవచ్చు.

తగ్గిన టికెట్టు ధరలు..

అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా ఈ సినిమా టికెట్ ధరలను భారీగా తగ్గించినట్లు సమాచారం. ముఖ్యంగా ఈ సినిమా విడుదల సమయంలో ప్రీమియర్ షో జీఎస్టీతో కలిపి 600 రూపాయల వరకు ఒక్కో టికెట్ ధర పలికింది. ఇక సాధారణ షోలకు సింగిల్ స్క్రీన్ లలో రూ.227 (అదనంగా 50 రూపాయలు పెంచి), మల్టీప్లెక్స్ లలో రూ.395 (అదనంగా ₹100 పెంచి) వరకు టికెట్ ధరలు అమ్ముడుపోయాయి. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం కూడా టికెట్ ధరలు పెంచడానికి అనుమతించింది. అయితే విడుదలైన మొదటి పది రోజులకు మాత్రమే ఈ ధరలు వర్తిస్తాయని తెలిపింది. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. జనవరి ఒకటి నుండి తెలంగాణ లో టికెట్ ధరలు తగ్గాయి అనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ లలో రూ.50, రూ.80, రూ.105 వంటి తక్కువ ధరలకి టికెట్టు కొనుగోలు చేయచ్చని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ వార్తలను అధికారికం చేస్తూ ఒక పోస్టర్ ద్వారా ప్రకటించారు చిత్ర బృందం.

పోస్టర్ తో అధికారికంగా ప్రకటించిన చిత్ర బృందం..

Advertisement

ఇకపోతే ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ముఖ్యంగా తెలంగాణ ప్రేక్షకులకు, శివ భక్తులకు తీపి కబురు చెబుతూ తెలంగాణకు సంబంధించి అఖండ2 టికెట్ రేట్స్ భారీగా తగ్గించినట్లు తెలిపింది. సింగిల్ స్క్రీన్ లలో 50, రూ.80, రూ.105 , మల్టీప్లెక్స్ లలో 150 రూపాయలకే ఇకపై అఖండ 2 సినిమా చూడవచ్చు అని స్పష్టం చేసింది. తగ్గించిన ధరలు 2026 జనవరి 1 నుంచి అమలులోకి వస్తాయని కూడా తెలిపింది. ప్రస్తుతం ఈ విషయం తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏపీలో కూడా రిలీజ్ కి ముందు పెంచిన రేట్స్ కాకుండా సాధారణ ధరలు అందుబాటులో ఉన్న విషయం అందరికీ తెలిసిందే.

also read:Rashmika: మరోసారి అడ్డంగా దొరికిపోయిన రష్మిక..ఇదిగో సాక్ష్యం!

అఖండ 2 సినిమా విశేషాలు..

Advertisement

బోయపాటి శ్రీను , బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన నాలుగవ చిత్రం ఇది. 2021 లో వచ్చిన అఖండ చిత్రానికి సీక్వెల్. ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందించారు. డిసెంబర్ 12న విడుదలైన ఈ సినిమా 3d, 2d , Epic ఫార్మాట్ లలో విడుదలయ్యింది. ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్ర వంటి తారలు కీలక పాత్రలు పోషించారు. 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ , ఐవి ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిర్మించబడిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ వారు పంపిణీ చేశారు. 165 నిమిషాల నిడివితో వచ్చిన ఈ సినిమాకి సుమారుగా 200 కోట్లు బడ్జెట్ కేటాయించడం గమనార్హం.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×