E-Paper
Advertisement

Samantha -Raj Nidimoru: సమంత రెండో పెళ్లి… ఆ క్షణం కన్నీళ్లాగలేదు: శిల్పారెడ్డి

Samantha -Raj Nidimoru: సమంత రెండో పెళ్లి… ఆ క్షణం కన్నీళ్లాగలేదు: శిల్పారెడ్డి
Advertisement

Samantha – Raj Nidimoru: సినీనటి సమంత (Samantha)డిసెంబర్ ఒకటవ తేదీ దర్శకుడు రాజ్ నిడిమోరు(Raj Nidimoru)ను రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఇక ఈ పెళ్లి వేడుకలలో భాగంగా చాలా కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారని తెలుస్తుంది. ఇలా సమంత పెళ్లి వేడుకలలో పాల్గొన్న వారిలో సమంత క్లోజ్ ఫ్రెండ్ డిజైనర్ శిల్పారెడ్డి(Shilpa Reddy) కూడా ఉన్నారు. శిల్పారెడ్డి ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ సమంత పెళ్ళికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

పంచభూతాల సాక్షిగా వివాహం..

ఈ సందర్భంగా శిల్పారెడ్డి మాట్లాడుతూ సమంత పెళ్లి చాలా అద్భుతంగా జరిగిందని తెలిపారు. సమంతకు ప్రతి విషయం ఎవరికీ అయితే తెలుసో వాళ్లు మాత్రమే ఈ పెళ్లి వేడుకలలో పాల్గొన్నారని సుమారు 25 మంది వరకు హాజరయ్యారని తెలిపారు. ఇక సినిమా ఇండస్ట్రీ నుంచి కేవలం నందిని రెడ్డి మాత్రమే ఈ పెళ్లి వేడుకలలో పాల్గొన్నట్లు తెలిపారు.. నేను ఎన్నో పెళ్లిళ్లు చూశాను కానీ సమంత రాజ్ పెళ్లి మాత్రం చాలా అద్భుతంగా జరిగిందని తెలిపారు. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా చాలా సాంప్రదాయబద్ధంగా వీరి వివాహం జరిగింది. ఈ వివాహంలో భాగంగా పెళ్లికూతురు పెళ్ళికొడుకు చేతి వేలికి ఒక సూత్రాన్ని కడతారు ఆ సమయంలో నా రోమాలు నిక్కబొడుచుకున్నాయని, ఆ సమయంలో సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరులే వారిలోకి వచ్చి ఏదో తెలియని శక్తిని అందించిన భావన కలిగిందని తెలిపారు. ఆ క్షణం అక్కడున్న వారందరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయని శిల్పారెడ్డి తెలిపారు.

రాజ్ చాలా సైలెంట్…

Advertisement

చాలా నిశ్శబ్దంగా పంచభూతాలు సాక్షిగా సమంత రాజ్ వివాహం చాలా అద్భుతంగా జరిగింది అంటూ శిల్పారెడ్డి సమంతా పెళ్లి విషయంలో చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఇక సమంత చాలా ఎనర్జిటిక్ పర్సన్ కానీ రాజ్ అందుకు పూర్తిగా భిన్నమని చాలా సైలెంట్ గా ఉంటారని , తాను రాజ్ ను కలవడం అదే మొదటిసారి అంటూ శిల్పారెడ్డి తెలిపారు. ఇలా సమంత పెళ్లి గురించి ఈమె తన సంతోషాన్ని తెలియజేస్తూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

సింగర్ శోభా రాజ్ బంధువా..

Advertisement

ఇక ప్రముఖ సింగర్ శోభా రాజ్ స్వయానా రాజ్ కి సమీప బంధువు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా శిల్పారెడ్డి వెల్లడించారు. ఇక సమంతకు తనకు మధ్య ఉన్న బాండింగ్ గురించి కూడా ఈ ఇంటర్వ్యూలో తెలియజేశారు. తను ఒక స్టార్ హీరోయిన్ అనే భావన మాలో ఎవరికీ ఉండదు. మా ఇద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది అంటే తిట్టుకోవడం కొట్టుకోవడం, ఒకరినొకరు కామెంట్ చేసుకోవడం వంటివి కూడా జరుగుతుంటాయని తను చాలా స్వీట్ పర్సన్ అంటూ సమంత గురించి శిల్పా రెడ్డి ఎంతో ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. ఇక సమంత విడాకులు తీసుకున్న సమయంలోను, ఆమె అనారోగ్యానికి గురైన సమయంలో ఆమె ప్రతి పేజ్ లోనూ శిల్పారెడ్డి తన పక్కనే ఉంటూ తనకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారనే చెప్పాలి.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×