E-Paper
Advertisement

నాకు బుర్రలేదు.. బ్లాక్ బస్టర్ సినిమా రిజెక్ట్ చేయడం పై ఫరియా షాకింగ్ కామెంట్స్!

నాకు బుర్రలేదు.. బ్లాక్ బస్టర్ సినిమా రిజెక్ట్ చేయడం పై ఫరియా షాకింగ్ కామెంట్స్!
Advertisement

Faria Abdullah: ఫరియా అబ్దుల్లా జాతి రత్నాలు సినిమాలోని చిట్టి పాత్రలో నటించి తన అమాయకపు నటనతో పెద్ద ఎత్తున ప్రేక్షకులను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ అనంతరం పలు సినిమాలలో నటించిన అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయారని చెప్పాలి. ఇలా ఫరియా అబ్దుల్లా(Faria Abdullah) పలు సినిమాలలో నటించిన మంచి సక్సెస్ కానీ నేపథ్యంలో ఈమె కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్స్ కూడా చేశారు. ఫరియా అబ్దుల్లా త్వరలోనే తరుణ్ భాస్కర్ తో కలిసి నటించిన గాయపడ్డ సింహం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు ఈ సినిమా మే 1వ తేదీ విడుదల కాబోతోంది.

కథల విషయంలో అవగాహన లేక..

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే ఫరియా అబ్దుల్లా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఈమె ఒక బ్లాక్ బస్టర్ సినిమాని మిస్ చేసుకున్నాను అంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. జాతి రత్నాలు సినిమా తర్వాత తనకు ఎన్నో సినిమా అవకాశాలు వచ్చాయని అయితే నాకు కథల పట్ల అవగాహన లేకపోవడంతో ఎలాంటి సినిమాలను ఎంపిక చేసుకోవాలనే విషయంపై స్పష్టత లేకపోవడంతో బ్లాక్ బస్టర్ సినిమాలను మిస్ చేసుకున్నాను అని తెలిపారు.

హనుమాన్ మూవీ మిస్ చేసుకుని తప్పు చేశాను..

Advertisement

ఇలా మిస్ చేసుకున్న సినిమాలలో హనుమాన్ సినిమా కూడా ఒకటి అంటూ ఈమె షాకింగ్ విషయాన్ని బయట పెట్టారు. ఈ సినిమాలో నటించే అవకాశం నాకు వచ్చింది అయితే ఆ సమయంలో నాకు బుర్ర లేకపోవడంతో ఈ సినిమా కథ గొప్పతనం తెలియక రిజెక్ట్ చేశాను కానీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాన్ ఇండియా స్థాయిలో మంచి సక్సెస్ అందుకున్న తర్వాత చాలా బాధపడ్డానని తెలిపారు. ఇలా హనుమాన్ సినిమాని ఫరియా అబ్దుల్లా మిస్ చేసుకున్నందుకు ఇప్పటికీ బాధపడుతున్నారని స్పష్టమవతుంది. ఇలా ఈ బ్లాక్ బస్టర్ సినిమా మిస్ చేసుకోవడంతో కథల విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నానని తెలిపారు.

గాయపడ్డ సింహం పైనే ఆశలు..

Advertisement

ఇక హనుమాన్ సినిమాలో ఈమెకు నటించే అవకాశం వచ్చినప్పటికీ ఫరియా అబ్దుల్లా ఆ కథను రిజెక్ట్ చేయడంతో ఆమె స్థానంలో అమృత అయ్యర్ అవకాశం అందుకొని మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈ సినిమాలో తన నటనకు ఏకంగా జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు రావటం విశేషం. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ గాయపడ్డ సింహం సినిమా పైనే అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా అయినా తనకు మంచి సక్సెస్ అందిస్తుందా లేదంటే తనకు మరోసారి గాయం చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ జెడి చక్రవర్తి శ్రీ విష్ణు , ఫరియా అబ్దుల్లా వంటి తదితరులు కీలక పాత్రలలో కనిపించబోతున్నారు.

Also Read: ‘లెనిన్’ విడుదల పై నాగార్జున క్లారిటీ.. ‘పెద్ది’ నీ ఢీ కొట్టబోతున్న అఖిల్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×