E-Paper
Advertisement

Ustaad Bhagat Singh : అనుకున్న దానికంటే ముందుగానే ‘దేఖ్ లేంగే’ సాంగ్ రిలీజ్… కానీ క్రేజీ ట్విస్ట్

Ustaad Bhagat Singh : అనుకున్న దానికంటే ముందుగానే  ‘దేఖ్ లేంగే’ సాంగ్ రిలీజ్… కానీ క్రేజీ ట్విస్ట్
Advertisement

Ustaad Bhagat Singh : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వయిట్ చేస్తున్న మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ మూవీ నుంచి వస్తున్న క్రేజీ అప్డేట్స్ తో మెగా ఫ్యాన్స్ లో పండగ వాతావరణం నెలకొంది. ఈ సినిమాలోని మొదటి పాట ప్రోమోను ఇప్పటికే రిలీజ్ చేసిన మేకర్స్… నేడు ఫుల్ సాంగ్ తో ట్రీట్ ఇవ్వబోతున్నట్టు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అనుకున్న దాని కంటే ముందే పాటను రిలీజ్ చేశారు. కానీ ఒక క్రేజీ ట్విస్ట్ తో.

డైరెక్టర్ స్పెషల్ పోస్ట్ 

ఇటీవలే ‘ఓజీ’ సినిమాతో ఆడియన్స్ ను పలకరించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’గా థియేటర్లలోకి రావడానికి సిద్ధం అవుతున్నారు. ‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ఇది. అందుకే మూవీని అనౌన్స్ చేసినప్పటి నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి ఈ ప్రాజెక్టుపై. అంతేకాదు ఈ మూవీకి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండటం మరో ఇంట్రెస్టింగ్ విషయం. ఈ నేపథ్యంలోనే ఈరోజు సాయంత్రం 6.30 గంటలకు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ నుంచి ‘దేఖ్ లేంగే’ సాంగ్ ను రిలీజ్ చేస్తామని వెల్లడించారు. కానీ అంతకంటే ముందే అభిమానులకు పూనకాలు తెప్పించే అప్డేట్ ను ఇచ్చారు. మద్యాహ్నం 3 గంటల సమయంలో అభిమానుల చేతుల మీదుగా లిరికల్ షీట్ ను రిలీజ్ చేసి సర్ప్రైజ్ చేశారు మేకర్స్.

Advertisement

అభిమానుల చేతుల మీదుగా… 

“తొలిసారిగా, అభిమానులు లిరిక్ షీట్‌ను విడుదల చేయనున్నారు.  ubsfirstsingle.com వెబ్‌సైట్‌లోని ప్రశ్నలకు సమాధానం ఇచ్చి, #DekhlengeSaala లిరిక్ షీట్‌ను ప్రారంభించే 100,000 మంది అభిమానులలో మీరు కూడా ఒకరిగా ఉండండి.   1 లక్ష ఎంట్రీల తర్వాత లిరిక్ షీట్ అదే సైట్‌లో ప్రదర్శించబడుతుంది.  #UstaadBhagatSingh మొదటి సింగిల్ రాజమండ్రి ఆదిత్య యూనివర్శిటీ సూరంపాలెంలో ఈరోజు సాయంత్రం ఈరోజు సాయంత్రం 6.30 గంటలకు విడుదలవుతుంది” అంటూ ట్వీట్ చేశారు నిర్మాతలు. 

Advertisement

‘దేఖ్ లేంగే’ పాటను పాపులర్ బాలీవుడ్ సింగర్ విశాల్ దద్లానీ, సింగర్ హరిప్రియ కలిసి పాడారు. భాస్కరభట్ల సాహిత్యం అందించగా, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా కన్పించబోతున్నారు. ముందుగానే లిరిక్స్ ను రిలీజ్ చేశారు కాబట్టి సాంగ్ ఎలా ఉంటుందో చూడాలని ఆతృతగా ఎదురు చూస్తున్నారు మెగా ఫ్యాన్స్. మరికొన్ని గంటల్లో ‘దేఖ్ లేంగే’ పూర్తి సాంగ్ రిలీజ్ కానుంది. ఈ మేరకు డైరెక్టర్ హరీష్ శంకర్ కొన్ని లిరిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Read Also : ఫోటోలు డిలీట్.. రెండోసారి విడాకులు తీసుకోబోతున్న డైరెక్టర్

 

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×