// // Euphoria : గుణశేఖర్ - భూమిక సినిమా మొదటిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..! - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Euphoria day 1 collections: గుణశేఖర్ – భూమిక సినిమా మొదటిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Euphoria day 1 collections: గుణశేఖర్ – భూమిక సినిమా మొదటిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!
Advertisement

Euphoria day 1 collections: ఒకప్పుడు ఇచ్చిన క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ పేరు వినగానే ప్రేక్షకుల్లో అంచనాలు ఎక్కువగా ఉండేవి. ఆయన కెరియర్ మొదట్లోనే సొగసు చూడతరమా, ఒక్కడు, చూడాలని ఉంది లాంటి సూపర్ హిట్ లు ఇచ్చారు. కానీ గత కొంతకాలంగా ఆయన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ పరిస్థితుల్లో మళ్లీ బలమైన కంబ్యాక్ కోసం ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం యుఫోరియా. ఈ సినిమా ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

చాలా రోజుల తర్వాత స్టార్ హీరోయిన్ భూమిక ఛావ్లా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. టైటిల్ ప్రకటించినప్పటి నుంచే యుఫోరియా సినిమాపై ఆసక్తి ఏర్పడింది. టీజర్, ట్రైలర్ విడుదలైన తర్వాత ఆ ఆసక్తి మరింత పెరిగింది.

Advertisement

ఈ సినిమా కథ నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా రూపొందించబడింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఒకప్పుడు సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ పబ్ ఘటనను ఆధారంగా తీసుకుని కథను మలిచారు. డ్రగ్స్, పబ్ కల్చర్, యువత ఆలోచనలు, వారి కలలు, ఆశయాలు వంటి అంశాలను కలిపి ఈ సినిమాను రూపొందించారు. అందుకే యువతకు ఈ సినిమా దగ్గరగా అనిపిస్తోందని రివ్యూలు చెబుతున్నాయి.

యుఫోరియా సినిమాలో భూమిక ఛావ్లాతో పాటు సారా అర్జున్, నాజర్, గౌతమ్ మీనన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం అందించిన కాలభైరవ, సినిమాటోగ్రఫీ చేసిన ప్రవీణ్ కుమార్ పోతన్, ఎడిటింగ్ చేసిన ప్రవీణ్ పూడి తమ పనితో సినిమాకు బలంగా నిలిచారు.

Advertisement

టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, యుఫోరియా సినిమాకు దాదాపు 15 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. సినిమా లాభాల్లోకి రావాలంటే దాదాపు 30 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రావాల్సి ఉంటుంది. తొలి రోజు విషయానికి వస్తే, ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొదటి రోజే వరల్డ్ వైడ్‌గా 2 నుంచి 3 కోట్ల రూపాయల మధ్య కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని అంచనా.

గుణశేఖర్ కెరీర్‌లో యుఫోరియా ఒక కీలకమైన సినిమా. ఈ సినిమా వీకెండ్‌లో ఎలా రాణిస్తుందో చూడాలి.

ALSO READ: Jana Nayagan:  జననాయగన్ రాకకు అంతా సిద్ధం.. విడుదల ఎప్పుడంటే?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×