E-Paper
Advertisement

ఆనంద్ దేవరకొండ ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’ నుంచి ‘ప్రియసఖి’ లిరికల్ సాంగ్ వచ్చేసింది..

ఆనంద్ దేవరకొండ ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’ నుంచి ‘ప్రియసఖి’ లిరికల్ సాంగ్ వచ్చేసింది..
Advertisement

Priyasakhi Song: ‘బేబీ’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత టాలెంటెడ్ యాక్టర్స్ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబినేషన్‌లో వస్తున్న సరికొత్త చిత్రం ‘EPIC First Semester’ (ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్). ’90s వెబ్ సిరీస్’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాంబినేషన్ పరంగానే కాకుండా, టైటిల్‌తోనే యూత్‌లో భారీ అంచనాలను క్రియేట్ చేసిన ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ ‘ప్రియసఖి’ (Priyasakhi) లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ సాంగ్ ఆడియన్స్ ముందుకు వచ్చింది.

Read also-హీరో ఉపేంద్ర ఇంట సంబరాలు.. కొడుకు ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్..

మనసును తాకే ప్రేమ గీతం

Advertisement

‘ప్రియసఖి’ సాంగ్ పూర్తిగా మెలోడియస్ గా, వినగానే ఆకట్టుకునేలా సాగింది. సరికొత్త ప్రేమలో పడిన ఒక యువకుడి మనోభావాలను, అతని జీవితంలోకి వచ్చిన అమ్మాయి వల్ల కలిగిన మధురమైన మార్పులను ఈ పాటలో అద్భుతంగా ఆవిష్కరించారు.

పాటలోని “సూర్యుడు ఎరుగని కొత్త కాంతి ఇది.. చంద్రుడు చూడని కొత్త వెన్నెలిది.. భూమికి తెలియని మట్టి వాసనిది ఏమిది ఏమిది” అనే లైన్లు శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అలాగే “జీవితాన్ని మార్చేసావే బుజ్జి నెమలి.. స్వర్గంలోతూ చూపించవే పూలకడలి” అంటూ హీరో తన ప్రేయసిని వర్ణించే విధానం యువతకు కనెక్ట్ అయ్యేలా ఉంది.

Advertisement

Read also-మహేష్ బాబు నెక్స్ట్ సినిమా దర్శకుడు ఆయనేనా?.. అయితే మాత్రం ఫ్యాన్స్‌కు పండగే..

మ్యాజిక్ రిపీట్ కానుందా?

‘బేబీ’ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యల కెమిస్ట్రీ, యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. ఇప్పుడు మళ్లీ అదే క్రేజీ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో టాలీవుడ్‌లో ఈ ప్రాజెక్ట్‌పై మంచి బజ్ ఉంది. దానికి తోడు దర్శకుడు ఆదిత్య హాసన్ మార్క్ ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాలోనూ గట్టిగానే ఉండబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

ప్రస్తుతం విడుదలైన ‘ప్రియసఖి’ లిరికల్ సాంగ్ సోషల్ మీడియాలో, ముఖ్యంగా యూట్యూబ్‌లో మంచి వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ మెలోడీ సాంగ్ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×