// // Eesha Postponed: అఖండ 2 ఎఫెక్ట్.. ఈషా కూడా వాయిదా! -->
E-Paper
Advertisement

Eesha Postponed: అఖండ 2 ఎఫెక్ట్.. వెనక్కి తగ్గుతున్న చిన్న సినిమాలు.. ఈషా కూడా వాయిదా!

Eesha Postponed: అఖండ 2 ఎఫెక్ట్.. వెనక్కి తగ్గుతున్న చిన్న సినిమాలు.. ఈషా కూడా వాయిదా!
Advertisement

Eesha Postponed: నందమూరి బాలకృష్ణ అఖండ 2 రిలీజ్‌ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ మూవీ రిలీజ్ డేట్‌ కోసం అభిమానులం ఆసక్తి ఎదురుచూస్తున్నారు. డిసెంబర్‌ 5న విడుదల కావాల్సిన ఈ చిత్రం కొన్ని గంటల ముందే వాయిదా పడటం అందరికి షాకిచ్చింది. ప్రస్తుతం కొత్త రిలీజ్ కోసం మేకర్స్‌ చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో అఖండ 2 రిలీజ్ డేట్‌పై రకరకాల వార్తలు వస్తున్నాయి. మొదట క్రిస్మస్‌ కానుగా మూవీ విడుదలయ్యే అవకాశం ఉందన్నారు.

డిసెంబర్ 12న అఖండ 2

Advertisement

అల్రేడీ రిలీజ్‌ రెడీ అయిన సినిమాని అన్ని రోజులు వాయిదా వేయడం కరెక్ట్‌ కాదని మూవీ టీం భావిస్తోంది. సినిమాని డిసెంబర్‌ 12 ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మూవీ టీం ప్లాన్‌ చేస్తుంది. ఈ రోజు దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుంది. అయితే డిసెంబర్ 12నే రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ అయినట్టు ఇండస్ట్రీ వర్గాల నుంచి గట్టి సమాచారం. అయితే అదే రోజు దాదాపు 16 చిన్న సినిమాలు విడుదల కాబోతున్నాయి. అందులో యాంకర్‌ సుమ కొడుకు నటిస్తున్న మోగ్లీ, హారర్‌ థ్రిల్లర్‌ మూవీ ఈషా, పైసావాల వంటి పలు చిన్న సినిమాలు విడుదల కాబోతున్నాయి.

ఈషా మూవీ కూడా వాయిదా?

అన్నట్టుగానే అఖండ 2 అదే తేదీకి వస్తే ఈ చిత్రాలు తప్పుకునేందుకు సిద్దంగా ఉన్నాయట. ఇప్పటికే మోగ్లీ మూవీ వాయిదా పడినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈషా కూడా వాయిదా పడబోతుంది. అఖండ 2 డిసెంబర్‌ 12నే వస్తే తమ సినిమా వాయిదా వేసుకునేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. అయితే ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్‌ని డిసెంబర్‌ 25గా అనుకుంటున్నట్టు తెలుస్తోంది. వీటన్నింటికి ఈ రోజుతో క్లారిటీ రానుంది. అఖండ 2 రిలీజ్ డేట్‌ ప్రకటిస్తే.. ఈ సినిమా వాయిదా పడుతాయా? అదే డేట్‌ వస్తాయా? అన్నది తేలిపోతుంది. మరి అప్పటి వరకు మూవీ లవర్స్‌ వేయిట్‌ చేయాల్సిందే. కాగా ప్రీమియర్స్‌ టికెట్స్‌ చేతిలో పట్టుకుని రిలీజ్‌ డేట్‌ కోసం చూస్తున్న ఫ్యాన్స్‌కి మూవీ టీం ఊహించని షాకిచ్చింది.

Advertisement

Also Read: Akhanda 2 : అఖండ 2 రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయిపోయినట్లే, ఆ సినిమాల పరిస్థితి ఏంటో

అఖండ 2 రిలీజ్ పై ఉత్కంఠ

మరికొద్ది సేపట్లో ప్రీమియర్స్‌ పడుతాయనగా మూవీ వాయిదా పడిందని ప్రకటిస్తూ ట్విస్ట్‌ ఇచ్చింది. దీనిపై అభిమానులం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అగ్ర హీరో సినిమా వాయిదా పడటమేంటని ఒక్కసారిగా అందరు సందేహంలో పడ్డారు. ఫైనాన్షియల్‌ రిజన్స్‌ కారణంగా మూవీని వాయిదా వేసినట్టు తేలింది. ప్రస్తుతం ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు మూవీ ప్రయత్నాలు చేస్తుంది. ఈ విషయం మూవీ పెద్దలు కూడా అఖండ 2 రిలీజ్‌ కోసం తమవంతు సపోర్టు చేస్తున్నారు. దీనిపై ఫైనాన్స్‌ సంస్థతో చర్చలు జరుగుతున్నాయి. అంతా ఒకే అయితే అఖండ 2 డిసెంబర్‌ 12న వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఫ్యాన్స్‌ అంత సిద్దమవ్వండి. డిసెంబర్‌ 12న థియేటర్లలో తాండవం చేసేందుకు రెడీగా ఉండండి అని అంటున్నారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×