E-Paper
Advertisement

Drushyam 3: దృశ్యం3 కి లైన్ క్లియర్… రెగ్యులర్ షూటింగ్ అప్పుడే ప్రారంభం!

Drushyam 3: దృశ్యం3 కి లైన్ క్లియర్… రెగ్యులర్ షూటింగ్ అప్పుడే ప్రారంభం!
Advertisement

Drushyam 3: వెంకటేష్(Venkatesh), మీనా(Meena) ప్రధానపాత్రలలో నటించిన సినిమాలలో దృశ్యం సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దృశ్యం రెండు భాగాలు విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి అయితే త్వరలోనే మూడవ భాగం కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న ఇప్పటివరకు దృశ్యం 3 (Drushyam 3)గురించి ఎలాంటి ప్రకటన వెలువడలేదు అయితే ఇప్పటికే నటుడు మోహన్ లాల్ దృశ్యం 3 సినిమా ప్రకటించారు. అయితే ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని వార్తలు రావడంతో వెంకీ అభిమానులు కాస్త నిరుత్సాహం వ్యక్తం చేశారు.

వెంకటేష్ దృశ్యం3 ..

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తెలుగులో కూడా దృశ్యం 3 త్వరలోనే ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది. దృశ్యం 3 కోసం డైరెక్టర్ జీతు జోసెఫ్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్టు సమాచారం. 2026వ సంవత్సరంలో ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకోబోతోందని తెలుస్తోంది. ప్రస్తుతం వెంకటేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) దర్శకత్వంలో ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

2026 లో దృశ్యం 3 ప్రారంభం..

Advertisement

త్రివిక్రమ్ డైరెక్షన్లో వెంకటేష్ సినిమా షూటింగ్ పనులు పూర్తి అయిన వెంటనే దృశ్యం 3 సినిమా పనులు ప్రారంభం కాబోతున్నాయని స్పష్టమవుతుంది. దృశ్యం 3 సినిమా ద్వారా మరోసారి వెంకటేష్ రాంబాబు పాత్రలో బిజీ కాబోతున్నట్లు సమాచారం. ఇలా వెంకటేష్ దృశ్యం 3 సినిమాకు లైన్ క్లియర్ అయిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువబడునుంది. దృశ్యం 3 సినిమా గురించి ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వెంకటేష్ నటించరని ఇదివరకు వచ్చిన వార్తలకు పూర్తిగా పులిస్టాప్ పెట్టినట్టు అయింది.

త్రివిక్రమ్ సినిమాతో బిజీగా వెంకటేష్..

Advertisement

వెంకటేష్ ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతూ బిజీగా ఉన్నారు.ఇటీవల ఈయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంక్రాంతికి వస్తున్నాను సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నారు. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ సినిమాకు కమిట్ అయ్యారు. అదేవిధంగా చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్లో రాబోతున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో వెంకటేష్ సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాల షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్న వెంకటేష్ ఈ షూటింగ్స్ పూర్తి కాగానే దృశ్యం 3 పనులలో బిజీ కానున్నారు.

Also Read: Andhra King Taluka : ఆంధ్రకింగ్ తాలూకాలో ఊహించని ట్విస్ట్.. అసలైన ఆంధ్ర కింగ్‌గా మరో స్టార్

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×