E-Paper
Advertisement

దృశ్యం3 ట్రైలర్ ఎలా ఉందంటే ..

దృశ్యం3 ట్రైలర్ ఎలా ఉందంటే ..
Advertisement

Drishyam3 Trailer :మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ దృశ్యం 3′ ట్రైలర్ ఎట్టకేలకు వచ్చేసింది.ఈ దృశ్యం ప్రాంచైజీలో వచ్చిన గత రెండు భాగాలు సెన్సేషన్ క్రియేట్ చేయడంతో ఈ మూడో పార్ట్ మీద అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇక ఈ సినిమా మే 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా మేకర్స్ వదిలిన ఈ ట్రైలర్ చూస్తుంటే మోహన్‌లాల్, మీనా మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేసేలానే కనిపిస్తున్నారు.

జీతూ జోసెఫ్ మార్క్ క్లైమాక్స్

Advertisement

గత రెండు భాగాల్లో పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్న జార్జికుట్టిని, ఈసారి ఎలాగైనా పట్టుకోవాలని పోలీసులు వేసే ఎత్తులు ఆసక్తికరంగా ఉండేలా ఉన్నాయ్. “న్యాయం ఆలస్యం అవ్వొచ్చు కానీ, తప్పించుకోలేదు” అనే డైలాగ్ ఈ సినిమా ఎలా సాగుతుందో క్లియర్ గా చెప్పేస్తుంది.అయితే జార్జికుట్టి దగ్గర ఈసారి అంతకుమించిన ప్లాన్ ఏదో ఉందని ట్రైలర్ హింట్ ఇస్తోంది. జీతూ జోసెఫ్ మార్క్ క్లైమాక్స్ ట్విస్ట్ కోసం ఫ్యాన్స్ ఇప్పుడే చర్చలు మొదలుపెట్టేశారు కూడా.

also read :అమీర్ ఖాన్ చేతిలో మరో ‘క్లాసిక్’.. ‘లగాన్’ మ్యాజిక్ మళ్ళీ సాధ్యమేనా?

Advertisement

మోహన్ లాల్ విశ్వరూపం

ఇక జార్జికుట్టి పాత్రలోమలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మరోసారి పరకాయ ప్రవేశం చేశారనే చెప్పాలి. కళ్లతోనే భయాన్ని, ధైర్యాన్ని పలికించడంలో ఆయనకు సాటి ఎవరూ లేరని ఈ ట్రైలర్ నిరూపించింది. తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఒక సామాన్యుడు చేసే పోరాటం ఎలా ఉంటుందో ఆయన నటనలో స్పష్టంగా కనిపిస్తోంది. మీనా, ఇతర నటీనటుల పెర్ఫార్మెన్స్ సినిమాకు మరింత ఎమోషనల్ వెయిట్‌ను యాడ్ చేశాయనే చెప్పాలి.

మ్యూజిక్ నెక్స్ట్ లెవల్

ట్రైలర్‌లో అనిల్ జాన్సన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉందనడంలో సందేహం లేదు. ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్‌గా, సినిమాటిక్ వండర్‌లా కనిపిస్తోంది. ‘U/A ‘ సర్టిఫికేట్‌తో వస్తున్న ఈ చిత్రం, ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు క్రైమ్ థ్రిల్లర్ ఇష్టపడే వారికి అసలైన విందు భోజనంలా ఉండబోతోందని ట్రైలర్ చూస్తె తెలిసిపోతుంది.

also read :విజయ్ వాహనం ఏదైనా.. నంబర్ మాత్రం ‘0277’.. ఎందుకంటే?

మే 21న అసలైన వేట 

ప్రపంచవ్యాప్తంగా మే 21, 2026న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది.చూడాలి మరి గత రెండు భాగాల్లో తప్పించుకున్న జార్జ్ ఈసారైనా పట్టుబడతాడా లేక నాలుగో భాగానికి తెరతీస్తాడా !

 

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×