E-Paper
Advertisement

Abhishek Pathak: తండ్రి కాబోతున్న దృశ్యం 2 డైరక్టర్.. నటి శివాలిక బేబీ బంప్ ఫోటో వైరల్!

Abhishek Pathak: తండ్రి కాబోతున్న దృశ్యం 2 డైరక్టర్.. నటి శివాలిక బేబీ బంప్ ఫోటో వైరల్!
Advertisement

Abhishek Pathak: సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు ఇటీవల కాలంలో అభిమానులకు వరుసగా గుడ్ న్యూస్ చెబుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఎంతోమంది సెలెబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టగా, మరికొందరు తల్లితండ్రులుగా ప్రమోట్ అయ్యారు. ఇక ఈ ఏడాది మరి కొంతమంది తల్లిదండ్రులుగా ప్రమోట్ కానున్నారు. ఈ ఏడాది తల్లిదండ్రులుగా మారబోతున్న వారిలో బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్స్ శివాలిక, అభిషేక్ జంట ఒకటి. బాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా కొనసాగుతున్న ఈయన నటి శివాలికను వివాహం చేసుకున్నారు.

మొదటి బిడ్డకు స్వాగతం పలకబోతున్న జంట..

దాదాపు రెండు సంవత్సరాల క్రితం నటి శివాలికతో డైరెక్టర్ అభిషేక్ పాఠక్ ఏడు అడుగులు నడిచిన సంగతి తెలిసిందే. అయితే పెళ్లి తర్వాత రెండు సంవత్సరాలకు ఈ జంట గుడ్ న్యూస్ తెలియజేశారు. వీరిద్దరూ తమ మొదటి బిడ్డకు స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. ఈ విషయాన్ని గత కొద్ది రోజుల క్రితం ఈ జంట తెలియజేశారు. అయితే తాజాగా నటి శివాలిక బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి. ఇలా ఈ బేబీ బంప్ ఫోటోలు చూసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అతి త్వరలోనే నటి శివాలిక పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారని తెలుస్తోంది .

దృశ్యం 2 సినిమాతో సక్సెస్..

Advertisement

దర్శకుడు అభిషేక్ బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలకు దర్శకుడిగా వ్యవహరించారు. ఈయన హిందీలో దృశ్యం 2 సినిమాకు దర్శకత్వం వహించి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో దృశ్యం 3 కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే.. అభిషేక్ శివాలికా ఒబెరాయ్ తో గత కొంతకాలంగా ప్రేమలో ఉంటూ.. తమ ప్రేమ విషయాన్ని అధికారకంగా తెలియచేయడమే కాకుండా వీరిద్దరూ పెద్దల సమక్షంలో ఫిబ్రవరి 2023 లో గోవాలో ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.

ఖుదా హాఫిజ్ సినిమాతో పరిచయం..

Advertisement

శివాలిక అభిషేక్ నిర్మాతగా వ్యవహరించిన ఖుదా హాఫిజ్ సినిమాలో నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడటం ఆ పరిచయం ప్రేమగా మారడం జరిగింది. ఇలా కొన్ని సంవత్సరాలు పాటు ప్రేమలో ఉన్న ఈ జంట పెళ్లి బంధంతో ఒకటయ్యారు. పెళ్లి అనంతరం శివాలిక పలు సినిమాలలో నటించారు. పెళ్లి తర్వాత వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్న ఈ దంపతులు పెళ్లయిన రెండేళ్లకు మొదటి బిడ్డకు స్వాగతం పలకటం విశేషం.

Also Read: Nayanthara: నయనతార 100 కోట్ల ఇల్లు లోపల ఎలా ఉందో చూసారా?ఇంద్ర భవనాన్ని తలపిస్తుందిగా?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×