E-Paper
Advertisement

అంతర్జాతీయ వేదికపై అరుదైన గౌరవం.. బిగ్‌బాస్ ఫేమ్ నూతన్ నాయుడికి ప్రతిష్టాత్మక ప్రొఫెసర్‌షిప్

అంతర్జాతీయ వేదికపై అరుదైన గౌరవం.. బిగ్‌బాస్ ఫేమ్ నూతన్ నాయుడికి ప్రతిష్టాత్మక ప్రొఫెసర్‌షిప్
Advertisement

Nutan Naidu: తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ కింగ్ మేకర్‌గా, బిగ్‌బాస్ ఫేమ్‌గా గుర్తింపు పొందిన డాక్టర్ నూతన్ నాయుడు అంతర్జాతీయ వేదికపై సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రముఖ ఫ్రాంక్‌ఫర్డ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆయనకు ‘ఆర్గనైజేషనల్ న్యూరోసైన్స్ అండ్ ఏఐ ఎథిక్స్’ విభాగంలో ప్రతిష్టాత్మక ప్రొఫెసర్‌షిప్‌ను, నాలుగో డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ఈ విభాగంలో ఈ అరుదైన గౌరవాన్ని అందుకున్న తొలి భారతీయుడు ఆయనే కావడం విశేషం.

 

Advertisement

రాజకీయ వ్యూహకర్తగా..

డాక్టర్ నూతన్ నాయుడు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జనసేన, కాంగ్రెస్, బీసీ వై పార్టీలకు పొలిటికల్ అడ్వైజర్‌గా వ్యవహరించి, ఆయా పార్టీల విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ప్రాంతీయంగానే కాకుండా, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సైతం ఎన్నికల వ్యూహకర్తగా, పొలిటికల్ అడ్వైజర్‌గా పనిచేసిన అపార అనుభవం ఆయన సొంతం.

Advertisement

 

గ్లోబల్ లీడర్లకు సలహాదారుడిగా..

అంతేకాదు, అంతర్జాతీయంగా పలు దేశాల ప్రధానులకు, అధ్యక్షులకు సైతం ఆయన రాజకీయ, సాంకేతిక సలహాదారుడిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా న్యూఢిల్లీలో జరిగిన ఒక హై-ప్రొఫైల్ సదస్సులో, ప్రపంచ మేధావుల సమక్షంలో ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ అంతర్జాతీయ గుర్తింపు పట్ల తెలుగు ప్రజలు మరియు ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×