E-Paper
Advertisement

Actor Mahesh :గుండెల్ని పిండేసే స్టోరీ.. సినిమాల్లోకి రాకపోతే ఏం చేసేవాడో తెలుసా..?

Actor Mahesh :గుండెల్ని పిండేసే స్టోరీ.. సినిమాల్లోకి రాకపోతే ఏం చేసేవాడో తెలుసా..?
Advertisement

Actor Mahesh : టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంతో మంది కమెడీయన్స్ బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ద్వారా వచ్చారు. ఒకప్పుడు కామెడీకి కేరాఫ్ గా మారిన జబర్దస్త్ ఇప్పుడు బూతులకు అడ్డాగా మారింది. అప్పటిలో ఎంతో మంది తమ కామెడీ టైమింగ్ తో కడుపుబ్బా నవ్విస్తున్నారు. ఇప్పుడు పంచుల పేరుతో బూతులు వినిపిస్తున్నాయని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.. జబర్దస్త్ నుంచి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కమెడీయన్స్ లలో ఒకరు నటుడు మహేష్.. తన కామెడితో బుల్లితెర ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తన టాలెంట్ తో ఇండస్ట్రీలోకి ఏంటి ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే కమెడియన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఓ షోలో పాల్గొన్న మహేష్ తల్లి గురించి అద్భుతమైన స్పీచ్ ఇచ్చి అందరిని కన్నీళ్లు పెట్టించాడు. అంతేకాదు సినిమాల్లోకి రాకపోతే ఏం చేసేవాడో వివరించారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మహేష్ సినిమాల్లోకి రాకుంటే ఏం చేస్తాడు..? 

బుల్లితెరపై ప్రసారమైన జబర్దస్త్ షో ద్వారా కామెడీతో కడుపుబ్బ నవ్వించిన మహేష్ ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. మహేష్ రంగస్థలం సినిమాతో మంచి పేరును సంపాదించుకున్నాడు. దాంతో అతని పేరు రంగస్థలం మహేష్ గా మారింది.. ఆ సినిమా అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి బెస్ట్ కమెడియన్ గా తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నాడు.. తాజాగా ఓ షోలో పాల్గొన్న మహేష్ తాను సినిమాల్లోకి రాకపోతే ఏం చేసేవాడో అన్న విషయాన్ని బయట పెట్టాడు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజానికి మహేష్ కమెడియన్ అవ్వకుంటే గేదెలు కాసుకునేవాడని ఆ షోలో చెప్పేస్తారు. పల్లెటూరు నుంచి హైదరాబాద్కు వచ్చి ఎన్నో కష్టాలని అనుభవించడం మహేష్ ఇప్పుడు స్టార్ కమెడియన్ అవడం నిజంగా గ్రేట్ అంటూ నెటిజెన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

మహేష్ రియల్ లైఫ్ & సినిమాలు.. 

Advertisement

మహేష్ అసలు పేరు మహేష్ ఆచంట.. 2018లో వచ్చిన ‘రంగస్థలం’ సినిమాలో నటించాడు. ఆ మూవీ మంచి టాక్ ను అందుకోవడంతో తన పాత్రకు గుర్తింపు పొందిన తర్వాత ఆయనకు ఆ ఇంటిపేరు వచ్చి చేరింది. అతను ‘జబర్దస్త్’ వంటి టీవీ షోల ద్వారా పేరు తెచ్చుకొని, ఆ తర్వాత వెండితెరపై కామెడీతో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా నటించారు.. ప్రస్తుతం స్టార్ కమెడియన్ గా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక మహేష్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికొస్తే.. ‘అలా నిన్ను చేరి’, ‘శశివదనే’, ‘ఫ్యామిలీ ధమాకా’ వంటి చిత్రాలతో పాటు ఇతర ప్రాజెక్టులలో కూడా నటిస్తున్నారు.. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నా సరే మరోవైపు బుల్లితెరపై ప్రసారమవుతున్న కామెడీ షోలలో ప్రత్యక్షమవుతూ తనదైన స్టైల్ లో కామెడీని పండిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు మహేష్..

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×