E-Paper
Advertisement

Nagarjuna: నాన్నగారు స్మశానం దగ్గర నాతో ఆ మాటను చెప్పారు

Nagarjuna: నాన్నగారు స్మశానం దగ్గర నాతో ఆ మాటను చెప్పారు
Advertisement

Nagarjuna: కొన్ని సినిమాలు విడుదలైన వెంటనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకోవు. కొంత టైం ఆ సినిమాలు తీసుకుంటాయి. అలా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉదాహరణలు చెప్పడానికి చాలా సినిమాలు ఉన్నాయి. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న శివ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. శివ సినిమాకు రిలీజ్ అయిన వెంటనే పాజిటివ్ టాక్ రాలేదు. సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు కూడా చాలామంది ప్రేక్షకులు సైలెంట్ గా సినిమా చూశారు.

ప్రేక్షకులు ఒక సినిమాను సైలెంట్ గా చూడటం అనేది అప్పుడు ఒక రిస్క్. ఎందుకంటే ఫైట్లు చేస్తున్నప్పుడు పాటలు వస్తున్నప్పుడు విపరీతంగా అప్పట్లో జనాలు అరుస్తూ సినిమా చూసేవాళ్ళు. కానీ శివ సినిమా విషయంలో అలా జరగలేదు. మొత్తానికి సినిమా అయిపోయిన తరువాత అర్థమైన విషయం ఏంటంటే జనాలు అందరూ కూడా ఒక షాక్ లో ఉండిపోయారు. వాళ్లు సినిమాను అంతలా ఓన్ చేసుకున్నారు అని తర్వాత కాలంలో అర్థమైంది.

స్మశానం దగ్గర నాన్నగారు చెప్పారు 

Advertisement

శివ సినిమాకు సంబంధించి మొదట పాజిటివ్ టాక్ రాలేదు నాగర్జున చాలా టెన్షన్ గా ఉన్నారు. కొంతమేరకు నెగిటివ్ టాక్ కూడా వచ్చింది. ఈ సినిమాలో కామెడీ లేదు, ఎంటర్టైన్మెంట్ లేదు, ఆడవాళ్లకు నచ్చదు అని రకరకాల కామెంట్స్ నాగార్జున విన్నారు.

అయితే అక్కినేని నాగార్జున తో పాటు అక్కినేని నాగేశ్వరరావు కారులో వెళ్తున్నారు. అక్కినేని నాగేశ్వరరావు కార్ డ్రైవింగ్ చేస్తున్నారు. పంజాగుట్ట స్మశానం దగ్గరలో నాగార్జునతో మాట్లాడుతూ ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయిపోతుంది. ఇది ఎక్కడికి వెళ్లి ఆగుతుందో నాకు తెలీదు అంటూ నాగార్జునతో చెప్పారట. అప్పుడు నాగార్జున కూడా ఆశ్చర్యపోయారు.

అక్కినేని మాటలు నిజమయ్యాయి 

Advertisement

ఈ సినిమా ఎక్కడికి పోయి ఆగుతుందో అని ఏ ముహూర్తంలో అక్కినేని నాగేశ్వరరావు చెప్పారు కానీ ఇప్పటికే ఆ సినిమా గురించి మాట్లాడుతూనే ఉన్నాం. ఆ సినిమా ఎంత ప్రభావం చూపించిందో చాలామంది వివరించారు. ప్రజెంట్ జనరేషన్లో సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా శివ సినిమా తనపై ఎంత ప్రభావాన్ని చూపించిందో చెప్పాడు.

కేవలం సందీప్ మాత్రమే కాకుండా రాంగోపాల్ వర్మ స్కూల్ నుంచి వచ్చిన చాలామంది డైరెక్టర్లు ఇండస్ట్రీలో అద్భుతాలు సృష్టించారు. మొత్తానికి ఆయనకు ఏ విధంగా అనిపించిందో తెలియదు కానీ అతని మాటలు మాత్రం నేటికీ అక్షరాల నిజం అని అర్థమైంది. అయితే నాగేశ్వరరావు ఆ మాటలు చెప్పినట్లు స్వయంగా నాగార్జున నేడు జరిగిన శివ ఈవెంట్ లో చెప్పారు.

Also Read : RGV: శివ కథను 20 నిమిషాల్లో రాశా, అక్కడి నుంచి కాపీ చేసా

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×