E-Paper
Advertisement

Akira Nandan: అకీరా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారని తెలుసా? డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Akira Nandan: అకీరా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారని తెలుసా? డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Advertisement

Akira Nandan: సినిమా ఇండస్ట్రీలో వారసుల పరంపర కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా కొనసాగుతున్న వారందరూ కూడా తమ పిల్లలను ఇండస్ట్రీలోకి తీసుకురావడం కోసం ప్రయత్నాలు చేస్తుంటారు ఇప్పటికే ఎంతోమంది స్టార్ కిడ్స్ బాలా నటీనటులుగా కొనసాగుతూ అనంతరం హీరోలుగా ఇండస్ట్రీలో స్థిరపడిన సంగతి తెలిసిందే. అయితే అతి త్వరలోనే మరో వారసులు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మెగా కుటుంబంలో ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా నందన్(Akira Nandan) కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు స్పష్టత మాత్రం లేదు.

హీరోగా అకీరా ఎంట్రీ?

ప్రస్తుతం అకీరా ఇండస్ట్రీలోకి రావడం కోసం విదేశాలలో శిక్షణ తీసుకుంటున్నారని తెలుస్తోంది. అయితే ఈయన హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా లేదా మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీగా ఇవ్వబోతున్నారా అనేది తెలియాల్సి ఉంది. అకీరాకు నటన కంటే కూడా మ్యూజిక్ అంటేనే చాలా ఇష్టమని పలు సందర్భాలలో బయటపెట్టారు. దీంతో ఈయన వెండితెరపై సందడి చేయబోతున్నారా? లేదా తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేయబోతారా? అనేది తెలియాల్సి ఉంది.

ఇష్క్ వాలా లవ్ సినిమాలో బాల నటుడిగా..

Advertisement

ఇక హీరోగా అకీరా ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో పక్కన పెడితే బాల నటుడిగా మాత్రం అకీరా ఇప్పటికే వెండి తెరపై సందడి చేశారు. అకీరా తన తల్లి రేణు దేశాయ్ (Renu Desai)దర్శకత్వం వహించిన ఒక సినిమాలో బాలనటుడిగా నటించారని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు . మరి అకీరా నటించిన ఆ సినిమా ఏంటి అనే విషయానికి వస్తే.. రేణు దేశాయ్ దర్శకురాలిగా మారి దర్శకత్వం వహించిన చిత్రం “ఇష్క్ వాలా లవ్”(Ishq wala Love). ఈ సినిమా 2014లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఆదినాథ్ కొఠారీ సులగ్న జంటగా నటించారు. ఇది మరాఠీ రొమాంటిక్ సినిమా అయినప్పటికీ తెలుగులో కూడా విడుదలైంది.

రేణు దేశాయ్ దర్శకత్వంలో..

Advertisement

ఈ సినిమాకు రేణు దేశాయ్ దర్శకత్వం వహించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించారు. 2014 అక్టోబర్ 10వ తేదీ మరాఠీలో విడుదల కాగా అదే ఏడాది అక్టోబర్ 17వ తేదీ తెలుగులో విడుదల అయింది. రొమాంటిక్ కామెడీ జోనర్ లో రూపొందిన ఈ సినిమాలో అకిరా నందన్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించడం విశేషం. తాజాగా ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలా చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండి తెరపై సందడి చేసిన అకిరా హీరోగా వెండితెర ఎంట్రీ ఇస్తే చూడాలని ఉంది అంటూ అభిమానులు కూడా ఆకాంక్షిస్తున్నారు. మరి అభిమానుల కోరిక ఎప్పుడు నెరవేరుతుందో తెలియాల్సి ఉంది.

Also Read: VD 14 film: రౌడీ హీరో సినిమాకు పవర్ ఫుల్ టైటిల్… ఫాన్స్ ఆకలి తీర్చబోతున్న డైరెక్టర్?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×