E-Paper
Advertisement

OTT Movie : సీటు అంచున కూర్చోబెట్టే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్…IMDbలో టాప్ రేటింగ్

OTT Movie : సీటు అంచున కూర్చోబెట్టే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్…IMDbలో టాప్ రేటింగ్
Advertisement

OTT Movie : సినిమా ఏదైనా, భాష ఏదైనా.. ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెట్టే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్లకు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. తాజాగా ఓటీటీ వేదికగా విడుదలైన ‘దివ్య దృష్టి’ సినిమా ఇప్పుడు అదే మ్యాజిక్ చేస్తోంది. కొత్త తరహా కథాంశంతో, చివరి నిమిషం వరకు ఉత్కంఠను రేకెత్తిస్తూ డిజిటల్ ఆడియెన్స్‌ను థ్రిల్ చేస్తోంది.

కథలోకి వెళ్తే..
దివ్య, భవ్య ఇద్దరూ కవల సోదరీమణులు. వీరికి ఒక వింత వ్యాధి ఉంటుంది. అతిగా ఒత్తిడికి గురైతే కంటిచూపు పోతుంది. ఈ క్రమంలోనే భవ్య చూపు కోల్పోవడమే కాకుండా, ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకుంటుంది. తన సోదరి చావు వెనుక ఏదో మిస్టరీ ఉందని దివ్య బలంగా నమ్ముతుంది. ఇంతలోనే దివ్య భర్త సందీప్ కూడా కనిపించకుండా పోయి, చివరకు ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ వరుస విషాదాల మధ్య దివ్య కూడా కంటిచూపు కోల్పోతుంది.

Advertisement

చూపు లేని దివ్యకు ఒక కేర్ టేకర్ అండగా నిలుస్తాడు. ఆమెకు కంటి ఆపరేషన్ చేయించి, ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఆమె మనసు గెలుచుకుంటాడు. అయితే, అసలు ట్విస్ట్ అక్కడే మొదలవుతుంది. తనను ప్రాణప్రదంగా కాపాడుతున్న ఆ కేర్ టేకరే.. తన భర్తను, చెల్లెలిని పొట్టనబెట్టుకున్న హంతకుడని దివ్యకు తెలుస్తుంది. కంటిచూపు సరిగ్గా లేని స్థితిలో, ఒక క్రూరమైన హంతకుడితో ఆమె చేసిన పోరాటం ఏంటి? అసలు ఆ హంతకుడు వీరి కుటుంబాన్ని ఎందుకు టార్గెట్ చేశాడు? అనేది మిగిలిన కథ.

నటీనటుల ప్రతిభ..
ఈ సినిమాలో మనకు తెలిసిన సునీల్ సరికొత్తగా కనిపిస్తారు. ఎప్పుడూ నవ్వించే సునీల్, ఇందులో అత్యంత క్రూరమైన విలన్ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. ఇక చాలా కాలం తర్వాత వెండితెరపై మెరిసిన ఈషా చావ్లా, దివ్య-భవ్య అనే రెండు విభిన్న పాత్రల్లో అద్భుతంగా నటించింది. కమల్ కామరాజు తన పాత్రకు న్యాయం చేశారు.

Advertisement

ఎక్కడ చూడాలి?
సస్పెన్స్ థ్రిల్లర్లను ఇష్టపడే వారికి ఈ సినిమా ఒక విందు భోజనం లాంటిది. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఐఎమ్‌డీబీ (IMDb) లోనూ మంచి రేటింగ్ సంపాదించుకున్న ఈ థ్రిల్లర్‌ను మీరు మిస్ కాకూడదు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×