E-Paper
Advertisement

Venu Yeldandi: చిక్కుల్లో బలగం వేణు..ఎల్లమ్మకు ఇబ్బందులు తప్పవా?

Venu Yeldandi: చిక్కుల్లో బలగం వేణు..ఎల్లమ్మకు ఇబ్బందులు తప్పవా?
Advertisement

Venu Yeldandi: సినీ దర్శకుడుగా మంచి సక్సెస్ అందుకున్న బలగం వేణు(Balagam Venu) ప్రస్తుతం ఎల్లమ్మ సినిమా (Yellamma Movie) షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాలో హీరోగా ప్రముఖ సాంఘిక దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ఎంపికైన విషయం తెలిసిందే. ప్రస్తుతం వేణు ఈ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు అయితే తాజాగా ఈయన సోషల్ మీడియా వేదికగా షూటింగ్ లోకేషన్ నుంచి ఒక ఫోటోని షేర్ చేశారు. దీంతో పలు విమర్శలను ఎదుర్కొంటున్నారని చెప్పాలి. ఇలా వేణు తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఎల్లమ్మ షూటింగ్ నుంచి ఒక ఫోటోని షేర్ చేశారు. అయితే ఈ ఫోటోలో ఆయన చెప్పులు వేసుకుని కనిపించడంతో వివాదానికి దారితీసింది.

హిందూ మనోభావాలను దెబ్బతీసినట్టే..

వేణు ఎల్లమ్మ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఒక ఆలయంలో చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఆలయం పై భాగంలో వేణు కూర్చోవడమే కాకుండా చెప్పులు వేసుకోవడంతో పలువురు వేణు పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. పవిత్రమైన గుడిలో ఇలా చెప్పులు వేసుకుని ఉండటం అంటే హిందూ మనోభావాలను దెబ్బతీసినట్లేనని సోషల్ మీడియా వేదికగా నేటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించగా, మరికొందరు విభిన్న రీతిలో కామెంట్లు చేస్తున్నారు. బహుశా షూటింగ్ సమయంలో కొన్ని ఎలక్ట్రిక్ వైర్స్ ఉండటం వల్ల వాటి నుంచి రక్షణ పొందడానికి ఇలా చెప్పులు వేసుకుని ఉండొచ్చు కదా అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

స్పందించని వేణు..

Advertisement

ఏది ఏమైనా ఎల్లమ్మ అనే ఒక డివోషనల్ సినిమా చేస్తూ ఆలయంలో ఇలా చెప్పులు వేసుకుని కనిపించడంతో వేణు చిక్కుల్లో పడ్డారు. ఎల్లమ్మ సినిమా షూటింగ్ మొదలైన వెంటనే వేణు ఇలాంటి వివాదంలో చిక్కుకోవడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఈ వివాదంపై వేణు ఇప్పటివరకు ఎక్కడ స్పందించలేదు. మరి ఈ వివాదం పై వేణు స్పందన ఏంటనేది తెలియాల్సి ఉంది. ఇక ఎల్లమ్మ సినిమా విషయానికొస్తే ఈ సినిమా శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

Advertisement

దిల్ రాజు నిర్మాణంలో దేవిశ్రీప్రసాద్ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతోంది. 2026 లోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి వేణు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో దేవిశ్రీప్రసాద్ కు జోడిగా హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారనే విషయాలు తెలియాల్సి ఉంది. ముందుగా కీర్తి సురేష్ నటించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి కానీ అందులో నిజం లేదని తెలుస్తుంది. అయితే ఇప్పటికే హీరోయిన్ ఎంపిక కూడా పూర్తి అయిందని త్వరలోనే హీరోయిన్ ఎవరు ఏంటి అనే విషయాలను కూడా అధికారికంగా వెల్లడించబోతున్నారు. ఇక ఈ సినిమాలో దేవిశ్రీప్రసాద్ తండ్రి పాత్రలో మరోక టాలీవుడ్ స్టార్ హీరో అయిన రాజశేఖర్ నటించబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. త్వరలోనే ఈ విషయాలపై అధికారక ప్రకటన రానుంది.

Also Read: Peddi special song: పెద్ది స్పెషల్ సాంగ్ కోసం స్టార్ హీరోయిన్.. వర్కౌట్ అయ్యేనా?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×