E-Paper
Advertisement

OG Movie: సాహో సినిమాతో ఓజి కు లింక్? సుజిత్ సినిమాటిక్ యూనివర్స్, రేపు థియేటర్ లో పరిస్థితి ఏంటో

OG Movie: సాహో సినిమాతో ఓజి కు లింక్? సుజిత్ సినిమాటిక్ యూనివర్స్, రేపు థియేటర్ లో పరిస్థితి ఏంటో
Advertisement

OG Movie: తెలుగు సినిమా ప్రేక్షకులకు కొత్తగా సినీమాటిక్ యూనివర్స్ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముందుగా ఈ సినీమాటిక్ యూనివర్స్ అనేది హాలీవుడ్ లో బాగా పాపులర్. ఆ తర్వాత ఎవరు ఊహించని విధంగా సౌత్ సినిమా ఇండస్ట్రీలో లోకేష్ కనగరాజ్ దీనిని క్రియేట్ చేసి అందరికీ అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చాడు.

లోకేష్ కనగరాజ్ కమల్ హాసన్ తో విక్రమ్ అనే సినిమా చేస్తున్నాడు అని అనౌన్స్ చేసినప్పుడు అందరికీ మంచి అంచనాలు కలిగాయి. అయితే విక్రం సినిమా విడుదల అవ్వడానికి ఒక రోజు ముందు తాను దర్శకత్వం వహించిన ఖైదీ సినిమా చూసి రండి అని ట్విట్ చేశాడు. కట్ చేస్తే థియేటర్లో సినిమా చూసిన ప్రేక్షకులకు మైండ్ చెదిరిపోయింది. సినిమాటిక్ యూనివర్స్ తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే తెలుగు దర్శకులు కూడా ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు సుజిత్ సినీమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేస్తున్నాడు అని ఆలోచనలు మొదలయ్యాయి.

Advertisement

సాహో సినిమాతో ఓజి కు లింక్?

సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సినిమా సాహో. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కెరియర్ లో విడుదలైన ఈ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. కానీ పవన్ కళ్యాణ్ తో సుజిత్ సినిమా అనౌన్స్ చేసిన తర్వాత చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులే ఈ సినిమా గురించి పొగుడుతూ పోస్టులు పెట్టారు.

Advertisement

ఇప్పుడు సాహో సినిమాకి ఓజి సినిమాకి లింక్ ఉందంటూ కొత్త వార్తలు వినిపిస్తున్నాయి. సాహో సినిమాలో “రాయ్ సన్ హ్యాజ్ అర్రైవ్డ్” అలానే ఓ జి సినిమాలో ” ఫైర్ స్ట్రోమ్ కమింగ్” అని కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది. వాస్తవానికి ఈ రెండు కూడా జపనీస్ లాంగ్వేజ్ లో ఉండటం వలన కొత్త ఆలోచనలు చాలామందికి మొదలవుతున్నాయి. కేవలం దీనిని పట్టుకొని సాహో సినిమాతో లింక్ ఉంటుందేమో అని అందరూ ఊహిస్తున్నారు.

లేనిపోని అంచనాలతో ప్రమాదం 

సినీమాటిక్ యూనివర్స్ అనగానే తెలుగులో గుర్తొచ్చేది లోకేష్ కనగరాజ్. ఇక కూలీ సినిమా సినిమాటిక్ యూనివర్స్ లో భాగం కాదు అని ముందు నుంచి చెబుతూనే ఉన్నాడు లోకేష్. కానీ కొంతమంది దానిని పెద్దగా పట్టించుకోకుండా డి కోడ్ చేయడం మొదలుపెట్టారు. అలా అంచనాలను విపరీతంగా పెంచుకున్నారు. తీరా సినిమాకి వచ్చేసరికి ఆ అంచనాలు అందుకోకపోవడంతో సినిమా పై కొద్దిపాటి నిరాశ వ్యక్తం. ఇప్పుడు ఓ జి విషయంలో కూడా అలాంటి పరిణామాలు ఎదురవుతున్నాయి. ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా సినిమాను సినిమాగా చూడటం చాలా బెటర్. నిజంగా లింక్ ఉంటే అంతకు మించిన ఆనందం ఏముంది.? థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయం.

Also Read: Mouli Talks: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో బుర్రలైన డైరెక్టర్లు ఉన్నారు

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×