E-Paper
Advertisement

టాలీవుడ్‌ను కుదిపేస్తోన్న ‘ఇళ్ల స్థలాల’ దందా.. నాకు సంబంధం లేదన్న టాలీవుడ్ డైరెక్టర్

టాలీవుడ్‌ను కుదిపేస్తోన్న ‘ఇళ్ల స్థలాల’ దందా.. నాకు సంబంధం లేదన్న టాలీవుడ్ డైరెక్టర్
Advertisement

Samudra Warning: ”దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు…నన్ను గాని మధ్యలోకి లాగారో మాములుగా ఉండదు” అంటూ ఘాటుగా వార్నింగ్ వదిలాడు డైరెక్టర్ సముద్ర. ఇంతకీ సముద్రకి కోపం తెప్పించిన ఈ న్యూస్ ఏంటో తెలుసా…భూ దందాల్లో ఆయన పేరుని కొంతమంది వాడుకుని ఆయన ఇమేజ్ ని డ్యామేజ్ చేయడమే.

ఎలాంటి పాత్రా లేదన్న సముద్ర 

అవును …ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీ పేరుతో సినీ కార్మికులకి ఇళ్ళ స్థలాలు ఇస్తుందంటూ కొంతమంది అమాయకులైన కార్మికుల నుండి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారట. అయితే దీని వెనకాల ఉన్నది ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (APFDC) నూతన డైరెక్టర్ అయిన సముద్రే అంటూ ఆ కేటుగాళ్ళు ప్రచారం చేయడంతో ఫైర్ అయ్యాడు ఈ వెటరన్ డైరెక్టర్.తనకు గాని, తన పదవికి కాని ఇందులో ఎలాంటి పాత్రా లేదని కుండ బద్దలు కొట్టేశాడు.

వరికీ ఎలాంటి స్థలాలు కేటాయించలేదు 

Advertisement

ఇంకా ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ ఇదంతా కొందరు పనిగట్టుకుని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ,APFDC పరువు తీసేందుకు ప్రయత్నిస్తున్నారని అసలు ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఎవరికీ ఎలాంటి స్థలాలు కేటాయించలేదని తేల్చి చెప్పాడు.ఎవరైనా అమ్మయకులైన సినీ కార్మికులని ఇలా ఇళ్ళ స్థలాల పేరుతో చీటింగ్ చేస్తే చూస్తూ ఊరుకోబోమని, తన పాత్ర ఇందులో ఉందని ఎవరైనా చెప్పినా, మీడియాలో వైరల్ చేసినా తగిన చర్యలు తీసుకుంటాయనంటూ మండిపడ్డాడు.

నారా చంద్రబాబు ఆశయాలకి అనుగుణంగా

ఇక ఇలాంటి వసూళ్ళ రాయుళ్ళకి దూరంగా ఉండాలని, అలాంటి ఇళ్ళ స్థలాలని ఏమైనా కేటాయించేది ఉంటె అఫీషియల్ గా అనౌన్స్ చేస్తామని చెప్పుకొచ్చారు.కొత్తగా ఏర్పాటైన ఈ APFDC ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆశయాలకి అనుగుణంగా ఏంతో పారదర్శకంగా పనిచేస్తుందని,ముందు ముందు వైజాగ్, రాజమండ్రి ప్రాంతాల్లో సినిమా ఇండస్ట్రీ మరింత డెవలప్ అయ్యేలా కృషి చేస్తామని తెలిపారు.ఇక ఇదే విషయమై ఏమైనా అనుమానాలు ఉంటె ఎఫ్‌డీసీ అధికారులను అడిగి తెలుసుకోవచ్చని తెలిపాడు.

ఈ దందాలకి ఫుల్ స్టాప్ పడుతుందో లేదో

Advertisement

ఇక సముద్ర విషయానికి వస్తే సింహరాశి సినిమాతో టాలీవుడ్ లో సాలిడ్ హిట్ తో ఎంట్రీ ఇచ్చాడు,ఇక శివరామరాజు, ఎవడైతే నాకేంటి,పంచాక్షరి,మహానంది,టైగర్ హరిశ్చంద్రప్రసాద్ వంటి పలు మంచి సినిమాలు ఈయన దర్శకత్వంలో తెరకెక్కినవే. క్రమంగా కాకతీయుడు, వైభవం అంటూ వరుసప్లాపులని తెరకెక్కించి ప్రస్తుతం ఏపీ ఎఫ్‌డీసీ డైరెక్టర్‌గా పగ్గాలు అందుకున్నాడు.చూడాలి మరి సముద్ర ఇచ్చిన వార్నింగ్ తో నైనా ఈ దందాలకి ఫుల్ స్టాప్ పడుతుందో లేదో !

also read:టాలీవుడ్‌లో రూ.1100 కోట్ల జూదం.. ఆ ఆరు సినిమాలు తేడా కొడితే అంతే సంగతులా?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×