E-Paper
Advertisement

Tollywood: ఫౌజీ సినిమా ఖచ్చితంగా హిట్ అవాల్సిందే.. టాలీవుడ్ నటుడు కామెంట్స్ వైరల్..!

Tollywood: ఫౌజీ సినిమా ఖచ్చితంగా హిట్ అవాల్సిందే.. టాలీవుడ్ నటుడు కామెంట్స్ వైరల్..!
Advertisement

Tollywood: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) వరుస పెట్టి సినిమాలు చేస్తూ అభిమానులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఫౌజీ. సీతారామం వంటి క్లాసిక్ హిట్ తర్వాత హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో దీనిపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగే ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాను మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వీ హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం కాబోతోంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా భరతనాట్య కళాకారిణిగా పేరు సొంతం చేసుకున్న ఈమె.. ఇప్పుడు తన మొదటి సినిమాతో ఏకంగా రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలో అవకాశం అందుకోవడంతో ప్రస్తుతం అందరూ ఈమె పైనే దృష్టిపెట్టారు.

ఫౌజీ సినిమాపై రాహుల్ కామెంట్స్..

ఇకపోతే ఈ సినిమా ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో అటు షూటింగ్ కూడా వేగంగా జరుపుకుంటుంది. ఇలాంటి సమయంలో తాజాగా సినీ నటుడు , దర్శకుడు రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో, అటు ఫిలింనగర్ వర్గాలలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ.. “ఫౌజీ సినిమా విజువల్స్ చాలా అద్భుతంగా వస్తున్నాయి.. మేకింగ్ పరంగా రాజీపడకుండా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇండియాలోని వివిధ భాషలకు చెందిన పలువురు స్టార్ నటీనటులు ఇందులో భాగస్వామ్యం అవుతున్నారు.. ముఖ్యంగా భారీ ఎత్తున ఈ సినిమా తయారవుతోంది. దీనికోసం పెడుతున్న ఖర్చు.. పడుతున్న శ్రమ చూస్తుంటే కచ్చితంగా ఇది పెద్ద హిట్ అవ్వాల్సిందే” అంటూ తన అభిప్రాయంగా చెప్పుకొచ్చారు రాహుల్.

Advertisement

also read:Dhurandhar 2: ధురంధర్ నటీనటుల రెమ్యూనరేషన్ ఎంతంటే?

కన్ఫ్యూజన్ లో పడ్డ ప్రభాస్ ఫ్యాన్స్..

ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వ్యక్తమవుతుంటే అభిమానులు మాత్రం కన్ఫ్యూజన్ వ్యక్తం చేస్తున్నారు. అసలు రాహుల్ ఏం చెప్పాడు .. ఫౌజీ సినిమా హిట్ అవ్వాల్సిందే అని చెప్పాడా ? లేక తప్పకుండా హిట్ అవుతుంది .. అని చెప్పాడా అంటూ తమ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో ప్రభాస్ క్రేజ్ కి తగ్గట్టుగా హను రాఘవపూడి తన మార్క్ ఎమోషన్స్ యాడ్ చేసి ఈ యుద్ధ గాథను తెరపై చూపించడానికి సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు శరవేగంగా జరుగుతోంది. అటు త్వరలోనే సినిమాపై అఫీషియల్ డేటును అనౌన్స్మెంట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి . ఏది ఏమైనా ప్రభాస్ ఫౌజీ సినిమాపై అంచనాలు ఇప్పటికే భారీగా నెలకొన్నా .. ఇలాంటి సమయంలో రాహుల్ చేసిన కామెంట్లు సినిమాపై మరిన్ని అంచనాలు పెంచుతున్నాయి అనడంలో సందేహం లేదు. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ స్పిరిట్, సలార్ 2 వంటి సినిమా షూటింగ్లలో పాల్గొనబోతున్నట్లు సమాచారం.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×