E-Paper
Advertisement

Singer Chinmayi: ద్రౌపది 2 పాట వివాదం.. చిన్మయి క్షమాపణలతో ముదురిన వివాదం, డైరెక్టర్‌ రియాక్షన్‌

Singer Chinmayi: ద్రౌపది 2 పాట వివాదం.. చిన్మయి క్షమాపణలతో ముదురిన వివాదం, డైరెక్టర్‌ రియాక్షన్‌
Advertisement

Singer Chinmayi Draupathi 2 Song: సింగర్‌ చిన్మయి క్షమాపణలు చెబుతూ చేసిన ఓ ట్వీట్‌ దర్శకుడితో వివాదానికి దారితీసింది. ఇటీవల ద్రౌపది 2లో ఆమె ఓ పాట పాడారు. ఈ సాంగ్‌ మంగళవారం (డిసెంబర్‌ 2) విడుదలైంది. ఈ పాట విడుదలైన కొద్ది సేపటికే చిన్మయి నెటిజన్స్‌, ఫ్యాన్స్‌ని క్షమాపణలు కోరుతూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే… ఇటీవల ద్రౌపది 2 దర్శక నిర్మాతలు చిన్మయి పాడిన సాంగ్ రిలీజ్ చేశారు. పాట విడుదలైన కొంత సేపటి తర్వాత చిన్మయి ఈ పాట పాడినందుకు క్షమాపణ చెప్పారు. అందుకు కారణం దర్శకుడు మోహన్ గా వివరించారు చిన్మయి.

తొందరపడి తప్పు చేశా..

ఈ సినిమా భావజాలం, దాని బ్యాగ్రౌండ్ తెలియక పోవడం వల్ల తాను తొందర పడి ఈ పాట పాడేశాననీ.. ఒక వేళ తనకీ విషయం తెలిసి ఉంటే పాడేదాన్ని కాదని అన్నారామె. ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ కీ తనకు 18 ఏళ్ల పరిచయముందని.. అందుకే, ఆయన చెప్పడం వల్ల తానీ పాట పాడినట్టు తన ట్వీట్ ద్వారా తెలియ చేశారు చిన్మయి. అయితే ట్వీట్ వైరల్ కావడంతో డైరెక్టర్ మోహన్ వెంటనే రియాక్టయ్యారు. ఈ పాట చిన్మయి అయితే బావుంటుందని తాను అనుకోవడం వల్లే ఆమె ఈ పాట పాడారని అన్నారు మోహన్. రికార్డింగ్ టైంలో చిత్ర దర్శకుడు జిబ్రాన్ అందుబాటులో లేక పోవడంతో తాను ట్రాక్‌కి సంబంధించిన డీటైల్స్ మాత్రమే ఆమెకు వివరించాననీ.. సినిమా కాన్సెప్ట్ గురించి ఎలాంటి చర్చ జరగలేదన్నారు దర్శకుడు.

Advertisement

Also Read: Akhanda 2 Ticket Prices: ఉత్కంఠకు తెర.. అఖండ 2 టికెట్‌ రేట్ల పెంపుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

చిన్మయి ట్వీట్ పై డైరెక్టర్ రియాక్షన్‌

తనతోగానీ, సంగీత దర్శకుడితోగానీ మాట్లాడకుండా.. మా నుంచి ఎలాంటి వివరణ తీసుకోకుండా ఇలాంటి కామెంట్స్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగించిందని అన్నారు డైరెక్టర్ మోహన్. దీనిపై చిన్మయి వివరణ ఇవ్వాలని.. ముందుగా ఆమె తన ట్వీట్ ని తొలగించాలని డిమాండ్ చేశారాయన. ఏదైనా ఉంటే కేవలం తనను విమర్శించాలి తప్ప.. మేకింగ్ లో భాగమైన వారిని టార్గెట్ చేయడం పిరికితనంగా వర్ణించారు దర్శకుడు మోహన్. చిన్మయి ఇంటిపేరులోనే శ్రీపాద ఆమె ఆధ్యాత్మిక భావజాలమేంటో తెలియ చేస్తోంది. ఆమె ఎలాంటి భావజాలం గురించి మాట్లాడిందో తనకైతే సరిగా అర్ధం కాలేదన్నారాయన. చిన్మయి డైరెక్టర్ల కామెంట్స్‌తో ఇప్పుడు ద్రౌపతి 2లోని ఎంకొనే సాంగ్ వివాదాస్పదంగా మారింది.దర్శకుడు మోహన్ యాంటీ దళిత్ సినిమాలే తీస్తారన్న కారణంతోనే ఆమె ఈ విమర్శలు చేసినట్టు తెలుస్తోంది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×