E-Paper
Advertisement

Maruthi: రాజా సాబ్ డిజాస్టర్… మెగా హీరోని లైన్ లో పెట్టిన మారుతి.. అసలు నిజం ఇదే ?

Maruthi: రాజా సాబ్ డిజాస్టర్… మెగా హీరోని లైన్ లో పెట్టిన మారుతి.. అసలు నిజం ఇదే ?
Advertisement

Maruthi: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దర్శకుడుగా పలు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న వారిలో మారుతి ఒకరు. మారుతి డైరెక్షన్ లో వచ్చిన పలు సినిమాలు ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకున్నాయి. అయితే ఇటీవల మారుతి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ప్రేక్షకాదరణ నోచుకోలేకపోతున్నాయి. ఇలా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న ఈయనకు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అవకాశం ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక ప్రభాస్ హీరోగా ది రాజా సాబ్(The Raja Saab) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 9వ తేదీ విడుదలైన సంగతి తెలిసిందే.

మెగా హీరోతో మారుతి సినిమా?

ఎన్నో అంచనాలు నడుమ విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ప్రభాస్ అభిమానులు తీవ్రస్థాయిలో మారుతి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభాస్ సినిమా అనంతరం మారుతి తన తదిపరి సినిమాని మెగా హీరోతో చేయబోతున్నారు అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు బయటకు వస్తున్నాయి. మెగా హీరోలలో ఒకరైన వరుణ్ తేజ్(Varun Tej) తో ఈయన గీత ఆర్ట్స్ బ్యానర్లో ఓ సినిమా చేయబోతున్నారని అత్యంత తక్కువ బడ్జెట్ తో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విధంగా మారుతి సినిమా గురించి వస్తున్న ఈ వార్తలపై ఆయన టీం స్పందించారు.

ఆ వార్తలన్నీ అవాస్తవం..

Advertisement

ఈ నేపథ్యంలోనే మారుతి టీం తన సినిమా మెగా హీరోతో ఉండబోతోంది అంటూ వస్తున్న వార్తలపై స్పందిస్తూ ఈ వార్తలు పూర్తిగా ఆ వాస్తవం అని కొట్టి పారేశారు. ఆయన ఇప్పటివరకు ఎలాంటి సినిమాలకు కమిట్ అవ్వలేదని, మారుతి ఏదైనా సినిమా చేస్తే తప్పకుండా అధికారికంగా తన సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తారంటూ రూమర్లను ఖండిస్తూ ఈ వార్తలకు చెక్ పెట్టారు. దీంతో మెగా హీరోతో ఈయన సినిమా చేయబోతున్నారంటూ వస్తున్న వార్తలలో నిజం లేదని స్పష్టమైనది. ఇకపోతే మారుతి రాజా సాబ్ సీక్వెల్ ను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘రాజా సాబ్ సర్కస్ 1935’ అనౌన్స్ చేశారు.

Advertisement

ఈ సినిమాతో పాటు నాని హీరోగా నటించిన భలే భలే మగాడివోయ్ 2 స్క్రిప్ట్ కూడా సిద్ధంగా ఉందని తెలిపారు. మరి ఈ రెండింటిలో ఏదైనా ఒక సినిమాని చేస్తారా లేదంటే కొత్త సినిమా చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇక ది రాజా సాబ్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ఏకంగా 450 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. అయితే ఈ సినిమా కేవలం 50 శాతం కూడా కలెక్షన్లను రాబట్ట లేకపోయిందని, తద్వారా నిర్మాతకు వందల కోట్ల రూపాయలు నష్టాలు వచ్చాయని, ఇలా భారీ స్థాయిలో నష్టాలు వచ్చిన నేపథ్యంలో ఈ సినిమా సీక్వెల్ ఉంటుందా? లేదా ?అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Also Read: Chiranjeevi Emotional: మీరు లేనిదే నేను లేను.. ఈ ప్రేమ శాశ్వతం.. చిరు ఎమోషనల్ పోస్ట్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×