E-Paper
Advertisement

Film industry: ప్రముఖ డైరెక్టర్ కుమారుడు అరెస్ట్.. మద్యం మత్తులో దాడి!

Film industry: ప్రముఖ డైరెక్టర్ కుమారుడు అరెస్ట్.. మద్యం మత్తులో దాడి!
Advertisement

Film industry:హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. ప్రముఖ సినీ దర్శకుడు మణిశంకర్ కుమారుడు ప్రేమ శంకర్ మద్యం మత్తులో వీరంగం సృష్టించి పోలీసుల చేతికి చిక్కాడు. విధి నిర్వహణలో ఉన్న హోంగార్డుపై దాడి చేయడమే కాకుండా, నడిరోడ్డుపై కారు ఆపి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించాడు. అడ్డుకోబోయిన పోలీసులను దూషిస్తూ, సుమారు అరగంట పాటు కారులోనే ఉండి పోలీసులకు చుక్కలు చూపించిన ఈ ఘటన ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ వివరాలు చూద్దాం..

నడిరోడ్డుపై హంగామా – హోంగార్డుపై దాడి:

నిన్న ఎన్‌ఎన్‌టీ జంక్షన్ వద్ద ఈ ఘటన జరిగింది. ప్రేమ శంకర్ తన కారును రోడ్డుకు అడ్డంగా ఆపేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అక్కడ డ్యూటీలో ఉన్న మహిళా కానిస్టేబుల్, హోంగార్డు కారును పక్కకు తీయమని కోరారు. అయితే, అప్పటికే పీకలదాకా మద్యం సేవించి ఉన్న ప్రేమ శంకర్.. “నన్నే కారు తీయమంటారా?” అంటూ హోంగార్డుపై విరుచుకుపడ్డాడు. కారులో నుంచి దిగి హోంగార్డును అసభ్య పదజాలంతో దూషిస్తూ, కాలితో బలంగా తన్నాడు. ఒక సామాన్య హోంగార్డు తనను ప్రశ్నించడం ఏంటనే అహంకారంతో ఆయనపై భౌతిక దాడికి దిగాడు.

పోలీసులకు చుక్కలు చూపించిన నిందితుడు:

Advertisement

హోంగార్డు సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ, ప్రేమ శంకర్ కారు లోపలికి వెళ్లి డోర్లు లాక్ చేసుకున్నాడు. పోలీసులు ఎంత చెప్పినా వినకుండా సుమారు అరగంట పాటు కారు లోపలే కూర్చుని మొండికేశాడు. పోలీసులు చివరకు తీవ్రంగా ప్రయత్నించి అతడిని కారు నుంచి బయటకు లాగి అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో ఉన్న సమయంలో నిందితుడు చేసిన హంగామా మొత్తం అక్కడున్న సీసీ కెమెరాల్లో మరియు పోలీసుల బాడీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది.

అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలింపు:

ప్రభుత్వ ఉద్యోగి విధి నిర్వహణలో ఉండగా అడ్డుకోవడం, దాడికి పాల్పడటం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రేమ శంకర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించగా, ఆయన మోతాదుకు మించి మద్యం సేవించినట్లు నిర్ధారణ అయ్యింది.ఇక దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. సెలబ్రిటీల పిల్లలు ఇలా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం పట్ల నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

మణిశంకర్ ఒక విలక్షణమైన దర్శకుడు, స్క్రీన్ రైటర్ మరియు గ్లోబల్ ఇమేజింగ్ నిపుణుడు. ఆయన ముఖ్యంగా ‘రుద్రాక్ష్’, ‘ముఖ్‌బీర్’ మరియు ’16 డిసెంబర్’ వంటి చిత్రాలతో బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన కుమారుడు ఇలాంటి దాడులు చేసి పోలీసులకు పట్టుబడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మద్యం మత్తు మనిషిని ఏ స్థాయికి దిగజారుస్తుందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. చట్టం ఎవరికైనా ఒక్కటే అని నిరూపిస్తూ పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు పంపారు.

also read; Ranabaali Movie: రణబాలి మూవీ స్టోరీ ఇదే.. విరోష్ జంట గట్టిగానే ప్లాన్ చేశారే?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×