// // Allu Arjun - Atlee- AA22 మూవీ స్టోరీపై క్లూ ఇచ్చిన డైరెక్టర్ అట్లీ -->
E-Paper
Advertisement

Allu Arjun – Atlee : అదో కొత్త ప్రపంచం… AA22 మూవీ స్టోరీపై క్లూ ఇచ్చిన డైరెక్టర్ అట్లీ

Allu Arjun – Atlee : అదో కొత్త ప్రపంచం… AA22 మూవీ స్టోరీపై క్లూ ఇచ్చిన డైరెక్టర్ అట్లీ
Advertisement

Atlee Interesting Comments AA22xA6: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, కోలీవుడ్‌ దర్శకుడు అట్లీ కాంబోలో ఓ భారీ ప్రాజెక్ట్‌ రూపొందుతోంది. AA22xA6 అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాను సన్‌ పిక్చిర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు. పుష్ప వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తర్వాత బన్నీ నటిస్తున్న చిత్రమిది. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక మూవీ అప్‌డేట్స్‌ కూడా అంతకు మించి అన్నట్టుగా ఉన్నాయి. ప్రతి అప్‌డేట్‌ ఆడియన్స్‌లో క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఈ చిత్రాన్ని హాలీవుడ్‌ రేంజ్ లో అట్లీ ప్లాన్‌ చేశాడని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అలాగే ఈ సినిమాకు పనిచేసే టెక్కికల్‌ టీం కూడా హాలీవుడ్‌ నిపుణులే అనే విషయం తెలిసిందే.

టెక్కికల్‌ వర్క్‌ కోసం హాలీవుడ్‌ నిపుణులు

Advertisement

పదుల సంఖ్యలో ఈ చిత్రానికి హాలీవుడ్‌ నిపుణులు పని చేస్తున్నారు. వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ కోసం ఏకంగా విదేశాలకు చెందిన ప్రముఖ కంపెనీతో డీల్‌ చేసుకుంది మూవీ టీం. వారితో టై అప్‌యినట్టు ఇటీవల మూవీ టీం ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ సినిమా గురించి వాళ్లు వీళ్లు మాత్రమే మాట్లాడారు. కానీ, ఇప్పుడు స్వయంగా డైరెక్టర్‌ అట్లీ ఈ మూవీకి సంబంధించి అదరిపోయే అప్‌డేట్‌ ఇచ్చారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన AA22xA6 సినిమాలో ఇదివరకు ఎన్నడు చూడని అద్భుతమైన ప్రపంచాన్ని చూస్తారని చెప్పారు. తాజాగా బెంగళూరులో జరిగిన పిక్‌బాల్‌ టోర్నమెంట్‌కు అట్లీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ AA22xA6 విశేషాలను పంచుకున్నారు. “ఏదైనా ఒక్క ఆలోచనతనే ప్రారంభం అవుతుంది.

ఆశ్చర్యపోయే కొత్త ప్రపంచాన్ని చూస్తారు

ఈ సినిమాతో ప్రేక్షకులు ఆశ్చర్యపోయే కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నాం. ఆడియన్స్‌కి కొత్త అనుభూతిని ఇవ్వడానికే ప్రయత్నిస్తున్నాం. ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నాం. దేవుడు మా ఈ ప్రయాణంలో ప్రతి అడుగులోనూ తోడు ఉన్నాడని ఆశిస్తున్నాం. ఆయన దయవల్ల అంతా మేం అనుకున్నట్లే జరుగుతుందని నమ్ముతున్నాం. ఇంత భారీ ప్రాజెక్ట్‌ని రూపొందించడం రిస్క్‌గా అనుకోవడం లేదు. ఈ ప్రాజెక్ట్‌ని నేను ఎంజాయ్‌ చేస్తున్నా. మరికొన్ని నెలల్లో ఈ సినిమాను మీరు ఆస్వాధిస్తారు” అని చెప్పుకొచ్చాడు. తమ సినిమాకు రిఫర్‌గా ఎలాంటి బుక్‌ తీసుకోలేదని, కొత్త కథతో వస్తున్నామన్నారు. నిజానికి తాము నేర్చుకుంఊట ఈ సినిమా తీస్తున్నామన్నారు.

Advertisement

Also Read: Mithra Mandali: ఆరు రోజుల్లో రిలీజ్.. ఇంకా షూటింగ్‌ జరగడమేంటి భయ్యా..!

హాలీవుడ్‌లో నుంచి కూడా రెఫరెన్సులేని స్థాయిలో ఈ సినిమా ఉందని , అంత కొత్తగా ఉంటుందని ఆయన చెప్పారు. అలాగే బన్నీ లుక్‌పై అట్లీ ఆసక్తికర కామెంట్స్‌ చేశాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ లుక్‌, ట్రాన్స్‌ఫరమేషన్‌ చూడాలంటే మరికొన్ని నెలలు వెయిట్‌ చేయాల్సిందేనని, అప్పుడు మీరంత ఎంతగానో ఆశ్చర్యపోతారంటూ అట్లీ మరింత క్యూరియాసిటి పెంచాడు. కాగా ప్రస్తుతం డైరెక్టర్‌ అట్లీ కామెంట్స్‌ హాట్‌ టాపిక్‌గా మారాయి. ఆయన కామెంట్స్‌తో మూవీపై హైప్‌ మరింత పెరిగింది. మన ఇండియన్‌ సినిమా నుంచి హాలీవుడ్‌ని మించిన సినిమా రాబోతుందంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. కాగా ఇటీవల ముంబైలో ఈ సినిమా షూటింగ్‌ జరుపుకుంది. కొత్త షెడ్యూల్‌ త్వరలోనే ప్రారంభం కానుంది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×