E-Paper
Advertisement

Dhurandhar Trailer: ‘ధురంధర్ ది రివేంజ్’ ట్రైలర్‌లో రణవీర్ సింగ్ వాచ్‌పై సోషల్ మీడియాలో చర్చ..

Dhurandhar Trailer: ‘ధురంధర్ ది రివేంజ్’ ట్రైలర్‌లో రణవీర్ సింగ్ వాచ్‌పై సోషల్ మీడియాలో చర్చ..
Advertisement

Dhurandhar Trailer: బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్: ది రివెంజ్’ ట్రైలర్ విడుదలైనప్పటి నుండి సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా రణవీర్ పోషించిన ‘హమ్జా’ పాత్ర ధరించిన ఖరీదైన వస్తువులు ఇప్పుడు సినీ ప్రియుల మధ్య హాట్ టాపిక్‌గా మారాయి.

Read also-Gundeninda GudiGantalu Today episode: మనోజ్ ను చితక్కొట్టిన మీనా.. షాక్ లో ప్రభావతి, రోహిణి.. శోభాకు దిమ్మతిరిగే షాక్..

ఆకర్షిస్తున్న వాచ్..

Advertisement

ట్రైలర్‌లో రణవీర్ సింగ్ తన స్టైలిష్ లుక్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే, డేగ కళ్లతో పరిశీలించే నెటిజన్లు రణవీర్ చేతికి ఉన్న వాచ్‌ను ప్రత్యేకంగా గమనించారు. అది ప్రపంచ ప్రసిద్ధ బ్రాండ్ ‘రోలెక్స్’ (Rolex) కు చెందిన ‘కాస్మోగ్రాఫ్ డేటోనా’ (Cosmograph Daytona) మోడల్ అని గుర్తించారు. మార్కెట్లో దీని ధర సుమారు 25 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఒక గ్యాంగ్‌స్టర్ పాత్రలో ఇంత ఖరీదైన వాచ్ ధరించడం వెనుక దర్శకుడు ఆదిత్య ధర్ ఏదో ఒక బలమైన కారణాన్ని చూపిస్తున్నారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

రాయల్ లుక్

సినిమా మొదటి భాగంలో (ధురంధర్) హమ్జా పాత్ర చాలా సాధారణంగా కనిపించింది. కానీ రెండో భాగం ‘ది రివెంజ్’లో హమ్జా తన వేషధారణను పూర్తిగా మార్చుకున్నాడు. కేవలం 25 లక్షల వాచ్ మాత్రమే కాకుండా, చేతి వేళ్లకు ధరించిన విలాసవంతమైన రింగులు, కళ్లకు పెట్టుకున్న ‘బాలెన్సియాగా’ (Balenciaga) బ్రాండ్ సన్‌గ్లాసెస్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సన్‌గ్లాసెస్ ధర కూడా సుమారు 40 వేల రూపాయల వరకు ఉంటుందని సమాచారం. మొదటి భాగంలో గ్యాంగ్‌స్టర్ రెహ్మాన్ డకైత్ (అక్షయ్ ఖన్నా) మరణం తర్వాత, హమ్జా అధికారం సంపద పెరిగాయని చెప్పడానికి ఈ విలాసవంతమైన వస్తువులను సంకేతంగా వాడుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Read also-Crime Thriller OTT: దుర్యోధనుడి అవతారంలో సీరియల్ కిల్లర్… యుగాలు దాటే ప్రతీకారం…కసిగా ఒక్కో హత్య

కథా నేపథ్యం

ట్రైలర్ ప్రకారం, హమ్జా కేవలం ఒక గ్యాంగ్‌స్టర్ మాత్రమే కాదు. అతని అసలు పేరు జస్క్రీత్ సింగ్ రాంగీ అని, అతను ఒక ఇండియన్ స్పై (గూఢచారి) అని రెండో భాగంలో వెల్లడి కానుంది. గ్యాంగ్‌స్టర్ ముసుగులో దేశం కోసం అతను చేస్తున్న పోరాటం ఏమిటన్నదే ఈ సినిమా కథ. పొడవాటి జుట్టు, నల్లటి పఠానీ సూట్, కళ్లద్దాలతో రణవీర్ సింగ్ లుక్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో రణవీర్ సింగ్‌తో పాటు సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ మరియు ఆర్. మాధవన్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ చిత్రం మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×