E-Paper
Advertisement

Bollywood : పదేళ్లుగా పని మనిషిపై అత్యాచారం.. ‘దురంధర్’ నటుడు అరెస్ట్

Bollywood : పదేళ్లుగా పని మనిషిపై అత్యాచారం.. ‘దురంధర్’ నటుడు అరెస్ట్
Advertisement

Bollywood : రీసెంట్ గా బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన దురంధర్ మూవీలో కీలక పాత్రలో నటించిన నదీమ్ ఖాన్ పై అత్యాచారం చేశారనే ఆరోపణలతో కేసు నమోదు అయ్యింది. దాంతో పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. పెళ్లి చేసుకుంటానని తప్పుడు హామీ ఇచ్చి దాదాపు 10 సంవత్సరాలుగా తన ఇంటి పనిమనిషిపై చాలాసార్లు అత్యాచారం చేశాడనే ఆరోపణలపై అరెస్టు చేయబడ్డాడు.. అతని అరెస్ట్ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది.. ఈ కేసు గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం..

 మోసం చేశాడని నదీమ్ ఖాన్ పై ఆరోపణలు..

నటుడు నదీమ్ ఖాన్ వెర్సోవాలో నివాసం ఉంటున్నాడు. ఆ మహిళ 2015 లో ఖాన్‌తో పరిచయం ఏర్పడింది. ఆమె తన ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తుంది. వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. అది శారీరక సంబంధంగా మారింది. నిందితుడు ఆమెను వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చాడని, ఆ హామీపై, ఆమె నివాసంలో పదేపదే ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించారు.. దాదాపు పదేళ్లుగా వీరిద్దరి మధ్య సంబంధం కొనసాగుతుందని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.. అయితే, తరువాత అతను తనను వివాహం చేసుకోవడానికి నిరాకరించడంతో.. ఆమె వెర్సోవా పోలీసులను సంప్రదించి జనవరి ప్రారంభంలో ఫిర్యాదు చేసింది.. మొదటిసారిగా మాల్వానీ పోలీసుల పరిధిలోని ఫిర్యాదుదారుడి ఇంట్లో జరిగింది. అయితే బాధితురాలు ఆ ప్రాంతంలో నివసిస్తున్నందున, వెర్సోవా పోలీసులు కేసును జీరో ఎఫ్ఐఆర్ కింద మాల్వానీ పోలీసులకు బదిలీ చేశారు.. ప్రస్తుతం ఈ కేసు పై బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ.. అలాగే సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఈ కేసు గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

దురంధర్ లో వంటవాడిగా.. 

Advertisement

ఇటీవల బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిత్రం దురంధర్.. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించారు. భారీ యాక్షన్ సన్నివేశాలతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఒకవైపు విమర్శలు ఎదురవుతున్న సరే కలెక్షన్లు మాత్రం ఊహించన స్థాయిలో వసూల్ అయ్యాయి.. ఒక్క మాటలో చెప్పాలంటే బిగ్గెస్ట్ హిట్టనే చెప్పాలి. ఇందులో వంటవాడుగా అఖ్లాక్ పాత్రతో నదీమ్ కనిపించాడు.. మూవీ హిట్ అవ్వడంతో అతని క్రేజ్ కూడా పెరిగింది. ప్రస్తుతం లైంగిక వేధింపుల ఆరోపణతో ఈయనపై కేసు నమోదవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక పోలీసులు బాధితురాలు ఫిర్యాదు మేరకు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం బాధితురాలని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. నటుడుని రిమాండ్ కు తరలించినట్లు సమాచారం. ఈ కేస్ గురించి పూర్తి వివరాలను పోలీసులు త్వరలోనే వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది.

 

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×