E-Paper
Advertisement

ధురంధర్ నటి ఆయేషా ఖాన్ అరెస్ట్.. అసలేం జరిగిందంటే?

ధురంధర్ నటి ఆయేషా ఖాన్ అరెస్ట్.. అసలేం జరిగిందంటే?
Advertisement

ayesha khan:ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్యధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ హీరోగా, సారా అర్జున్ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ధురంధర్. ఈ చిత్రంలో షరారత్ పాటలో స్పెషల్ పర్ఫామెన్స్ ఇచ్చి అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది ఆయేషా ఖాన్. తెలుగులో కూడా పలు చిత్రాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమెను ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది.. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ధురంధర్ నటి అరెస్ట్..

నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసనలకు ఆమె మద్దతు ప్రకటించారు అనే అనుమానంతో బుధవారం ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష విభాగంపై సీజేపీ ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అంటూ డిమాండ్ చేస్తూ ఢిల్లీలో విద్యార్థులు , పార్టీ శ్రేణులు నిరాహార దీక్షలు కూడా చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సంఘీభావం తెలిపే కార్యక్రమాలలో ఆయేషా ఖాన్ పాల్గొన్నారు అనే నెపంతో ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

తనను అన్యాయంగా అరెస్టు చేశారంటూ వీడియో రిలీజ్..

Advertisement

అయితే ఆమె మాత్రం తన అధికారిక ఇన్స్టా ఖాతా ద్వారా ఒక వీడియో రిలీజ్ చేసింది. నీట్ విద్యార్థులకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నందుకు పోలీసులు తనను అదుపులోకి తీసుకున్నారని, తన సోషల్ మీడియా ఖాతా ఇంస్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. మొదట పోలీస్ వ్యాన్ లో, ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో తీసిన వీడియోలను కూడా ఆమె పంచుకున్నారు . రోడ్డుపై శాంతియుతంగా నిలబడినప్పటికీ కూడా తనను నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ సమయంలో తన చేతులు వణికాయని , రోడ్డుపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తనను పోలీసులు నిర్బంధించారంటూ ఆరోపించింది. తనతో పాటు తన సోదరుడిని కూడా బలవంతంగా వ్యాన్ లోకి ఎక్కిస్తున్న దృశ్యాలను మరో వీడియోలో పంచుకుంది. పైగా తనను ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నిస్తూనే.. కేవలం రోడ్డుపై నిలబడినందుకు ఇలా అరెస్టు చేస్తారా? అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ప్రస్తుతం ఆయేషా ఖాన్ ను అరెస్టు చేయడం పై అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ:ఇండియాలో 450కి పైగా షోలు.. 59దేశాలలో స్క్రీనింగ్.. కృతజ్ఞతలు చెప్పిన డైరెక్టర్!

ఆయేషా ఖాన్ నటించిన తెలుగు చిత్రాలు..

Advertisement

ఆయేషా ఖాన్ విషయానికొస్తే.. ధురంధర్ సినిమాలో షరారత్ పాటతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. 2022లో ప్రముఖ డైరెక్టర్ గంగాధర్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ అతిధి పాత్రలో వికాస్ వశిష్ట , ప్రియా వడ్లమాని, చైతన్య రావు మదాది కీలక పాత్రలు పోషించిన తెలుగు యాక్షన్ డ్రామా.. ‘ముఖచిత్రం’లో నటించి తెలుగు తెరకుపరిచయమైంది . ఆ తర్వాత శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన తెలుగు హారర్ కామెడీ చిత్రం ‘ఓం భీమ్ బుష్ ‘ సినిమాలో కూడా ఆయేషాఖాన్ నటించింది. ఇందులో శ్రీ విష్ణు, ప్రీతి ముకుందన్ జంటగా నటించారు. ఇక తర్వాత మనమే, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వంటి తెలుగు చిత్రాలలో నటించిన ఈమె ధురంధర్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి భారీ పాపులారిటీ అందుకుంది.

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×