// // Dhurandhar- ‘ధురందర్‌’ తెలుగు వెర్షన్‌ వచ్చే ఏడాదికి వాయిదా -->
E-Paper
Advertisement

Dhurandhar 2: ‘ధురందర్‌’ తెలుగు రిలీజ్ ఇక లేనట్టే.. అప్పుడే సీక్వెల్‌ విడుదలకు ప్లాన్‌!

Dhurandhar 2: ‘ధురందర్‌’ తెలుగు రిలీజ్ ఇక లేనట్టే.. అప్పుడే సీక్వెల్‌ విడుదలకు ప్లాన్‌!
Advertisement

Dhurandhar 2 Telugu Release: బాలీవుడ్‌ స్టార్ రణ్‌వీర్‌ సింగ్ లీడ్‌ రోల్లో నటించిన స్పై థ్రిల్లర్ ‘ధురందర్’. హిందీ సినిమా అయినా దక్షిణాదిలోనూ విపరీతమైన బజ్‌ క్రియేట్ చేసింది ఈ మూవీ. ప్రస్తుతం ఈ మూవీ ఇండియన్‌ బాక్సాఫీసు వద్ద దండయాత్ర చేస్తుంది. డిసెంబర్‌ 5న విడుదలైన ఈ చిత్రం ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో నుంచి హిట్‌ టాక్‌తో దూసుకుపోతుంది. మూవీకి వస్తున్న రెస్పాన్స్‌ చూసి మేకర్స్‌ తెలుగులోనూ విడుదల చేయాలని ప్లాన్‌ చేశారు. కానీ, అది కుదరలేదు. డిసెంబర్‌ 19న రిలీజ్‌ డేట్‌ని కూడా ఫిక్స్‌ చేశారు. డిస్ట్రిబ్యూటర్స్‌ నిర్ణయంతో నిర్మాతలు వెనక్కి తగ్గారు.

తెలుగు రిలీజ్ ఇక లేనట్టే

Advertisement

ధురందర్‌ హిందీలోనే ఎక్కువ రెస్పాన్స్‌ అందుకుంటుందని, హైదరాబాద్‌, తెలంగాణలోని పలు ప్రాంతాల ప్రజలు ఈ సినిమాని హిందీలోనే చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్లు అభిప్రాయపడ్డారు. దీంతో ధురందర్‌ తెలుగు వెర్షన్‌ రిలీజ్‌ నిర్ణయాన్ని మూవీ టీం పూర్తిగా వెనక్కి తీసుకుందట. దీంతో ఈ సినిమా తెలుగు వెర్షన్‌ రిలీజ్ ఇక ఉండకపోవచ్చనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. నిర్మాతలు కూడా అదే నిర్ణయించుకున్నారట. ఇక ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్‌కి సంబంధించిన షూటింగ్‌ శరవేగంగా జరుగుతుందట. ఇప్పటికే సీక్వెల్‌ 70 నుంచి 80 శాతం పూర్తయినట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది ధరంధర్‌ 2 రిలీజ్ ఉండోచ్చని తెలుస్తోంది. ఈ సారి హిందీతో పాటు తెలుగు వెర్షన్‌ ఒకే రోజు రిలీజ్ చేయాలని మేకర్స్‌ నిర్ణయించుకున్నారట.

అప్పుడే సీక్వెల్ సిద్ధం

 ధురందర్‌ 2ని 2026 మార్చి 19న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. అదే రోజు ఈ సీక్వెల్‌ తెలుగు రిలీజ్ కూడా ఉంటుందని బి–టౌన్‌లో గట్టి టాక్‌ వినిపిస్తోంది. ప్రస్తుతం ధురందర్‌ మూవీ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది. పేరుకే హిందీ సినిమా కానీ, దక్షిణాదిలోనూ ఈ చిత్రానికి విపరీతమైన రెస్పాన్స్‌ వస్తుంది. పాన్ ఇండియా ట్రెండ్ పెరిగిన తర్వాత బాలీవుడ్ చిత్రాల్ని కూడా తెలుగులో అప్పుడప్పుడు డబ్ చేసి వదులుతున్నారు. ఇప్పటికే షారుక్‌, సల్మాన్‌, ఆమీర్‌, విక్కీ కౌశల్‌ వంటి స్టార్‌ హీరోల చిత్రాలు తెలుగు డబ్‌ అయ్యాయి.

Advertisement

Also Read: Anirudh Ravichander: ఎంఎస్‌ సుబ్బలక్ష్మి బయోపిక్‌కు అనిరుద్ మ్యూజిక్, గౌతమ్ నిర్ణయం కరెక్టేనా?

అయితే వాటిని హిందీ రిలీజ్‌ తో పాటు విడుదల చేసి ఉంటే మంచి వసూళ్లు వచ్చేవి. కానీ, హిందీ రిలీజ్ తర్వాత కాస్తా ఆలస్యంగా తెలుగులో విడుదలయ్యాయి. దీంతో ఇక్కడ ఆడియన్స్ సినిమాపై ఉన్న ఆసక్తి తగ్గి పెద్దగా వసూళ్లు రాబట్టలేకపోయాయి. అయితే ఇదే తప్పు ధురందర్‌ విషయంలోనూ జరిగింది. నిజానికి ఈ సినిమాకు నార్త్‌లోనే కాదు దక్షిణాదిలో మంచి బజ్‌ వస్తుంది. అప్పుడే తెలుగు వెర్షన్‌ రిలీజ్‌ చేసి ఉంటే మేకర్స్‌కి మరిన్ని లాభాలు వచ్చేవి. కనీసం చెప్పిన టైంలో అయిన విడుదల అయ్యి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఇప్పుడు సినిమా విడుదలైన రెండు వారాలు దాటిపోయింది. మూవీ వస్తున్న రెస్పాన్స్‌ చూసి ఇప్పటికే హైదరాబాద్‌ ఆడియన్స్‌ హిందీలో ఈ చిత్రాని చూశారు. కాబట్టి ఈ టైంలో తెలుగు వెర్షన్‌ తీసుకురావడం రిస్క్‌ అవుతుంది. అందుకే ధురందర్‌ ఫస్ట్‌ పార్ట్ ఇక తెలుగులో ఆపేశారని సమాచారం.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×