E-Paper
Advertisement

ధనుష్ ‘కర’ టీజర్ టాక్.. ‘నీ పాపం.. నీ పుణ్యం.. నువ్వే నరుక్కోవాలి!’.. ఏప్రిల్ 30న థియేటర్లు షేక్ అవ్వాల్సిందే!

ధనుష్ ‘కర’ టీజర్ టాక్.. ‘నీ పాపం.. నీ పుణ్యం.. నువ్వే నరుక్కోవాలి!’.. ఏప్రిల్ 30న థియేటర్లు షేక్ అవ్వాల్సిందే!
Advertisement

Kara Teaser : ధనుష్ … కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు పరిచయం అక్కర్లేని పేరు ఇది. అలాంటి వెర్సటైల్ మల్టీ టాలెంటెడ్ స్టార్ మరోసారి ‘కర’ అంటూ ఒక ఇంటెన్స్ అండ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాతో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి రెడీ అయిపోయాడు. ఇక తాజాగా తెలుగులో ఈ సినిమా టీజర్‌ని రిలీజ్ చేయగా, టీజర్ చూస్తుంటేనే ఇదొక పక్కా పక్కా రివెంజ్ అండ్ ఎమోషనల్ రైడ్ అని అర్థమవుతోంది.

టీజర్ హైలైట్స్..  డైలాగులు..  ఇంటెన్సిటీ

Advertisement

ఇక ఈ సినిమా టీజర్‌లో ధనుష్ మాట్లాడుతూ ‘‘పంటో.. గడ్డో.. పాపమో.. పుణ్యమో.. తను నాటింది.. తనే నరుక్కోవాలి. నేను నాటిన విత్తనం ఇప్పుడు కోత కొచ్చింది. అంత కంటే ముందు నా మీద పడ్డ మచ్చని తుడిచేయాలి.. నన్ను నమ్ముకున్న వారిని ముందుకు తీసుకెళ్లాలి.. నా పేరు కరసామి!’’అంటూ చెప్పిన డైలాగ్స్ ఇపుడు మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయ్.

ఒక యువకుడు తనపై పడ్డ నిందను తుడిచేసుకోవడానికి చేసే పోరాటమే ఈ ‘కర’ అని టీజర్ చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది. ముఖ్యంగా యువకుడి పాత్రలో ధనుష్ తన మనసులోని ఆవేదనని పలికించిన తీరుకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

Advertisement

ధనుష్ విశ్వరూపం.. మమితా బైజు మ్యాజిక్

ఇక ఈ సినిమాలో ఒకవైపు అమాయకమైన యువకుడిగా, మరోవైపు సమస్యను ఎదిరించే మొండివాడిగా రెండు పాత్రల్లో సాలిడ్ వేరియేషన్స్ చూపించాడు ధనుష్. ఇక ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజు ఈ సినిమాలో ధనుష్‌కి జోడీగా నటిస్తోంది. వీరిద్దరి కెమిస్ట్రీ కూడా స్క్రీన్ మీద ఫ్రెష్‌గా ఉండబోతోందని టీజర్ చూస్తేనే అర్థమవుతుంది.

ALSO READ :అక్కినేని కంటే క్రేజ్.. విదేశీ కార్లలో షికార్లు.. కట్ చేస్తే చివరకు కారు డిక్కీలో అనాథ శవంలా!

టెక్నికల్ పవర్ హౌస్.. జీవీ ప్రకాష్ అరాచకం!

ఇక టెక్నికల్‌గా చూస్తే సినిమాకి సంగీతం అందించిన జి.వి. ప్రకాష్ కుమార్ తన మ్యూజిక్‌తో టీజర్‌ను మరో రేంజ్‌లో పెట్టేశాడు. ముఖ్యంగా జి.వి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ (BGM) టాప్ నాచ్.ఇక థేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ విజువల్స్‌ను చాలా రిచ్‌గా, ఇంటెన్స్‌గా చూపిస్తుంటే డైరెక్టర్ విఘ్నేశ్ రాజా ఈ సినిమాను పకడ్బందీ స్క్రిప్ట్‌తో తెరకెక్కించినట్లు అర్థమవుతోంది.

రిలీజ్ ఎప్పుడు?

ఇక తమిళనాట డా. ఇషారి కె. గణేష్ నిర్మించిన ఈ సినిమాని విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ బ్యానర్లపై సిహెచ్ సతీష్ కుమార్, రాజేష్ కుమార్ బొబ్బర తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 30న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు.

వైరల్ అవుతున్న ప్రమోషన్స్!

ఇక సరికొత్త ప్రమోషనల్ స్ట్రాటజీస్‌తో ఇప్పటికే ‘కర’ మూవీపై భారీ అంచనాలు ఏర్పడగా లేటెస్ట్‌గా రిలీజ్ అయిన టీజర్ సినిమాపై వాటిని మరింతగా పెంచేసింది. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా సినిమా ట్రైలర్‌ని త్వరలోనే రిలీజ్ చేయనున్నారని తెలుస్తుంది.

జయరామ్, కె.ఎస్. రవికుమార్, కరుణాస్ వంటి దిగ్గజాలు ఈ సినిమాలో నటించడంతో ‘కర’ సినిమాపై మరింత క్రేజ్ పెరిగిందనే చెప్పాలి. ఇక టీజర్ చూసిన ఫ్యాన్స్ అంతా ధనుష్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పక్కా అని కామెంట్స్ చేస్తున్నారు.

మరి కరసామి తనపై పడ్డ మచ్చను ఎలా తుడుచుకున్నాడు? అతను ఎదుర్కొన్న ఆ పెద్ద సమస్య ఏంటి? అనే విషయాలు తెలియాలంటే మాత్రం ఏప్రిల్ 30 వరకు వెయిట్ చేయాల్సిందే!

ALSO READ :భార్య ముందే ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్‌తో మాటలు.. జాకీ భగ్నానీ ఓపెన్ స్టేట్‌మెంట్‌పై రకుల్ ఏమందంటే?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×