E-Paper
Advertisement

‘అమరన్’ డైరెక్టర్‌తో ధనుష్ ఊచకోత.. ‘ఓం’ టైటిల్ టీజర్ చూశారా?

‘అమరన్’ డైరెక్టర్‌తో ధనుష్ ఊచకోత.. ‘ఓం’ టైటిల్ టీజర్ చూశారా?
Advertisement

Dhanush OM:కోలీవుడ్ మల్టీ టాలెంటెడ్ ధనుష్  ఇప్పుడు ఆయన తన 55వ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర మరోసారి రచ్చ చేయడానికి రెడీ అయిపోయాడు. ఆ సినిమా ఆపేరే ‘ఓం’.ఇక ఈ రోజే విడుదలైన ‘ఫస్ట్ స్ట్రైక్’ టైటిల్ టీజర్ ఇపుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.ఇక టీజర్‌లో ధనుష్ మాస్ అండ్ ఉగ్రరూపంలో కనిపిస్తూ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించాడు. ‘చాప్టర్ 1: రుధిరం – ది బ్లడ్ వుడ్’ అనే ట్యాగ్‌లైన్ చూస్తుంటే, ఈసారి థియేటర్లలో బ్లడ్ బాత్ పక్కా అని అర్థమయిపోతుంది కూడా.

అమరన్’ చిత్రంతో ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన డైరెక్టర్

Advertisement

ఇక  రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాను ‘అమరన్’ చిత్రంతో ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి  తెరకెక్కిస్తుండటం విశేషం.ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకడానికి ప్రధాన కారణం ఇందులోని స్టార్ క్యాస్ట్ అనే చెప్పాలి.ఇక  ‘భ్రమయుగం’,’టర్బో’ వంటి హిట్లతో అలరించిన మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ రోల్ చేస్తుండటం,’మారీ 2′ లో ‘రౌడీ బేబీ’ కాంబో తర్వాత సాయి పల్లవి మళ్లీ ధనుష్‌తో జతకడుతుండటం తో పాటు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడంతో ఇది సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మ్యూజిక్ అందిస్తున్న సాయి అభ్యంకర్

Advertisement

ఇక ఈ సినిమాని ధనుష్ సొంత బ్యానర్ ‘వండర్‌బార్ ఫిల్మ్స్’, ‘ఆర్-టేక్ స్టూడియోస్’తో కలిసి శ్రద్ధా అగర్వాల్, అజ్మత్ జగ్మద్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. ఇక ‘కచ్చి సేరా’, ‘ఆశ కూడా’ పాటలతో ట్రెండ్ సెట్ చేసిన యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తుండటంతో మ్యూజిక్ లవర్స్ లో అంచనాలు పెరిగిపోయాయి.ఇక తాజాగా టీజర్‌లో ఆయన ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా రేంజ్‌ను మరో లెవెల్ లో పెట్టేసింది.

ఈ దసరాకి ఎలాంటి  సక్సెస్ అందిస్తాడో

 ఇక  ధనుష్ తన  ‘ఓం’ని విజయదశమి పండుగ కానుకగా 2026 అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వదలనున్నట్టు అనౌన్స్ చేయడంతో మురిసిపోతున్నారు మూవీ లవర్స్. చూడాలి మరి గతేడాది అమరన్ తో ఏకంగా 400 కోట్లు కొల్లగొట్టిన రాజ్‌కుమార్ పెరియసామి ఈ దసరాకి ఎలాంటి  సక్సెస్ అందిస్తాడో !

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×