E-Paper
Advertisement

చిత్ర యూనిట్ కి షాక్.. దేవిశ్రీప్రసాద్ ఎల్లమ్మ మూవీ స్టోరీ లీక్!

చిత్ర యూనిట్ కి షాక్.. దేవిశ్రీప్రసాద్ ఎల్లమ్మ మూవీ స్టోరీ లీక్!
Advertisement

Yellamma movie: సినిమా , డిజిటల్ కంటెంట్ పై జరుగుతున్న పైరసీ దాడులను అరికట్టడానికి అటు ప్రభుత్వాలు ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఏదో ఒకరకంగా సోషల్ మీడియాలో లీక్ అవుతూ చిత్ర బృందానికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే సినిమా విడుదలైన తొలిరోజే సినిమా మొత్తం లీక్ అవడం ఒక ఎత్తు అయితే.. ఒకవైపు సినిమా షూటింగ్ సెట్లో ఉండగానే సినిమాకు సంబంధించిన కీలక ఘట్టాలు సోషల్ మీడియాలో లీక్ అవడం మరో ఎత్తు.. ఇలాంటి లీక్స్ చిత్ర బృందాన్ని అయోమయంలో పడేస్తున్నాయి.

ఎల్లమ్మ స్టోరీ లైన్ లీక్..

ఇకపోతే ఈ లీక్ అనేది రెండు రకాలు అనే చెప్పాలి. కొంతమంది ఆకతాయిలు సినిమాను స్పాయిల్ చేసి ఆర్థికంగా లాభపడడానికి ఆ సినిమా సన్నివేశాలను లేదా సినిమా మొత్తాన్ని ఆన్లైన్లో లీక్ చేస్తూ ఉంటారు. ఇక మరొక లీక్ విషయానికి వస్తే చిత్ర బృందంలో ఎవరో ఒకరు సినిమా పై హైప్ పెంచడానికి సినిమా లైన్స్ ను ఇలా లీక్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా జబర్దస్త్ కమెడియన్ వేణు ఎల్దండి దర్శకత్వంలో..మ్యూజిక్ డైరెక్టర్గా శ్రోతలను అలరించి .. స్టార్ స్టేటస్ అంతం చేసుకున్న దేవిశ్రీప్రసాద్ హీరోగా నటిస్తున్న తొలి చిత్రం ఎల్లమ్మ. తాజాగా ఈ సినిమా స్టోరీ లీక్ అవ్వడం తో అటు చిత్ర బృందమే కాదు అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ సినిమా స్టోరీని ఎవరు లీక్ చేశారు? ఆ స్టోరీ ఏంటి ?అనే విషయం ఇప్పుడు చూద్దాం..

Advertisement

also read:లవ్ రూమర్స్.. కాబోయే వాడికి అలాంటి క్వాలిటీస్ ఉండాలంటున్న శ్రీ లీల!

ఒక్క మాటతో మొత్తం చెప్పేసిన లిరిసిస్ట్..

బలగం సినిమాతో దర్శకుడిగా సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న జబర్దస్త్ కమెడియన్ వేణు ఎల్దండి సరికొత్త ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అదే ఎల్లమ్మ. ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టు పైనే ఫోకస్ పెట్టారు. ఇక ఈ చిత్రాన్ని దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. పైగా ఈ చిత్రం ద్వారా దేవిశ్రీప్రసాద్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇకపోతే హీరోయిన్ వేటలో సాయి పల్లవి, కీర్తి సురేష్ ఇలా చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి కానీ ఇప్పటివరకు ఎవరు ఫైనల్ అనే విషయంపై అధికారికంగా ప్రకటించలేదు ఇలాంటి సమయంలో తాజాగా ఈ సినిమా నుండి స్టోరీ లైన్ వైరల్ గా మారింది.

సినిమా కథలో ఇంత డెప్త్ ఉందా?

Advertisement

ఎల్లమ్మను కొలిచే చిందు యక్షగానం కళాకారుల ఫ్యామిలీ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ ఒక ఇంటర్వ్యూలో లీక్ చేస్తూ స్పష్టం చేశారు. కుటుంబ కళలు , గ్రామానికి చెందిన ఎమోషన్స్, హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్, తల్లి సెంటిమెంట్ అన్ని మిళితం కానున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఎల్లమ్మకు జానపద కళలకి మధ్య ఉన్న సంబంధం ఏంటి ?అనే విషయాన్ని కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారట. దీంతో ఎల్లమ్మ సినిమా స్టోరీ లీక్ అయినట్లు సోషల్ మీడియాలో ఒక వార్త జోరుగా ప్రచారం అవుతుంది. అయితే ఈ సినిమాలో కూడా తెలంగాణ యాస భాష ఉండే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మొత్తానికైతే ఈ సినిమాతో వేణు మరో పగడ్బందీ విజయాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. మరి బలగం రేంజ్ లో గుర్తింపు లభిస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×