E-Paper
Advertisement

Devara2: ఎన్టీఆర్ ‘దేవర 2’ డౌటేనా? మే 20న షాకింగ్ అనౌన్స్‌మెంట్..?

Devara2: ఎన్టీఆర్ ‘దేవర 2’ డౌటేనా? మే 20న షాకింగ్ అనౌన్స్‌మెంట్..?
Advertisement

Devara2: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఇప్పుడు ఒకటే టెన్షన్.. అసలు ‘దేవర 2’ వస్తుందా? రాదా? ఒకపక్క సముద్రపు దొంగగా తారక్ సృష్టించిన బీభత్సం ఇంకా కళ్లముందే ఉన్నా, సీక్వెల్ షూటింగ్ మాత్రం అడుగు ముందుకు పడటం లేదు. దీనికి ప్రధాన కారణం సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అని ఇండస్ట్రీ టాక్. తన ‘డ్రాగన్’ సినిమా కోసం ఎన్టీఆర్‌ను నీల్ పూర్తిగా లాక్ చేసేశాడు. అవుట్ పుట్ విషయంలో ఒక్క శాతం కూడా రాజీ పడని ఈ కన్నడ డైరెక్టర్, ‘డ్రాగన్’ పూర్తయ్యే వరకు తారక్ మరే సెట్‌లోకి వెళ్లడానికి వీల్లేదని కండిషన్ పెట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

నీల్ ‘డ్రాగన్’ మాయ.. కొరటాల శివకు తిప్పలు
ప్రస్తుతం ఎన్టీఆర్ ‘డ్రాగన్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా అనుకున్న దానికంటే లేట్ అవుతోంది. ప్రశాంత్ నీల్ ప్రతి సీన్‌ను పర్ఫెక్ట్‌గా చెక్కుతుండటంతో.. తదుపరి ప్రాజెక్టులైన దేవర 2,తో పాటు మరిన్ని సినిమాలషెడ్యూల్స్ తలకిందులవుతున్నాయి. నిజానికి దేవర సీక్వెల్ షూటింగ్ ఈ పాటికే మొదలవ్వాలి, కానీ నీల్ ఇంటెన్సిటీ చూస్తుంటే.. ఎన్టీఆర్ ఈ ఏడాది మొత్తం ‘డ్రాగన్’కే అంకితం అవ్వాల్సి వచ్చేలా ఉంది. దీంతో డైరెక్టర్ కొరటాల శివ పరిస్థితి ‘ముందు నుయ్యి.. వెనుక గొయ్యి’లా తయారైందని సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Advertisement

దేవర 2 ఉంటుందా? అటకెక్కుతుందా?
దేవర పార్ట్ 1 500 కోట్ల క్లబ్‌లో చేరినప్పటికీ, వచ్చిన మిక్స్‌డ్ టాక్ నేపథ్యంలో సీక్వెల్ కంటెంట్‌పై కొరటాల శివ కసరత్తులు చేస్తున్నారు. స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యిందని, ఎన్టీఆర్ రోల్‌ను పార్ట్ 1 కంటే పదింతలు పవర్‌ఫుల్‌గా ప్లాన్ చేశారని వార్తలు వస్తున్నా.. ఆచరణలో మాత్రం షూటింగ్ డేట్స్ కనిపించడం లేదు. ఇదే సమయంలో ఎన్టీఆర్ లైనప్‌లో నెల్సన్ దిలీప్ కుమార్, వెట్రిమారన్ వంటి దిగ్గజ దర్శకులు క్యూలో ఉండటంతో.. అసలు ‘దేవర 2’ అటకెక్కుతుందా? లేక వాయిదా పడుతుందా? అన్నది హాట్ టాపిక్‌గా మారింది.

మే 20న ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ బర్త్‌డే ట్రీట్!
ఈ గందరగోళానికి ఒక్క రోజే సమాధానం చెప్పగలదు.. అదే మే 20. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా తన అఫీషియల్ లైనప్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఆ రోజు ‘దేవర 2’ గురించి ప్రకటన లేకపోతే మాత్రం.. ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో ఉండదని ఫిక్స్ అయిపోవాల్సిందే. అప్పటివరకు ఈ సీక్వెల్ భవితవ్యం ప్రశాంత్ నీల్ చేతుల్లోనే ఉందన్నది కాదనలేని సత్యం. మరి మే 20న తారక్ ఎలాంటి సర్ ప్రైజ్ ఇస్తారో చూడాలి.

Advertisement

read also: కోలీవుడ్‌కు టాలీవుడ్ షాక్: తమిళ తంబీల ‘డబ్బింగ్’ పప్పులు ఇక ఉడకవా ?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×