E-Paper
Advertisement

Dethadi First Glimpse:ఘనీ భాయ్‌గా ఆశిష్.. గట్టిగానే కొడతాము అంటూ మాస్ షో!

Dethadi First Glimpse:ఘనీ భాయ్‌గా ఆశిష్.. గట్టిగానే కొడతాము అంటూ మాస్ షో!
Advertisement

Dethadi First Glimpse:దిల్ రాజు, శిరీష్ కలిసి నిర్మిస్తున్న కొత్త సినిమా డెతడి ఇప్పుడు మంచి హైప్ తెచ్చుకుంటోంది. ఈ సినిమాలో యంగ్ హీరో ఆశిష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆయన ముందుగా రౌడీ బాయ్స్, లవ్ మీ సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఈ సినిమాతో ఆదిత్య రావు గంగసాని దర్శకుడిగా మొదటిసారి పరిచయం అవుతున్నారు. కథ మొత్తం హైదరాబాద్ నగరంపై ఆధారపడి, అక్కడి సంస్కృతి, జీవన విధానం, ఉత్సాహాన్ని చూపించబోతోంది అని ఈరోజు విడుదలైన చిన్న వీడియో చూస్తే అర్థమవుతుంది.

ఈరోజు విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ఇందులో ఆశిష్ ను ఘనీ భాయ్ అనే పాత్రలో చూపించారు. అతను ఒక స్ట్రీట్ డ్రమ్ ఆర్టిస్ట్ గా పరిచయం చేశాడు . హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో జరిగే పండుగలు, శుభకార్యాల్లో తన టీమ్‌తో కలిసి డ్రమ్స్ వాయిస్తూ అందరిని అలరిస్తాడు.

Advertisement

సుమారు ఏడు కిలోల బరువు ఉన్న డ్రమ్స్ మోస్తూ గంటల పాటు ఆగకుండా ప్రదర్శన ఇవ్వడం నా ప్రత్యేకత అంటూ హీరో స్టైల్ గా నడుస్తూ చెప్పే డైలాగ్స్ తో ఈ గ్లిమ్స్ మొత్తం నడిచింది.

Advertisement

ఈ పాత్రలో ఆశిష్ తన నటనతో ఆకట్టుకున్నాడు. రఫ్ లుక్, గడ్డం, స్టైల్ పాత్రకు బాగా సరిపోయాయి. ఆయన బాడీ లాంగ్వేజ్, హైదరాబాద్ స్లాంగ్ మాట్లాడే విధానం చాలా సహజంగా అనిపించింది. ముఖ్యంగా కొన్ని డైలాగ్స్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా చివరిలో బ్యాండ్ వాళ్ళం కదా గట్టిగా కొడతాం అని ఆశిష్ చెప్పిన డైలాగ్ ఈ సినిమా మాస్ ప్రేక్షకులను ఆకాశపు నేల అనిపిస్తుంది.

దర్శకుడు ఆదిత్య రావు గంగసాని కొత్తవాడైనా కథను బాగా హ్యాండిల్ చేసినట్టు ఈ గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది. విజువల్స్ కలర్‌ఫుల్‌గా, ఎనర్జీతో నిండిపోయాయి. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్ రాజు ప్రొడక్షన్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. ప్రసన్న కుమార్ బెజవాడ కథ, మాటలు బలంగా ఉన్నాయి. జునైద్ కుమార్ సంగీతం డ్రమ్స్ బీట్‌తో సినిమాకు మరింత ఉత్సాహాన్ని తీసుకురాబోతోంది.

గ్లింప్స్ లాంచ్ కూడా చాలా గ్రాండ్‌గా జరిగింది. 500కి పైగా డ్రమర్స్ కలిసి లైవ్ ప్రదర్శన ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొత్తానికి డెతడి ఒక ఎనర్జీతో నిండిన, కలర్‌ఫుల్ ఎంటర్టైనర్‌గా కనిపిస్తోంది. త్వరలో “జాతర” మొదలవుతుందని మేకర్స్ చెప్పడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి ఇంకా పెరిగింది.

ALSO READ: Dhurandhar 3: ధురంధర్ 3 పై రూమర్ల పై క్లారిటీ.. ఉన్నట్టా? లేనట్టా?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×