E-Paper
Advertisement

గీతా ఆర్ట్స్ నుంచి ‘దీవానా’ ట్రైలర్ వచ్చేసింది.. మరో రూటెడ్ లవ్ స్టోరీ..

గీతా ఆర్ట్స్ నుంచి ‘దీవానా’ ట్రైలర్ వచ్చేసింది.. మరో రూటెడ్ లవ్ స్టోరీ..
Advertisement

Deewana Trailer: ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ (Geetha Arts) సమర్పణలో, వి స్టూడియోస్, అర్హా మీడియా భాగస్వామ్యంతో రూపుదిద్దుకుంటున్న సరికొత్త చిత్రం ‘దీవానా’ (Deewana). హర్షిత్, స్నేహ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. పక్కా యూత్‌ఫుల్, రొమాంటిక్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా కట్ చేసిన ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Read also-సోషల్ మీడియా ట్రోలర్స్‌కు నటి హేమ షాక్.. సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు!

కథా నేపథ్యం..

Advertisement

“ఎంత గొప్ప లవ్ స్టోరీ అయినా వన్ సైడ్ లవ్ తోనే స్టార్ట్ అవుతది రా భాయ్” అనే ఆసక్తికరమైన డైలాగ్‌తో సాగిన ఈ ట్రైలర్ సినిమా కథాంశాన్ని ప్రతిబింబిస్తోంది. పక్కా లోకల్ హైదరాబాద్/తెలంగాణ యాసలో సాగే సంభాషణలు మాస్ మరియు యూత్‌కు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. తన ప్రేయసి ‘అమ్ము’ ప్రేమను గెలుచుకోవడానికి హీరో పడే తపన, వారి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచాయి.

Read also-‘పెద్ది’ వీకెండ్ కలెక్షన్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే.. రామ్ చరణ్ కెరీర్ లోనే..

Advertisement

ప్రేమకథతో పాటు సినిమాలో మంచి వినోదం, యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉన్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. హీరోయిన్‌ను ఆఫీస్‌లో ఇబ్బంది పెట్టే వ్యక్తిపై హీరో యాక్షన్ మోడ్‌లోకి దిగే సీన్లు, స్నేహితుల మధ్య వచ్చే కామెడీ టైమింగ్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. “లవ్ తో ఉన్న ప్రాబ్లం ఏందో తెలుసా.. అందులో సత్య అంత ప్రేమ లేకపోతే అది లవ్వే కాదురా భాయ్”, “ఐ యామ్ నాట్ బేవర్స్.. ఐ యామ్ మ్యాన్ అండ్ ఐ టేక్ కేర్ ఆఫ్ యు” వంటి డైలాగ్స్ సినిమాలోని ఎమోషనల్ డెప్త్‌ను చూపిస్తున్నాయి. సరికొత్త నటీనటులతో, గీతా ఆర్ట్స్ వంటి ప్రతిష్టాత్మక బ్యానర్ సపోర్ట్‌తో వస్తున్న ‘దీవానా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. తాజాగా ఈ మరో రూటెడ్ స్టోరీతో రాబోతున్న దీవానా నుంచి వచ్చిన ట్రైరల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×