E-Paper
Advertisement

Deepika Padukone: ఆ రెండు సినిమాల నుంచి అందుకే తప్పుకున్నా… అసలు మ్యాటర్ చెప్పిన దీపిక!

Deepika Padukone: ఆ రెండు సినిమాల నుంచి అందుకే తప్పుకున్నా… అసలు మ్యాటర్ చెప్పిన దీపిక!
Advertisement

Deepika Padukone: దీపికా పదుకొనే ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇవే బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్న దీపికా పదుకొనే(Deepika Padukone) సౌత్ సినిమా అవకాశాలను కూడా అందుకుంటూ బిజీ అయ్యారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమాలో దీపిక నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

పాన్ ఇండియా ప్రాజెక్టులను మిస్ చేసుకున్న దీపిక..

ఇక ఈ సినిమా అనంతరం ఈమెకు వరుస పాన్ ఇండియా సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న స్పిరిట్(Spirit) సినిమాలో కూడా ఈమె నటించబోతుందని వెల్లడించారు. అయితే కొన్ని కారణాలవల్ల దీపికా పదుకొనే స్పిరిట్ సినిమా నుంచి అలాగే ప్రభాస్ కల్కి 2 (Prabhas 2)నుంచి కూడా తప్పిస్తున్నట్లు నిర్మాతలు అధికారకంగా ప్రకటించారు. ఈ విషయంపై దీపికా పదుకొనే తరచూ వార్తల్లో నిలిచారు. అయితే తాజాగా ఈమె ఈ రెండు సినిమాల నుంచి తప్పుకోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయాలను బయటపెట్టారు.

సినిమాల విషయంలో ఆలోచన మారింది..

Advertisement

ఈ సందర్భంగా దీపికా పదుకొనే మాట్లాడుతూ.. ఒకప్పుడు తాను సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకోవడం కోసమే తాపత్రయపడ్డాను అందుకు అనుగుణంగానే కథలను ఎంపిక చేసుకున్నాను కానీ ఇటీవల తన అభిప్రాయం మారిందని తెలిపారు. కీర్తి, డబ్బు కంటే కూడా అర్థవంతమైన సినిమాలలో నటించాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. తాను ఎనిమిది గంటలు మాత్రమే పని చేస్తూ ఎంతో ఆరోగ్యవంతమైన పరిస్థితులలో మాత్రమే షూటింగ్ లోకేషన్ లోకి అడుగు పెట్టాలని నిర్ణయాన్ని తీసుకున్నాను అంటూ ఈమె ఈ రెండు భారీ ప్రాజెక్టుల నుంచి తప్పుకోవడానికి గల కారణాలను తెలియజేశారు.

అల్లు అర్జున్ సినిమాతో బిజీగా దీపిక..

Advertisement

సందీప్ రెడ్డి సినిమా నుంచి ఈమె తప్పుకోవడానికి కారణం పని వేళలే అని స్పష్టమవుతుంది ఎనిమిది గంటలకంటే ఎక్కువగా పని చేయనని ఈమె వాదించిన నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి తప్పించారంటూ వార్తలు బయటకు వచ్చాయి. స్పిరిట్ సినిమా నుంచి దీపికను తప్పించడంతో కల్కి 2 చిత్ర బృందం కూడా ఈమెను తప్పిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఇక ప్రస్తుతం ఈమె అల్లు అర్జున్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించబోతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

Also Read: IBomma Ravi: ఐ బొమ్మ రవి కోసం రంగంలోకి వకీల్ సాబ్… నేనున్నానంటూ భరోసా?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×