E-Paper
Advertisement

IBomma Ravi: ఐబొమ్మ రవి అరెస్టుకు తన భార్యకు సంబంధం లేదు… అసలు కారణం ఇదే!

IBomma Ravi: ఐబొమ్మ రవి అరెస్టుకు తన భార్యకు సంబంధం లేదు… అసలు కారణం ఇదే!
Advertisement

IBomma Ravi: సినిమా పైరసీ కింగ్ ఐ బొమ్మ (Ibomma)నిర్వాహకుడు ఇమ్మడి రవి(Immadi Ravi) పోలీసుల కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా పెద్ద ఎత్తున సినిమాలను పైరసీ చేస్తూ కోట్ల రూపాయల ఆదాయాలను ఆర్జించారు. ఇలా సినిమాలను పెద్ద ఎత్తున పైరసీలకు పాల్పడుతున్న ఇతనిని పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరచగా 14 రోజులపాటు రిమాండ్ విధించింది. ప్రస్తుతం జైలులో ఉన్న ఇమ్మడి రవికి సంబంధించి ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చాయి. గత కొంతకాలంగా పోలీసులు ఈయన కోసం గాలింపు చర్యలు చేపట్టి పక్కా ప్రణాళికలతో అరెస్టు చేశారు.

రవి అరెస్టుకు ఆయన భార్యకు సంబంధం లేదు..

ఇలా ఇమ్మడి రవి అరెస్టు కావడానికి కారణం తన భార్య అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈయన అరెస్ట్ కావడంలో పోలీసుల ప్రమేయం ఏమాత్రం లేదంటూ వార్తలు బయటకు రావడంతో ఈ వార్తలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్(Cyber Crime) పోలీసులు స్పందించారు. ఈ సందర్భంగా పోలీసులు ఇమ్మడి రవి అరెస్టు గురించి క్లారిటీ ఇచ్చారు. ఇమ్మడి రవి ఫ్రాన్స్ నుంచి తన భార్యకు విడాకులు(Divorce) ఇవ్వడానికే హైదరాబాద్ వచ్చారని తన భార్య సమాచారం ప్రకారం మేము అరెస్టు చేసాము అంటూ వస్తున్న వార్తలలో నిజం లేదని తెలిపారు. రవికి తన భార్యకు మధ్య గొడవలు ఉన్న మాట నిజమే అయితే వీరిద్దరికి ఐదు సంవత్సరాల క్రితమే విడాకులు అయ్యాయని పోలీసులు తెలిపారు.

బెట్టింగ్ యాప్ చెల్లింపు ఆధారంగా..

Advertisement

ఇటీవల ఒక బెట్టింగ్ యాప్ నుంచి రవికి జరిగిన చెల్లింపులు ఆధారంగా తాము దర్యాప్తు చేశామని ఐపీ అడ్రస్ ద్వారా మూసాపేట్ లోని విస్టా అపార్ట్మెంట్ ను గుర్తించి నిఘా ఉంచామని తెలిపారు. ఈయన రెండు రోజుల క్రితం ఫ్రాన్స్ నుంచి తిరిగి రాగానే తనని కస్టడీలోకి తీసుకున్నామని పోలీసులు రవి అరెస్టు గురించి క్లారిటీ ఇచ్చారు. ఇలా ఇమ్మడి రవి అరెస్టుకు తన భార్య కారణమంటూ వస్తున్న వార్తలలో నిజం లేదని పోలీసులు ఈ వార్తలను ఖండించారు.

ప్రపంచ స్థాయికి పైరసీ నెట్ వర్క్…

Advertisement

ఇక ఈయనని అరెస్టు చేసిన తర్వాత రవి నుంచి పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టారని తెలుస్తోంది. సినిమాలను పైరసీ చేయడం కోసం ఈయన 100కు పైగా వెబ్సైట్లను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. రవి పైరసీ నెట్ వర్క్ ను ప్రపంచ స్థాయికి తీసుకు వెళ్లినట్టు పోలీసు విచారణలో తేలింది. యూకే లో రవి నేతృత్వంలో కొన్ని సాంకేతిక బృందాలు కూడా పనిచేస్తున్నట్టు ఈ సందర్భంగా పోలీసులు వెల్లడించారు. ఇలా సినిమాలను పైరసీ చేస్తూ పట్టబడిన ఈయన నుంచి మూడు కోట్ల రూపాయల నగదుతో పాటు కీలకమైన హార్డ్ డిస్క్ లను, కొన్ని కంప్యూటర్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఐ బొమ్మ రవి అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లడంతో చిత్ర దర్శక నిర్మాతలు సంతోషం వ్యక్తం చేసినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం రవికి మద్దతుగా కామెంట్లు చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×