E-Paper
Advertisement

Kollywood : రజినీకాంత్ నిర్మాతకు కోర్టు నోటిసులు.. అసలేం జరిగిందంటే..?

Kollywood : రజినీకాంత్ నిర్మాతకు కోర్టు నోటిసులు.. అసలేం జరిగిందంటే..?
Advertisement

Kollywood : ఇటీవల కాలంలో చెక్ బౌన్స్ కేసులు సినీ ఇండస్ట్రీలో ఎక్కువ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీలో ఇలాంటి ఘటనలు తరచుగా వింటున్నాం.. ఇప్పుడు మరో కేసు నమోదు కావడంతో కోలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అది కూడా రజినీకాంత్ సినిమా నిర్మాత విషయంలో ఇలా జరగడం పై కోలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. రజినీకాంత్ గతంలో నటించిన ‘కొచ్చడైయాన్‌’ నిర్మాతకు మద్రాస్ హైకోర్టు దిమ్మతిరిగే షాకిచ్చింది. అసలేం జరిగింది..? నిర్మాతను పోలీసులు అరెస్ట్ చేస్తారా అన్నది ఒకసారి వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

రజినీకాంత్ నిర్మాతకు కోర్టు నోటీసులు..

కోలీవుడ్ హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం ‘కొచ్చడైయాన్‌’ మూవీ నిర్మాతకు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది.. 3డీ మోషన్‌ క్యాప్చర్‌ మూవీగా కొచ్చడైయాన్‌ 2014లో విడుదలైంది. ఈ మూవీకి ఆయన కుమార్తె సౌందర్య దర్శకత్వం వహించారు.. ఈ సినిమాను మీడియా వన్ గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మాత జె. మురళి మనోహర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్ర నిర్మాత పై చెక్ బౌన్స్ కేసు నమోదు అయ్యింది. ఓ యాడ్ సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోర్టు నిర్మాతకు నోటీసులు పంపింది. ఈ కేసులో భాగంగా నిర్మాతను డబ్బులు ఇస్తారా జైలుకు వెళ్తారా అని నోటీసులో పేర్కొన్నట్లు తెలుస్తుంది.. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

Advertisement

Also Read: మళ్ళీ ఆ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన రామ్..స్టోరీ లైన్ వింటే మతిపోద్ది..

అసలు మ్యాటర్ ఏంటంటే..

రజనీకాంత్ నటించిన కొచ్చడైయాన్‌ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కింది.. చివరి దశలో ఈ చిత్రాన్ని పూర్తి చేసి విడుదల చేసేందుకు బెంగుళూరుకి చెందిన యాడ్‌ బ్యూరో అడ్వర్టైజింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుంచి అప్పు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో నిర్మాత మురళి మనోహర్ విఫలం అయ్యాడు. దాంతో చట్టపరమైన వివాదానికి కారణం అయ్యాడు. చెల్లింపులో భాగంగా చిత్ర నిర్మాత కొన్ని చెక్కులు ఇచ్చాడు. అందులో ఒకటి బౌన్స్ అయింది.. దీంతో అప్పు ఇచ్చిన ఆ బ్యూరో వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. చాలా సంవత్సరాల పాటు ఈ కేసు నడిచింది.. చివరకు నిర్మాతకు షాక్ ఇచ్చింది.. డబ్బులు కడతారా? లేక జైలుకు వెళ్తారా అని కండిషన్ పెట్టినట్లు తెలుస్తుంది.. ఇకపోతే కోర్టు ఇచ్చిన గడవులోపు చెల్లించకపోతే జైలు శిక్షను అమలు చేయవచ్చని కోర్టు పేర్కొంది. ప్రస్తుతం ఇది కోలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది..

రజినీకాంత్ సినిమాల విషయానికొస్తే.. 

Advertisement

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ వయసు పెరుగుతున్న కూడా సినిమాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు.. ఏడాదికి అభిమానులను పలకరిస్తున్నాడు. ప్రస్తుతం రజిని ఆయన 173 వ సినిమా జైలర్ 2 లో నటిస్తున్నాడు.. అలాగే కమలహాసన్ తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే..

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×