E-Paper
Advertisement

Coolie : వార్ 2 ను డామినేట్ చేసిన కూలీ, హిట్ టాక్ వస్తే కానీ గట్టెక్కదు

Coolie : వార్ 2 ను డామినేట్ చేసిన కూలీ, హిట్ టాక్ వస్తే కానీ గట్టెక్కదు
Advertisement

Coolie : చాలామంది ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న సినిమా కూలీ. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. దీని కారణం ఒకటి రజనీకాంత్ ఈ సినిమాలో నటించడంతో పాటు, లోకేష్ కనకరాజ్ కు డైరెక్టర్ గా ఉన్న ఒక బ్రాండ్ వ్యాల్యూ. అలానే రజినీకాంత్ తో పాటు పలువురు స్టార్ హీరోస్ ఈ సినిమాలో కనిపిస్తున్నారు.

కూలీ సినిమాతోపాటు ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలిసిన నటిస్తున్న వార్ 2 సినిమా కూడా ఆగస్టు 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా మీద కూడా కొద్దిపాటి అంచనాలు ఉన్నాయి. అని చాలాచోట్ల వార్ 2 సినిమా కంటే కూలీ సినిమాకు ఎక్కువ ఆదరణ లభిస్తుంది. క్లియర్ గా కూలీ సినిమా డామినేషన్ కనిపిస్తుంది.

Advertisement

బెంగుళూరు పూర్ బుకింగ్స్ 

ఈ సినిమాకి సంబంధించి బెంగళూరులో బుకింగ్స్ చాలామందిని ఆశ్చర్యపరుస్తున్నాయి. మొత్తం బెంగళూరులో ఇప్పటికే 1050 షోస్ ప్రదర్శించబడునున్నాయి. ఇప్పటికే గ్రాస్ 8 కోట్లు వచ్చింది. 1,94,000 టికెట్లు అమ్ముడుపోయాయి. మరోవైపు టికెట్స్ కూడా ఫాస్ట్ గా ఫీల్ అవుతున్నాయి. వార్ 2 గ్రాస్ కేవలం 70 లక్షలు మాత్రమే వచ్చింది. మొత్తానికి 295 షోస్ వేస్తున్నారు. ఇప్పటివరకు కేవలం 13000 టికెట్లు మాత్రమే సేల్ అయ్యాయి. అయితే కూలీ సినిమాతో పోలిస్తే క్లియర్ గా వార్ 2 రెస్పాన్స్ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుంది. అంతేకాకుండా కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నారు కాబట్టి ఆడియన్స్ కూలీ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు.

Advertisement

తెలుగు రాష్ట్రాల్లో కూడా అంతంత మాత్రమే 

ఇక వార్ 2 సినిమాని తెలుగులో సూర్యదేవర నాగ వంశీ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి గ్రాండ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఈవెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఆ స్థాయిలో సినిమాకి బుకింగ్స్ వస్తున్నాయా అంటే క్లారిటీ లేదు. అందరి కళ్ళు కూడా కేవలం కూలీ సినిమా పైనే ఉన్నాయి. ఈ తరుణంలో వార్ సినిమాకి హిట్ టాక్ రాకపోతే మాత్రం సినిమా ఇంక డిజాస్టర్ అయిపోయినట్లే. మరోవైపు కూలీ బుకింగ్స్ విపరీతంగా జరుగుతున్నాయి. కొంచెం పాజిటివ్ టాక్ వచ్చిన 1000 కోట్లు కలెక్షన్ ఈజీగా కొడుతుంది అనడంలో సందేహం లేదు.

Also Read: Janhvi Kapoor : మెగాస్టార్ నే పక్కన పెట్టేసారు, బాలీవుడ్ సినిమాలను బ్యాన్ చేయడంలో తప్పులేదు

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×