// // Coolie - War2 - నిర్మాతలే సినిమాను చంపుకుంటే.. కూలీ, వార్ 2 పరిస్థితి ఇదే మరి -->
E-Paper
Advertisement

Coolie – War2: నిర్మాతలే సినిమాను చంపుకుంటే.. కూలీ, వార్ 2 పరిస్థితి ఇదే మరి

Coolie – War2: నిర్మాతలే సినిమాను చంపుకుంటే.. కూలీ, వార్ 2 పరిస్థితి ఇదే మరి
Advertisement

Coolie and War 2 Talk: ఈ వారం బాక్సాఫీసు రెండు పెద్ద సినిమాలు విడుదలయ్యాయి. ‘కూలీ‘, వార్‌ 2 చిత్రాలు ఒకేరోజు విడుదల అవుతుండటంతో బాక్సాఫీసు వద్ద పండగ వాతావరణం నెలకొంది. ఇక అభిమానులు ఉత్సాహం అంత ఇంత కాదు. ఇక మూవీ బ్లాక్‌బస్టరే అంటూ కాలర్‌ ఎగిరేశారు. ఈ చిత్రాలపై బజ్‌ కూడా ఆ రేంజ్‌లో ఉంది. దీంతో కూలీ, వార్‌ 2 మధ్య బాక్సాఫీసు క్లాష్‌పై హై ఎక్స్‌పెక్టేషన్స్‌ నెలకొన్నాయి. రెండు సినిమాలు హిట్‌ అయినా.. ఇందులో ఏది అత్యధిక వసూళ్లు సాధిస్తుందా ట్రేడ్‌ వర్గాలు అంచనాలు వేసుకున్నాయి. ఇదంత కూలీ, వార్‌ 2 రిలీజ్‌ ముందు ఉన్న పరిస్థితుల. విడుదల తర్వాత అంచనాలు అన్ని తారుమారు అయ్యాయి.

Advertisement

తారుమారైన అంచనాలు 

ఏ సినిమాకు ఎంత టాక్‌ వస్తుందాని ఫ్యాన్స్‌ మధ్య వార్‌ కూడా నడిచింది. కానీ, రిలీజ్ తర్వాత అదేది కనిపించడం లేదు. కారణం రెండు సినిమాలు యావరేజ్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. రెండు కూడా ఆడియన్స్‌ని పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం కూలీ, వార్‌ 2 ఒకే రేటింగ్‌, టాక్‌ తెచ్చుకున్నాయి. రిలీజ్ ముందు వరకు ఉన్న హైప్‌, బజ్‌ రెండు సినిమాల్లోనూ కనిపంచకపోవడంతో హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్లిన ప్రేక్షకులు డిసప్పాయింట్‌ అవుతున్నాడు. మూవీలో పెద్దగా ఏం లేదు భయ్యా.. యావరేజ్‌ అంటూ రివ్యూ ఇస్తున్నారు. కూలీ, వార్‌ 2కి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం నిర్మాతలే అని చెప్పాలి. ఎందుకుంటే ప్రమోషన్స్ పేరుతో మూవీలో ఓవర్‌ హైప్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement

నెల రోజుల ముందే ప్రమోషన్స్‌ స్టార్ట్‌ చేసి.. సినిమాకు ఉండాల్సి దానికంటే ఎక్కువగా హైప్‌ పెంచుతున్నారు. నిజానికి కూలీ, వార్‌ 2 సినిమాలు బాగున్నాయి. ఇంత హైప్‌ లేకుంటే రెండు సినిమాలు మంచి హిట్‌ టాక్ పడేది. కానీ, ప్రమోషన్స్‌లో నిర్మాతలు ఇస్తున్న ఓవర్‌ హైప్‌ సినిమాకు నెగిటివ్‌ అయ్యింది. ఒకవేళ ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్‌ లేకుండ ప్రేక్షకులు థియేటర్‌ వచ్చి ఉంటే ఈ చిత్రాలు బాగా ఆకట్టుకునేవి. రెండు సినిమాల్లోనూ యాక్షన్‌, స్టోరీ,స్క్రీన్‌ప్లే చాలా బాగున్నాయి. స్టార్‌ హీరోలు, డైరెక్టర్‌ సినిమా అంటే ఎలా ఉంటుందో అలానే ఉన్నాయి. కానీ, వారికి ఉన్న క్రేజ్‌ను నిర్మాతలు గట్టిగా వాడేలా ఉద్దేశంతో మూవీకి విపరీతమైన బజ్ పెంచేశారు. సినిమాలో ఉన్నదానికి మించి ఇంకేదో ఉందంటూ ఆడియన్స్‌ను ఉహాల్లో తెలిపోయేలా చేశారు.

రిలీజ్ ముందు ఓవర్ హైప్

దీంతో ప్రేక్షకుల్లో అంచానాలు ఆకాశాన్ని తాకాయి. మూవీలో ఇంకేదో కొత్తగా ఉంది, ప్రధాన పాత్రల్లో ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఎలివేషన్స్‌ ఇచ్చారనే అభిప్రాయాలను క్రియేట్‌ చేశాయి రెండు సినిమాల ప్రమోషన్స్‌. సోషల్‌ మీడియాను కూడా వాడి గట్టి ప్రచారం చేసుకున్నారు. ఇంకేముందు ప్రతి ఒక్కరిలో ఈ సినిమాలపై అంచనాలు భారీగా పెరిగాయి. సినిమాల్లో వావ్‌ అనిపించేలా దర్శకుడు ఏం ప్లాన్‌ చేశాడోనంటూ భూజాలు ఎగిరేస్తూ వచ్చిన అభిమానులు, ప్రేక్షకులు కొత్తదనం కనిపించలేదు. సదరు దర్శకులు పనితీరు ఎలాంటిదో అందరికి తెలిసిందే. వారి వారి కెపాసిటిలోనే సినిమాలు ఉన్నాయి.

తప్ప.. ప్రేక్షకుడు కొత్తగా, థ్రిల్‌ అయ్యే అంశాలేవి రెండు సినిమాల్లోనూ కనిపించలేదు. సినిమాకు వచ్చిన ఆడియన్స్‌ థ్రిల్‌ అవుతారంటూ, ఊహించని సీన్స్‌ మిమ్మల్ని అబ్బురపరుస్తాయంటూ ప్రచారం చేశాయి మూవీ టీం. అలాంటివి థియేటర్లలో కనిపించకపోవడంతో ఆడియన్స్‌ కాస్తా నిరాశ పడ్డారు. దీంతో రెండు సినిమాలు యావరేజ్‌ టాక్‌కే పరిమితం అయ్యాయి. దీనికి కారణం నిర్మాతలు ఇచ్చిన ఓవర్‌ హైప్‌ అనాలి. నిజానికి కూలీ,వార్‌ 2లు మంచి సినిమాలు. రెండు కూడా హిట్‌ పడాల్సిన చిత్రాలే. కానీ, రిలీజ్‌ ముందు ఇచ్చిన ఓవర్‌ హైప్, బజ్‌ వల్ల హిట్‌ పడాల్సిన సినిమాకి యావరేజ్‌ టాక్‌ వస్తుంది. కూలీ, వార్‌2 పరిస్థితి చూసి నిర్మాతల వల్లే సినిమాలు పోతున్నాయి. వారి సినిమాను వారే చంపేసుకుంటున్నారని ట్రేడ్‌ పండితులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: OTT Movie: వీళ్లేం మనుషులురా బాబు? అంత్యక్రియల్లో పొట్టచక్కలయ్యే కామెడీ, ఈ మలయాళ మూవీ అస్సలు మిస్ కావద్దు

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×