E-Paper
Advertisement

Cm Revanth Reddy: నేషనల్ అవార్డు విన్నర్లకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక అభినందనలు 

Cm Revanth Reddy: నేషనల్ అవార్డు విన్నర్లకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక అభినందనలు 
Advertisement

Cm Revanth Reddy: 2023 సంవత్సరానికి సంబంధించి నేషనల్ అవార్డ్స్ ను రీసెంట్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. నేషనల్ అవార్డు విన్నర్ లని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ సత్కరించక ముందే సైమా సత్కరించటం అనేది మంచి పరిణామం. ఇండస్ట్రీలో ఎవరు కుంపటి వాళ్ళదే అని అల్లు అరవింద్ కూడా చెప్పారు. ఇక తాజాగా నేషనల్ అవార్డ్స్ అందుకున్న వాళ్ళందరిని సీఎం రేవంత్ రెడ్డి పిలిచి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

రేవంత్ రెడ్డి సన్మానం

Advertisement

భార‌తీయ సినిమా నిర్మాణానికి కేంద్రంగా హైద‌రాబాద్ ను నిల‌పాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. సినిమా రంగం ప్రోత్సాహాకానికి అవ‌స‌ర‌మైన చేయూత అందిస్తామని ఆయ‌న తెలిపారు. 71వ జాతీయ ఫిల్మ్ అవార్డ్సుల్లో వివిధ విభాగాల్లో ఎంపికైన సినీ ప్ర‌ముఖులు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డిని ఆయ‌న నివాసంలో సోమ‌వారం సాయంత్రం మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. సినిమా ప‌రిశ్ర‌మ ఎదుర్కొంటున్న స‌వాళ్ల‌ను సినీ ప్ర‌ముఖులు ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

అనంత‌రం ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అవార్డు గ్ర‌హీత‌లైన భ‌గ‌వంత్ కేస‌రి సినిమా డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి, హ‌ను మాన్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ‌, హ‌ను మాన్ సినిమాకు విజువ‌ల్ ఎఫెక్ట్ కు సంబంధించి వెంక‌ట్‌, శ్రీనివాస్, టీమ్ స‌భ్యులు, ఫైట్ మాస్ట‌ర్స్ నందు, పృథ్వీ, బేబి సినిమా డైరెక్ట‌ర్ సాయి రాజేశ్‌, సింగ‌ర్ రోహిత్ ల‌ను స‌న్మానించారు. కార్య‌క్ర‌మంలో హ‌ను మాన్ సినిమా నిర్మాత‌లు చైత‌న్య రెడ్డి, నిరంజ‌న్ రెడ్డి, బేబి సినిమా నిర్మాత ఎస్కేఎన్‌, భ‌గ‌వంత్ కేస‌రి నిర్మాత గార‌పాటి సాహు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

Also Read : Skn: ఇలా అయితే సినిమాలు నిర్మించలేం, తేల్చి చెప్పేసిన నిర్మాత

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×