E-Paper
Advertisement

Thalaivar 173: ఎట్టకేలకు దొరికేసిన డైరెక్టర్..ఫలితం సంగతేంటి?

Thalaivar 173: ఎట్టకేలకు దొరికేసిన డైరెక్టర్..ఫలితం సంగతేంటి?
Advertisement

Thalaivar 173: సౌత్ సూపర్ స్టార్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న రజనీకాంత్ (Rajinikanth) ఏడుపదుల వయసు దాటినా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఈ వయసులో కూడా యాక్షన్ పర్ఫామెన్స్ తో ఎంతోమంది యంగ్ హీరోలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్న ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న రజినీకాంత్.. గత ఏడాది చివరిగా కూలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కలెక్షన్ల పరంగా పరవాలేదు అనిపించుకున్నా.. కంటెంట్ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఈ సినిమాకి పోటీగా వచ్చిన హిందీ చిత్రం వార్ 2 కూడా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇందులో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటించిన విషయం తెలిసిందే. అంతేకాదు ఇది ఎన్టీఆర్ కి తొలి హిందీ చిత్రం కూడా కావడం గమనార్హం.

రజనీకాంత్ 173 మూవీకి డైరెక్టర్ ఫిక్స్..

ఇదిలా ఉండగా తాజాగా రజనీకాంత్ నటించిన మరో చిత్రం జైలర్ 2. గతంలో వచ్చిన జైలర్ సినిమాకి సీక్వెల్ ఇది. ఇక ఈ సినిమా తర్వాత కమలహాసన్ ప్రొడక్షన్ హౌస్ లో రజనీకాంత్ తన 173వ చిత్రాన్ని చేయబోతున్నారు అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వినిపించాయి. ఈ విషయాన్ని కమలహాసన్ అధికారికంగా ప్రకటించారు కూడా.. అయితే డైరెక్టర్ కోసం గత కొన్ని రోజులుగా వెతుకుతున్నారు. ఎంతోమంది పేర్లను తెరపైకి తీసుకువచ్చారు. కానీ ఇప్పుడు చివరిగా ఒక యంగ్ డైరెక్టర్ ను ఫిక్స్ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. తలైవార్ 173 అంటూ రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి డైరెక్టర్ ను అనౌన్స్ చేస్తూ ఒక చిన్న గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్.

డైరెక్టర్ ఎవరంటే?

Advertisement

విషయంలోకి వెళ్తే.. లోక నాయకుడు కమలహాసన్ నిర్మాతగా రాజ్ కమల్ ఫిలిమ్స్ బ్యానర్ పై రజినీకాంత్ 173 చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రానికి సిబి చక్రవర్తి దర్శకత్వం వహించనున్నారు. గతంలో ఈయన శివ కార్తికేయన్ తో కలిసి డాన్ సినిమా చేశారు. అలాంటి ఈయన ఇప్పుడు రజనీకాంత్ మూవీకి దర్శకత్వం వహించనున్నారు. ఇక ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా పంచుకున్న పోస్టర్తో పాటు “ప్రతి ఫ్యామిలీకి ఒక హీరో ఉంటారు ” అని ట్యాగ్ లైన్ ను కూడా యాడ్ చేశారు. దీంతో ఈ పోస్టర్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

విడుదల తేదీ కూడా రివీల్..

ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాకి తాజాగా విడుదల తేదీని కూడా ప్రకటించారు. వచ్చే (2027)సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదలకు సిద్ధం చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయం తెలిసి రజనీకాంత్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఈ సినిమాకి మొదట ప్రముఖ డైరెక్టర్ సుందర్ సి దర్శకత్వం వహించాల్సి ఉంది. కానీ ఆయన కొన్ని కారణాలవల్ల ఈ సినిమా నుండి తప్పుకోవడంతో ఇప్పుడు సిబి చక్రవర్తిని రంగంలోకి దింపారు మేకర్స్. మరి వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Advertisement

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×