E-Paper
Advertisement

Chitrapuri Housing Society : చిత్రపురిలో 43 కోట్ల స్కాం.. ప్రెసిడెంట్ ఫస్ట్ రియాక్షన్

Chitrapuri Housing Society : చిత్రపురిలో 43 కోట్ల స్కాం.. ప్రెసిడెంట్ ఫస్ట్ రియాక్షన్
Advertisement

Chitrapuri Housing Society : చిత్రపురి హౌసింగ్ సొసైటీలో 43 కోట్ల స్కాం జరిగిందని ప్రభుత్వం నియమించిన కమిటీ తెల్చి చెప్పింది. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ఈ 43 కోట్లను వీరి దగ్గర నుంచి రికవరీ చేయాల్సిందే అంటూ కమిటీ రిపోర్ట్స్ ఇచ్చింది. ఆ లిస్ట్‌లో ప్రస్తుత చిత్రపురి హౌసింగ్ సొసైటీ ప్రెసిడెంట్ వల్లభేనేని అనిల్ కూడా ఉన్నాడు. తాజాగా ఆయన ఈ స్కాంపై బిగ్‌టీవీతో స్పందించాడు.

తన కంటే ముందు నుంచే కాంట్రాక్టర్లకు పెద్ద ఎత్తున అడ్వాన్సులు ఇచ్చారని ఆరోపణలు వచ్చాయని అన్నారు. 2019లో దీనిపై ఎంక్వయిరీ చేశారని, 111 కోట్ల వరకు కాంట్రాక్టర్లకు అడ్వాన్స్ ఇచ్చారని తెలినట్టు తెలిపారు. 111 కోట్లల్లో కొంత బ్యాంకు రుణాలు ఉన్నాయని వాటిని తీర్చినట్టు చెప్పుకొచ్చాడు. యువర్స్ కన్స్ట్రక్షన్, ఎస్విఆర్ కన్స్ట్రక్షన్, ఎస్ ఎల్ ఎన్ కంపెనీలకు ఎక్కువ అడ్వాన్స్ లు ఇచ్చారని కమిటీ గుర్తించిందని అన్నారు. కమిటీలో ఉన్న కొంతమంది సభ్యులు వారి స్వార్థం కోసం కాంట్రాక్టర్లకు పెద్ద మొత్తంలో అడ్వాన్సులు ఇచ్చారని ఆరోపించారు.

43 కోట్లు రికవరీ లిస్ట్ గురించి..

Advertisement

43 కోట్ల స్కాంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం విధించిన కమిటీ విచారణ చేసిన తర్వాత 43 కోట్లు రికవరీ చేయాల్సిన లిస్ట్‌లో తన పేరు కూడా ఉందని వల్లభనేని అనిల్ అన్నారు. 100 కోట్లు తానే అక్రమంగా సంపాదించినట్టు కావాలని ప్రచారం చేస్తున్నారని అన్నారు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. దానికి కట్టుబడి ఉన్నట్టు తెలిపారు.

తప్పు ఎవరూ చేయకపోతే స్కాం ఎలా జరిగింది..?

43 కోట్ల స్కాం జరిగిందని ప్రభుత్వం నియమించిన కమిటీ స్పష్టం చెప్పింది. కానీ, తన హాయంలో తాను తప్పుచేయలేదు.. కొంత మంది సభ్యుల వల్ల ఇలా జరిగింది అంటూ వల్లభనేని వంశీ చెబుతున్నారు. మరి కమిటీ చెప్పిన లిస్ట్ లో ఈయన పేరు ఎందుకు ఉంది??? అనే దానికి మాత్రం సమాధానం రాలేదు.

Advertisement

వల్లభనేని వంశీ నేతృత్వంలోని సొసైటీ మాత్రమే కాదు… ఇతనికి ముందు అధ్యక్షుడిగా చేసిన కొమరం వెంకటేష్ నేతృత్వంలోని సొసైటీలో కూడా ఈ స్కాం ఉందనే ఆరోపణలు వచ్చాయి. నిన్నటి ప్రభుత్వ కమిటీ కూడా అదే చెప్పింది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×