E-Paper
Advertisement

Mana shankara vara prasad GaruTrailer: మాస్ కే బాస్ లా ఉన్నావ్… ఇంట్రెస్టింగ్ గా మన శంకర వరప్రసాద్ గారు ట్రైలర్ !

Mana shankara vara prasad GaruTrailer: మాస్ కే బాస్ లా ఉన్నావ్… ఇంట్రెస్టింగ్ గా మన శంకర వరప్రసాద్ గారు ట్రైలర్ !
Advertisement

MSVPG Trailer: టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి (Chiranjeevi)క్రేజ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర వరప్రసాద్ గారు(MSVPG) అనే సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా విడుదల కు కేవలం 8 రోజులు సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పలు పాటలు, టీజర్, పోస్టర్లు సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి. ఇకపోతే తాజాగా చిత్ర బృందం బృందం ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం తిరుపతిలో జరిగింది. నేడు ఉదయం చిత్ర బృందం వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని అనంతరం తిరుపతిలో సంక్రాంతి సంబరాలలో పాల్గొన్నారు. ఆ తరువాత ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

అంచనాలు పెంచిన ట్రైలర్..

ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ట్రైలర్ విషయానికి వస్తే.. ఈ ట్రైలర్ లో యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు కామెడీ, ఫ్యామిలీ సన్నివేశాలను కలబోస్తూ ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ వీడియో అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. చివరిలో వెంకటేష్ గ్రాండ్ ఎంట్రీ ట్రైలర్ కు హైలైట్ గా నిలిచింది. ఇక ట్రైలర్ లో నయనతార, చిరంజీవి మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇలా ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఈ ట్రైలర్ సినిమా పట్ల మరిన్ని అంచనాలను పెంచేయడమే కాకుండా ,సంక్రాంతి పండుగకు పర్ఫెక్ట్ సినిమా అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ఇక ఈ సినిమాలో చిరంజీవి నయనతారతో పాటు మరొక హీరోయిన్ కేథరిన్ కూడా సందడి చేయబోతున్నారు. ఈ సినిమాలో చిరంజీవి రాఏజెంట్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారని తాజాగా విడుదల చేసిన ట్రైలర్ చూస్తేనే స్పష్టం అవుతుంది. ఈ సినిమా జనవరి 12వ తేదీ విడుదల కాగా, 11వ తేదీ నుంచి ప్రీమియర్లు ప్రసారం కాబోతున్నాయి. ఇక ఈ సినిమాని షైన్ స్క్రీన్ బ్యానర్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదేల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ఫై మెగా అభిమానులు కూడా బోలెడు ఆశలు పెట్టుకున్నారు.

సంక్రాంతి బ్లాక్ బస్టరే

Advertisement

చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తరువాత అనుకున్న స్థాయిలో ఏ సినిమా ద్వారా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయారు మరి శంకర్ వరప్రసాద్ గారు సినిమా అయినా మంచి సక్సెస్ అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకుడుగా వ్యవహరించడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి . ఇప్పటివరకు అనిల్ డైరెక్షన్లో వచ్చిన సినిమాలు ఏవి ప్రేక్షకులను నిరాశపరచలేదు దీంతో చిరు సినిమాపై కూడా అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి.

Also Read: MSVPG Film: మన శంకర వరప్రసాద్ గారిలో వెంకీ పాత్ర లీక్.. అనిల్ ప్లానింగ్ అదుర్స్ ?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×