E-Paper
Advertisement

Chiranjeevi: చేతికి సర్జరీ…అభిమానుల కోసం తరలివచ్చిన చిరు..ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

Chiranjeevi: చేతికి సర్జరీ…అభిమానుల కోసం తరలివచ్చిన చిరు..ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
Advertisement

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఇటీవల మన శంకర వరప్రసాద్ గారు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో తదుపరి సినిమాలపై దృష్టి సారించారు.. త్వరలోనే ఈయన బాబీ డైరెక్షన్లో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా చిరంజీవి ఇటీవల తన కుటుంబ వేడుకలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. తనకు మనవడు మనవరాలు జన్మించడంతో ఈ చిన్నారుల బారసాల వేడుక కార్యక్రమాలలో బిజీ అయ్యారు. అయితే తాజాగా చిరంజీవి తన అభిమానులను కూడా కలుసుకున్నారు.

చిరంజీవి భుజానికి సర్జరీ..

చిరంజీవి ఇండస్ట్రీలో కొనసాగుతూనే బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతోమందికి ఎన్నో విధాలుగా సహాయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే నేడు చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ సందర్శించారు అక్కడ తన అభిమానులతో కలిసి పలు విషయాల గురించి ముచ్చటించడమే కాకుండా వారితో కలిసి ఫోటోలు దిగారు. ఇకపోతే చిరంజీవి ఎడమ భుజంకు చిన్నపాటి సర్జరీ జరిగిందని తెలుస్తోంది ఇలా సర్జరీ కారణంగానే చిరంజీవి షోల్డర్ బ్యాగ్ వాడుతున్నారని సమాచారం. ఇలా చేతికి షోల్డర్ బ్యాగ్ తోనే ఈయన అభిమానులను కలవడానికి వచ్చారు. అభిమానులతో ముచ్చటించిన అనంతరం వారితో కలిసి ఫోటోలు దిగడం కోసం తన షోల్డర్ బ్యాగ్ పక్కనపెట్టి కాస్త నొప్పిని బరిస్తూనే అభిమానులతో సెల్ఫీలు దిగారు.

నొప్పి భరిస్తూనే ఫోటోలు..

Advertisement

ఇలా ఒక వైపు నొప్పితో బాధపడుతున్న , అభిమానుల కోసం నొప్పిని భరిస్తూ వారితో కలిసి ఓపికగా ఫోటోలు దిగారు. ప్రస్తుతం చిరంజీవికి సంబంధించిన ఈ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా చిరంజీవి ఓపికకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్టు కొట్టారు. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ బాబి దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్ అయ్యారు. ఈ సినిమా చిరంజీవి కెరీర్ లో 158వ సినిమా గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిజానికి ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులు ప్రారంభం కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది.

Advertisement

ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతుందంటూ వార్తలు వస్తున్నాయి కానీ చిత్ర బృందం మాత్రం అధికారకంగా వెల్లడించలేదు. ఇదివరకే బాబి, చిరంజీవి కాంబినేషన్లో వాల్తేరు వీరయ్య సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకున్న నేపథ్యంలో ఈ సినిమాపై కూడా భారీగా అంచనాలు ఉన్నాయి ఇక ఈ సినిమా కలకత్తా గ్యాంగ్ స్టర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోందంటూ వార్తలు బయటకు వచ్చాయి కానీ చిత్ర బృందం మాత్రం ఈ సినిమా నేపథ్యం ఏంటి ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయాలను మాత్రం వెల్లడించలేదు. ఇక ఈ సినిమాలో ప్రియమణి హీరోయిన్ గా నటించబోతున్నట్టు సమాచారం.

Also Read: Sharwanand: శర్వానంద్ జోడిగా ఎన్టీఆర్ బ్యూటీ.. నారీ నారీ నడుమ మురారి హిట్టుతో పెరిగిన క్రేజ్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×