E-Paper
Advertisement

Trolls Target Megastar Chiranjeevi: చిరంజీవిపై అసభ్యకర ట్రోల్స్.. రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు

Trolls Target Megastar Chiranjeevi: చిరంజీవిపై అసభ్యకర ట్రోల్స్.. రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు
Advertisement

Trolls Target Megastar Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవిపై రెచ్చిపోతున్న ‘ట్రోలర్స్’కు గట్టి షాక్ తగిలింది.గత కొన్ని రోజులుగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చిరంజీవి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా టార్గెట్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారం ఇప్పుడు పోలీస్ స్టేషన్‌కు చేరింది.మెగా స్టార్ ని కించపరుస్తూ పోస్టులు పెట్టడం సీరియస్ గా తీసుకున్న మెగా ఫ్యాన్స్ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు.

ఇంతకీ ఏం జరిగింది?

Advertisement

కొన్నిరోజులుగా ఇన్‌స్టాగ్రామ్‌లోని కొన్ని అకౌంట్ల నుంచి చిరు ఇమేజ్ ని డ్యామేజ్ చేసేలా అత్యంత నీచమైన రీతిలో కొన్ని పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. దీంతో కేవలం వ్యూస్ కోసం ఫాలోవర్ల కోసం ఒక లెజెండరీ నటుడిపై ఇలాంటి వికృత ప్రచారానికి దిగడంపై ‘మెగా ఫ్యాన్స్’ ఫైర్ అవుతున్నారు.ఇప్పటికే  #Chiranjeevi మరియు #CyberSafety వంటి హాష్ ట్యాగ్‌లు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి.ఇక ఫిర్యాదు అందిన వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులు ఐటీ యాక్ట్ (IT Act) లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారని తెలుస్తుంది.మొత్తానికి చిరంజీవి ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదుతో సీన్‌లోకి ఎంటర్ అయిన జూబ్లీహిల్స్ పోలీసులు.. ఈ విషయాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకున్నట్టె కనిపిస్తుంది.

సైబర్ క్రైమ్ టీమ్ రంగంలోకి
నిందితులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని, వారి ఐపీ అడ్రస్‌లను ట్రాక్ చేసేందుకు సైబర్ క్రైమ్ టీమ్ రంగంలోకి దిగిందని సమాచారం .ఇలా “అభిమానం పేరుతోనో, కక్షతోనో సోషల్ మీడియాలో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై దాడి చేస్తే జైలు గడప తొక్కక తప్పదు” అని హెచ్చరిస్తున్నారు పోలీసులు.మరో వైపు చిరుపై ఇలా దాడులు జరగడంపై ఫిలిం ఇండస్ట్రీ కూడా షాక్ లో ఉంది.ఇక గతంలో కూడా పలువురు టాలీవుడ్ స్టార్లపై ఇలాంటి దాడులు జరిగిన సంగతి తెల్సిందే . అటు సోషల్ మీడియాలోనూ మెగా అభిమానులు ‘సైబర్ క్రిమినల్స్’ను వదిలిపెట్టొద్దంటూ భారీ ఎత్తున పోస్టులు పెడుతున్నారు. అయితే పోలీసుల సీరియస్ నెస్ చూస్తుంటే ఈసారి పోలీసులు రూట్ మార్చి నిందితులను పట్టుకునేందుకు పకడ్బందీగా నిందితులను గుర్తించి కటకటాల వెనక్కి నెట్టే అవకాశం కనిపిస్తోంది. ఏది ఏమైనా సెలబ్రిటీలను టార్గెట్ చేసే ఈ చీడపురుగుల్ని పట్టుకుని కటకటాల వెనక్కి నెడితే ఇలాంటి బ్యాచ్‌లకు ఈ కేసు ఒక గుణపాఠం అవుతుందని భావిస్తున్నారు విశ్లేషకులు.

Advertisement

also read :priyadarshi:ప్రియదర్శి పనైపోయిందా? ‘బలగం’ క్రేజ్ అంతా బూడిదలో పోసిన పన్నీరేనా?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×