// // Global Summit 2025- చిరంజీవిగా మాత్రమే ఈ సమ్మిట్‌కి రాలేదు.. -->
E-Paper
Advertisement

Global Summit 2025: చిరంజీవిగా మాత్రమే ఈ సమ్మిట్‌కి రాలేదు.. మెగాస్టార్‌ ఆసక్తికర కామెంట్స్‌

Global Summit 2025: చిరంజీవిగా మాత్రమే ఈ సమ్మిట్‌కి రాలేదు.. మెగాస్టార్‌ ఆసక్తికర కామెంట్స్‌
Advertisement

Chiranjeevi at Global Summit: తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌లో మెగాస్టార్‌ చిరంజీవి పాల్గొని మాట్లాడారు. రెండు రోజులు సమ్మిట్‌లో మంగళవారం జరిగిన సినిమా రైజింగ్‌ 2047 సెషన్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నేడు పాల్గొన్న ఆయన ముందుగా సీఎం రేవంత్‌ రెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం ఈ సమ్మిట్‌లో చిరంజీవి మాట్లాడుతూ.. “ఇంతగొప్ప సదస్సులో తనని భాగం చేసినందుకు సీఎం రేవంత్‌ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి పలిచేందుకు మంత్రులు వచ్చినప్పుడు తాను అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్‌లో ఉన్నాను.

కాస్తా ఇబ్బందిగా అనిపించింది

Advertisement

వారు నా దగ్గరి వచ్చే సమయానికి షూటింగ్‌ లో భాగంగా హీరోయిన్‌తో డ్యాన్స్‌ చేస్తు ఉన్నాను. ఆ పరిస్థితులో వారిని చూస్తే కాస్తా ఇబ్బందిగా అనిపించింది. వెంటనే షూటింగ్ ఆపేమని చెప్పి వారిని కలిస్తే అర్థమైంది. ఇంత గొప్ప సమావేశానికి నన్ను ఆహ్వానించాడానికి వచ్చారని అర్థమైంది. ఈ సమ్మిట్‌కి నన్ను పిలవడం చాలా గౌరవంగా భావిస్తున్నాను. నేను చిరంజీవి కాబట్టి నన్ను ఆహ్వానించారని నేను అనుకోవడం లేదు. సినిమా ఇండస్ట్రీ నుంచి అన్ని తెలిసిన వ్యక్తి వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నన్ను సినిమా ఇండస్ట్రీ ఏజెంట్ గా‌ పిలిచారని అనుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి చిరంజీవిగా రాలేదు. మూవీ ఇండస్ట్రీ ప్రభుత్వానికి రిప్రెజెంట్‌ చేసే వ్యక్తిగా వచ్చాను. హైదరాబాద్‌ని సినిమా హబ్‌గా మార్చడం ఇది గొప్ప మార్పు. ఇది సినిమా ఇండస్ట్రీ ఉన్న అభిమానం, ఇష్టంతో సీఎం రేవంత్‌ రెడ్డి తీసుకున్న నిర్ణయం” అని పేర్కొన్నారు.

Also Read: Akhanda 2: అఖండ 2 హిట్‌ కొట్టాలి.. మూవీ పోస్టర్‌తో శబరిమల కొండ ఎక్కిన అయ్యప్ప భక్తుడు

Advertisement

ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా

హైదరాబాద్‌ని మరింత అభివృద్ధి పరిచాలనే ఉద్దేశంతో తెలంగాణ రైజింగ్‌ పేరుతో ఈ గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహించడం నిజంగా సంతోషించే విషయం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కోసం సీఎంగా ఆయన చేస్తున్న కృషికి ఇది నిదర్శనం. ప్రపంచానికే అద్భుతమైన సినిమా హబ్‌ గా హైదరాబాద్‌ని చేయడంలో మేమందరం ముందుంటాం. బాలీవుడ్‌ నుంచి కూడా అజయ్‌ దేవగన్, సల్మాన్‌ ఖాన్‌ వంటి స్టార్స్‌ వచ్చిన ఇక్కడ అత్యాధునిక టేక్నాలజీ స్టూడియోలను లాంచ్‌ చేస్తామని చెప్పడం శుభారంభం. దీనికి అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్‌ వంటి ఇతర హీరోలు, నిర్మాతలంత ముందుకు వచ్చిన చేయాలని ఆసక్తి చూపిస్తుండటం ఆనందంగా ఉంది. వారంత సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి ఎంతో పాటుపడి ఉన్నారనడంతో అతిశయోక్తి కాదు. తెలంగాణ రైజింగ్‌ పేరుతో సమ్మిట్‌ నిర్వహించిన సీఎం రేవంత్‌ రెడ్డికి నా హ్యాట్సాఫ్‌ అన్నారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×